STOCKS

News


జవవరిలో ఫండ్‌ మేనేజర్లు కొన్న స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లివే..!

Thursday 13th February 2020
Markets_main1581580962.png-31760

మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు జనవరిలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించే మధ్య, చిన్న తరహా కంపెనీల షేర్ల కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు ఆసక్తి చూపించే కొన్ని ప్రధాన కంపెనీల షేర్లను ఇప్పుడు చూద్దాం..!

మ్యూచువల్‌ ఫండ్‌ పేరు: యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌
కంపెనీ పేరు: శ్రీరాం కో సిమెంట్‌
ప్రస్తుత ధర: రూ.779
కంపెనీ మార్కెట్‌ క్యాప్‌: రూ.18,348 కోట్లు
విశ్లేషణ: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వెస్ట్రన్‌ మార్కెట్లో శ్రీరాం కో సిమెంట్స్‌కు మంచి మార్కెట్‌ ఉంది. ఈ ప్రాంతాల్లో 50కేజీల బస్తా సిమెంట్‌ ధర జనవరిలో రూ.10 నుంచి రూ.20 మాత్రమే పెరిగింది. మార్కెట్‌ డిమాండ్‌ను పరిశీలిస్తే రానున్న రోజుల్లో సిమెంట్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంశం కంపెనీకి కలిసొచ్చే అంశం. సిమెంట్స్ వ్యయ నియంత్రణ, స్థిరమైన వాల్యూమ్ పెరుగుదల నుంచి రామ్‌కో సిమెంట్స్ ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

మ్యూచువల్‌ ఫండ్ పేరు: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్
కంపెనీ పేరు: క్వెస్‌ కార్ప్‌
ప్రస్తుత ధర: రూ 579
కంపెనీ మార్కెట్‌ క్యాప్‌: రూ.8,540 కోట్లు
విశ్లేషణ: అన్ని ప్రధాన ఆదాయ మార్గాల్లో నిరంతర వృద్ధి కారణంగా ఫండ్ మేనజర్లు ఈ కంపెనీలో వాటా కొనుగోలుకు అమితాసక్తిని కనబరిచారు. నాలుగైదేళ్లలో దాని సాధారణ సిబ్బంది సంఖ్య రెండు రెట్లు ఎక్కువ పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల షేరు పతనంతో వాల్యూయేషన్‌ ఆకర్షణీయంగా మారాయి. 

మ్యూచువల్‌ ఫండ్‌ పేరు: ఎస్‌బీఐ మ్యూచవల్‌ ఫండ్‌
కంపెనీ పేరు: నారాయణ హృదయాలయ
ప్రస్తుత షేరు ధర: రూ.352
కంపెనీ మార్కెట్‌ క్యాప్‌: రూ.7,180 కోట్లు
విశ్లేషణ: తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు అందించే అతికొద్ది వైద్య సం‍స్థల్లో నారాయణ హృదయాలయ తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.మునుపటి ఆర్థిక సంవత్సరపు సెప్టెంబర్‌ త్రైమాసికంలో మూలధనంపై రాబడితో కంపెనీ లాభదాయత 9శాతం నమోదుకాగా, ఈసారి సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 18శాతానికి ఎగిసింది. ఇన్వెస్ట్‌మెంట్‌ సైక్లిలింగ్‌ ముగింపుతో ఆదాయంలో అధిక వృద్ధి, దాని ఆసుపత్రులలో ఆక్యుపెన్సీ రేట్లు పెరగడం, వ్యయాలు తగ్గించుకోవడం లాంటి ఇతర అంశాలు కంపెనీకి సహాయపడతాయి. 

మ్యూచువల్‌ ఫండ్‌ పేరు: ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌
కంపెనీ పేరు:- సీడీఎస్‌ఎల్‌
ప్రస్తుత షేరు ధర: రూ.292
కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ విలువ: రూ.3,058 కోట్లు
విశ్లేషణ: 35శాతం యాన్యుటీ,  42శాతం లావాదేవీలతో విభిన్నమైన ఆదాయాలను ఆర్జించడంతో పాటు నిలకడైన స్థిర వ్యయం తదితర కారణాలతో ధీర్ఘాకాలికి ఇన్వెస్టర్లను ఆకర్షించింది. మంచి నగదు ఉత్పత్తి, అధిక-రాబడి నిష్పత్తులు ఇన్వెస్టర్లకు అదనంగా ఉన్నాయి. అకాడెమిక్ రికార్డుల డిజిటలైజేషన్, జాబితా చేయని సంస్థలకు డిపాజిటరీ సేవలు, బీమా వస్తువుల రిపోజిటరీలు వంటి భవిష్యత్ అవకాశాలు వైవిధ్యీకరణకు అవకాశం ఇస్తాయి. 

స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లనే కాకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈసారి కొన్ని లార్జ్‌ క్యాప్‌ షేర్లలో సైతం వాటాలను పెంచుకున్నాయి. ఓరియంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌ లాంటి కంపెనీల్లో వాటాను పెంచుకున్నట్లు గణాంకాలు తెలిపాయి.You may be interested

క్యూ3- టొరంట్‌ పవర్‌ హైజంప్‌

Thursday 13th February 2020

ప్రోత్సాహకర ఫలితాల ఎఫెక్ట్‌ వాటాదారులకు రూ. 11.6 డివిడెండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ టొరంట్‌ పవర్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో టొరంట్‌ పవర్‌ నికర లాభం 76 శాతం పెరిగి రూ. 421 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం రూ.

ఎస్‌బీఐ దూకుడు.. కారణాలివి!

Thursday 13th February 2020

అగ్రస్థానానికి చేరిన ఎస్‌బీఐ ఫండ్‌ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ రెండో ర్యాంకు మార్చిలో క్రెడిట్‌ కార్డ్స్‌ విభాగం ఐపీవో  రూ. 10,000 కోట్ల సమీకరణ లక్ష్యం తాజాగా 3 శాతం పెరిగిన ఎస్‌బీఐ షేరు గత కొన్నేళ్లుగా పలు విభాగాలలో ప్రవేశించిన ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) దూకుడు చూపుతోంది. ఓవైపు క్రెడిట్‌ కార్డ్స్‌ బిజినెస్‌లో వేగవంతంగా ఎదుగుతూనే.. మరోపక్క మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) విభాగంలోనూ అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. తాజాగా నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) రీత్యా ఎస్‌బీఐ ఎంఎఫ్‌ దేశంలోనే

Most from this category