News


సెంట్రమ్‌ టాప్‌ పిక్స్‌

Friday 4th January 2019
Markets_main1546601709.png-23416

వచ్చే సంవత్సర కాలానికి సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఐదు టాప్‌ స్టాక్స్‌ను రికమండ్‌ చేస్తోంది
1. ఏసీసీ: టార్గెట్‌ రూ. 1820. మంచి రిటర్న్‌ రేషియో, బలమైన నిధుల సరఫరా ఉండి ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. దశాబ్దం తర్వాత సామర్ధ్య విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇటీవల అంబుజాతో కుదుర్చుకున్న ఒప్పందం, డీజిల్‌ ధరల్లో క్షీణత కలిసివస్తాయి.
2. బజాజ్‌ఆటో: టార్గెట్‌ రూ. 3075. దేశంలో అగ్రగామి టు, త్రీవీలర్‌ సంస్థల్లో ఒకటి. ద్వి, త్రిచక్ర వాహనాల దక్షిణాసియా ఎగుమతుల్లో 40 శాతం, మధ్యాసియా ఎగుమతుల్లో 40 శాతం, లాటిన్‌ అమెరికాకు చేసే ఎగుమతుల్లో 25 శాతం వాటా కంపెనీదే. దాదాపు 21 దేశాల్లో కంపెనీ విక్రయాలు సాగిస్తోంది. దేశీయంగా బలమైన అమ్మకాలు సాధిస్తోంది.
3. డీసీబీ బ్యాంకు: టార్గెట్‌ రూ. 205. రిటైల్‌, ఎస్‌ఎంఈ రంగంలో చొచ్చుకుపోతోంది. ఎంసీఎల్‌ఆర్‌ రేట్ల పెంపుతో ఇకపై మార్జిన్లలో వృద్ధి నమోదుకావచ్చు. కొత్తగా ఏర్పరిచిన శాఖలు బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తున్నాయి. బలమైన రుణవృద్ధి నమోదవుతోంది. ఆర్‌ఓఈ 14 శాతం వరకు ఉండొచ్చని అంచనా.
4. ఎస్‌బీఐ: టార్గెట్‌ రూ. 350. క్రెడిట్‌ వాతావరణం మెరుగవడం, బాండ్‌ఈల్డ్స్‌ కదలికలు అనుకూలంగా మారడం, ఎన్‌పీఏ అకౌంట్లలో రికవరీ.. బ్యాంకుకు కలిసిరానున్నాయి. లోన్‌గ్రోత్‌ మంచి పురోగతి సాధిస్తోంది. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎన్‌ఐఎం క్రమంగా 2.7 శాతానికి పెరగవచ్చని అంచనా.
5. టాటా మెటాలిక్స్‌: టార్గెట్‌ రూ. 1015. కంపెనీ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. త్వరలో ప్రారంభం కానున్న పీసీఐ ప్రాజెక్టుతో ఉత్పత్తి మరింత మెరుగుపడనుంది. డీఐ పైపుల మార్కెట్‌ను మరింత విస్తరించుకునే యత్నాల్లో ఉంది. వాల్యూషన్లు అందుబాటులో ఉన్నాయి. రీరేటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. You may be interested

పీపీఎఫ్‌ ఎప్పటికీ రాబడుల్లో రారాజే!

Friday 4th January 2019

ఈక్విటీలు అధిక రాబడులు ఇ‍స్తాయని మన చుట్టూ ఉన్న వారిలో నమ్మేవారు తక్కువే. అందుకేనేమో... ఇప్పటికీ ఈక్విటీల్లోకి పెట్టుబడులు 5 శాతానికి మించలేదు. ఎప్పుడు మార్కెట్లు పెరుగుతాయో తెలియదు, ఎప్పుడు పడిపోతాయో అర్థం కాదు. ఓ స్టాక్‌ స్వల్ప కాలంలోనే రెట్టింపు అవుతుంది. కుడి ఎడమైతే సగానికి పైగా పడిపోనూ వచ్చు. అందుకే రిస్క్‌ తీసుకోలేని వారు ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌ వంటి పథకాల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఎందుకంటే అవసరమైన సందర్భంలో

రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌

Friday 4th January 2019

10700 పైకి నిఫ్టీ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్ల ర్యాలీ రెండు రోజుల భారీ నష్టాలకు ముగింపు పలుకుతూ శుక్రవారం మార్కెట్‌ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ తిరిగి 10700 స్థాయిని అందుకోగా, సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభాల్ని కూడగట్టుకుంది. తగ్గిన ముడిచమురు ధరలు, రూపాయి డాలర్‌ మారకంలో బలపడటం, ఆసియాలో పలు మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ తదితర సానుకూలాంశాలతో నేడు మార్కెట్‌ దేశీయ మార్కెట్‌ లాభాలతో

Most from this category