News


ఫండ్‌మేనేజర్లు కొనేస్తున్నారు!

Wednesday 13th November 2019
Markets_main1573618058.png-29549

ఈక్విటీలపై పెరుగుతున్న బుల్స్‌ పట్టు
బోఫాఎంఎల్‌ సర్వేలో వెల్లడి
ఇప్పటివరకు నగదు నిల్వలు అట్టిపెట్టుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన గ్లోబల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు తాజాగా షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరీలించ్‌ సర్వే తెలిపింది. ఇప్పుడు కొనకపోతే ర్యాలీ మిస్సవుతామన్న భయంతో ఫండ్‌ మేనేజర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం పెంచారని తెలిపింది. అంతర్జాతీయ మందగమన భయాలు సమసిపోయాయని, బుల్స్‌ మళ్లీ పగ్గాలు చేపట్టారని, ఫోమో(ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌- ఇప్పుడు కొనకపోతే ర్యాలీ మిస్సవుతామన్న భయం) ​కారణంగా ఆశావహ పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపింది. దీంతో ఈక్విటీలు, సైక్లిక్స్‌లో కొనుగోళ్లు పెరిగాయని వివరించింది.

ప్రస్తుతం అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్ల వద్ద నగదు నిల్వలు 4.2 శాతానికి తగ్గాయని, గతనెల్లో ఇవి 5 శాతమని బోఫాఎంఎల్‌ తెలిపింది. 2016 ట్రంప్‌ ఎన్నికైన తర్వాత ఈ రేంజ్‌లో ఫండ్స్‌ వద్ద నగదు తగ్గడం ఇదే తొలిసారని, 2013 జూన్‌ తర్వాత ఇదే కనిష్ఠస్థాయని వివరించింది. సర్వేలో దాదాపు 230 ఫండ్‌ మేనేజర్లు పాల్గొన్నారు. రాబోయే ఏడాది కాలంలో అంతర్జాతీయ వృద్ధి మెరుగుపడుతుందని ఎక్కువ మంది మేనేజర్లు అభిప్రాయపడుతున్నారని సర్వే తెలిపింది. వీళ్ల ఫేవరెట్స్‌లో ఎక్కువగా యూఎస్‌ టెక్‌ స్టాకులున్నాయని, తర్వాత ఎక్కువగా యూఎస్‌ ట్రెజరీ బాండ్స్‌లోకి, ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ కార్పొరేట్‌ బాండ్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. 2020లో ఈక్విటీలు అన్ని సాధనాల కన్నా ఎక్కువ రాబడినిస్తాయని మేనేజర్లు అంచనా వేస్తున్నారు. ఈక్విటీల తర్వాత కమోడిటీలు బెటరని భావిస్తున్నారు. ఇక సర్వేలో అత్యధికులు వృద్ధికి ట్రేడ్‌వార్‌ అతిపెద్ద అడ్డంకిగా భావించారు. దాదాపు 39 శాతం మంది వాణిజ్యయుద్ధమే అతిపెద్ద రిస్కని చెప్పగా, 16 శాతం మంది బాండ్‌మార్కెట్‌ బబుల్‌ పెద్ద రిస్కని చెప్పారు. వీటి తర్వాత ద్రవ్యసమీక్షా విధానాలు పనిచేయకపోవడం, చైనాలో మందగమనం ఎక్కువ రిస్కుగా భావించారు. 



You may be interested

29 పైసలు నష్టపోయిన రూపీ

Wednesday 13th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్లో 29 పైసలు బలహీనపడి 71.75 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఖరారుపై అనుమానాలు రావడంతోపాటు, హాంగ్‌కాంగ్‌లో రాజకీయ అనిశ్చితి వలన సోమవారం సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 19 పైసలు న‍ష్టపోయి  71.46 వద్ద ముగిసింది. గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం(నవంబర్‌ 12) సెషన్‌లో ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు.    ‘యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు

ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు

Wednesday 13th November 2019

ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నప్పటికీ, భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రారంభంలో క్రితం ముగింపు 40,347 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,915 పాయింట్ల సమీపంలోనూ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 

Most from this category