News


ఈ చిన్న షేర్లు.. ఫండ్స్‌ ఫేవరెట్స్‌

Monday 27th January 2020
Markets_main1580117632.png-31240

క్యూ3లో మ్యూచువల్‌ ఫండ్స్‌ షాపింగ్‌
జాబితాలో నారాయణ, ఎఫ్‌డీసీ, ఇప్కా
మిధానీ, జూబిలెంట్‌ ఫుడ్‌, ఫీనిక్స్‌ మిల్స్‌
ఇటీవల ర్యాలీలో ఈ స్మాల్‌ క్యాప్స్‌ జోరు

ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు మక్కువ చూపిన కంపెనీలు గత కొంతకాలంగా జోరు చూపుతున్నాయి. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఫండ్‌ హకౌస్‌లు కనీసం 1 శాతం వాటాను సొంతం చేసుకున్న కొన్ని చిన్న, మధ్యతరహా కంపెనీల కౌంటర్లు ఇదే కాలంలో ర్యాలీ బాటలో సాగుతూ వచ్చాయి. 40-15 శాతం మధ్య ఎగశాయి. ఈ కాలంలో బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4 శాతం పుంజుకుంది. అయితే ఇకపై సైతం ఈ కౌంటర్లు ర్యాలీ చేస్తాయా అంటే ఆయా కంపెనీల పనితీరు, రంగాల తీరుతెన్నుల ఆధారంగా కదలికలు ఉంటాయని మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు.  ఈ వారాంతాన వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌ కొన్ని రంగాలపై సానుకూల ప్రభావాన్ని చూపవచ్చని, మరికొన్ని రంగాలకు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చని అంచనా వేశారు. ప్రధానంగా కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తే.. ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు కొనుగోళ్లకు ఆసక్తి చూపే వీలున్నట్లు వివరించారు. ఇతర వివరాలు చూద్దాం..

జాబితా ఇలా
ఆసుపత్రుల నిర్వాహక సంస్థ నారాయణ హృదయాలయలో ఎంఎఫ్‌లు 1.58 శాతం వాటాను పెంచుకున్నాయి. దీంతో డిసెంబర్‌ చివరికల్లా 5.64 శాతానికి ఫండ్స్‌ వాటా చేరింది. ఇదే సమయంలో ఈ షేరు 37 శాతం పురోగమించింది. ఇదే విధంగా హెల్త్‌కేర్‌ కంపెనీ ఇప్కా లేబొరేటరీస్‌లో ఫండ్స్‌ వాటా 1.24 శాతం పెరిగి 22.76 శాతాన్ని తాకింది. ఈ షేరు 26 శాతం ర్యాలీ చేసింది. ఫార్మా కంపెనీ ఎఫ్‌డీసీలో ఎంఎఫ్‌ల వాటా 1.13 శాతం పుంజుకుని 6.58 శాతానికి చేరింది. ఈ షేరు 22 శాతం లాభపడింది. ఇక ఫండ్స్‌ 2 శాతం వరకూ వాటా కొనుగోలు చేసిన మిశ్రధాతు నిగమ్‌, జూబిలెండ్‌ ఫుడ్‌వర్క్స్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, ఫీనిక్స్‌ మిల్స్‌ సైతం​27-32 శాతం మధ్య ఎగశాయి.

ఇతర కౌంటర్లు సైతం
క్యూ3లో ఫండ్స్‌ దాదాపు 1-7 శాతం వరకూ వాటా పెంచుకున్న కంపెనీలలో రత్నమణి మెటల్స్‌, మైండ్‌ట్రీ, గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, క్వెస్‌ కార్ప్‌, ఐనాక్స్‌ లీజర్‌, జేకుమార్‌, క్రెడిట్‌ యాక్సెస్‌, డెల్టా కార్ప్‌ కౌంటర్లు సైతం 17-26 శాతం మధ్య ర్యాలీ చేశాయి.You may be interested

మారుతీ సుజుకీ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Monday 27th January 2020

బ్రోకరేజ్‌ల అంచనాలు డిసెంబర్‌ త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా రెండంకెల లాభాల వృద్ధి ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. అల్ప బేస్‌ ‍ప్రభావం, వాల్యూంల స్థిరీకరణతో లాభాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నాయి. సరాసరి అమ్మక ధరల పెరుగుదల కంపెనీ ఆదాయాలను పెంచవచ్చని భావిస్తున్నాయి. మంగళవారం మారుతీ తన క్యు3 ఫలితాలు ప్రకటించనుంది. డిమాండ్‌ అవుట్‌లుక్‌పై అంచనాలు, పండుగ సీజన్‌ అనంతర ట్రెండ్స్‌ తదితరాలను ఫలితాల సందర్భంగా నిశితంగా పరిశీలించాలని అనలిస్టులు చెబుతున్నారు. ఎకానమీలో

విదేశీ ఉత్పత్తులు మరింత ప్రియం

Monday 27th January 2020

బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపు..?  ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే  వార్షిక బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇతర దేశాల నుంచిద మన దేశానికి దిగుమతి అయ్యే 50పైగా వస్తువులపై దిగుమతి సుంకం పెరగనుంది.56 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, రసాయనాలు, హస్తకళలు వంటి దిగుమతులు ఈ జాబితాలో ఉన్నాయి. మొబైల్‌ చార్జర్స్‌, ఇండస్ట్రీయల్‌ కెమికల్స్‌, ల్యాంప్స్‌, చెక్కతో తయారు చేసిన

Most from this category