STOCKS

News


ఐఆర్‌సీటీసీ స్టాక్‌.. బఫెట్‌ మెచ్చే క్వాలిటీలు

Monday 21st October 2019
Markets_main1571598338.png-29014

ఐఆర్‌సీటీసీ తాజాగా మార్కెట్లో లిస్ట్‌ అవగా, ఇష్యూ ధరతో పోలిస్తే ఇప్పటికే 130 శాతం రాబడులను ఇచ్చింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12,448 కోట్లకు చేరుకుంది. ఈ స్టాక్‌కు వారెన్‌ బఫెట్‌ మెచ్చే బలాలు ఉన్నాయని, ఏ ధరలో అయినా (కరెక్షన్‌లో) కొనుగోలు చేసుకోవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ పేర్కొన్నారు. ఆయన విశ్లేషణ ఇలా ఉంది..

 

‘‘ఐఆర్‌సీటీసీ అన్నది వారెన్‌ బఫెట్‌ కొనుగోలు చేసే బలాలు కలిగిన స్టాక్‌. ఈ కంపెనీ రైల్వే క్యాటరింగ్‌, ఈ కేటరింగ్‌ సేవలు, ఎగ్జిక్యూటివ్‌ లాంజెస్‌, బడ్జెట్‌ హోటళ్లలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశీయ రైల్వే టికెట్లను అన్‌లైన్‌లో విక్రయించే సంస్థ ఐఆర్‌సీటీసీ ఒక్కటే. అలాగే కేటగింగ్‌ సర్వీసులు, స్టేషన్లలో, రైళ్లలో ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ విషయంలోనూ అధికారిక విక్రయ హక్కులు ఐఆర్‌సీటీసీకే ఉన్నాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం తమ పోర్ట్‌ఫోలియోకి యాడ్‌ చేసుకోతగిన మరో స్టాక్‌ ఇది. కరెక్షన్‌లో ఎప్పుడైనా కొనుగోలు చేసుకోవచ్చు. 

 

2003కు ముందు ప్రభుత్వం మారుతి సుజుకీలో 25 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ.125 చొప్పున విక్రయించింది. 2003 జూలై 9న స్టాక్‌ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇష్యూ ధర నుంచి చూస్తే 2017 డిసెంబర్‌ నాటి రూ.10,000 ధర వరకు 7,000 శాతం పెరిగింది. ఇప్పుడు మార్కెట్‌ విలువ పరంగా 12వ అతిపెద్ద స్టాక్‌. మారుతితో పోలిస్తే ఐఆర్‌సీటీసీ అనేది ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ పరంగా ఒకటిగానే అనిపించొచ్చు. కానీ, గేమ్‌ పూర్తిగా భిన్నమైనది. నాన్‌ ఏసీ టికెట్‌ బుకింగ్‌పై రూ.15 సర్వీస్‌ చార్జీ, ఏసీ టికెట్లపై రూ.30 సర్వీస్‌ చార్జీని వసూలు చేయడం అన్నది ఆదాయాలను గణనీయంగా పెంచుతుంది. బలమైన ఆదాయ ప్రొఫైల్‌, వ్యాపారంలో వైవిధ్యత, ఆరోగ్యకరమైన రిటర్నుల రేషియో, రుణ రహిత హోదా, మోనోపాలీ వ్యాపారం అంశాలతో ఈ స్టాక్‌ పట్ల ఎంతో బుల్లిష్‌గా ఉన్నాం’’ అని గౌరవ్‌గార్గ్‌ తెలిపారు.



You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Monday 21st October 2019

మహారాష్ట్ర ఎన్నికల  సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా రేపు (మంగళవారం) ప్రారంభమవుతుంది. కావున ఈ వారంలో స్టాక్‌ మార్కెట్ 4రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఇక శనివారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 246 పాయింట్ల లాభంతో 39,298 పాయింట్ల

లిక్విడ్‌ ఫండ్స్‌పైనా ఎగ్జిట్‌లోడ్‌

Monday 21st October 2019

లిక్విడ్‌ ఫండ్స్‌ అన్నవి అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకునేందుకు వీలున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు. ఇప్పటి వరకు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసి మరుసటి రోజు వెనక్కి తీసుకున్నా కానీ ఎటువంటి చార్జీలు లేవు. కానీ, ఇకపై ఆ అవకాశం లేదు. లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు, వారంలోపు తిరిగి వెనక్కి తీసుకుంటే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో దాదాపు అధిక భాగం పెట్టుబడులు ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచే

Most from this category