News


ఆరు స్టాక్స్‌లో ఫండ్స్ భారీ పెట్టుబడులు

Sunday 18th August 2019
Markets_main1566139930.png-27839

జూలై నుంచి మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడం తెలిసిందే. దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ (మ్యూచువల్‌ పండ్స్‌, బీమా సం‍స్థలు) కొనుగోళ్లు మార్కెట్లను కొంత వరకైనా ఆదుకున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ముఖ్యంగా నిఫ్టీలో అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం. 

 

ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకరాం... జూలైలో లార్జ్‌క్యాప్‌, ఫోకస్డ్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ పథకాల్లోకి రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడులు తరలివచ్చాయి. ఫండ్‌ మేనేజర్లు లార్జ్‌క్యాప్‌లో బ్యాంకులు, యుటిలిటీలు, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీలో అధికంగా పెట్టుబడులు పెట్టగా, ఎన్‌బీఎఫ్‌సీలో పెట్టుబడులు తగ్గించుకున్నారు. వీటిల్లో ముఖ్యంగా ఆరు స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ.1,000 కోట్లకు పైనే షేర్లను కొనడం గమనార్హం. వీటిల్లో యాక్సిస్‌ బ్యాంకు టాప్‌లో నిలిచింది. ఈ కంపెనీకి చెందిన రూ.2,145 కోట్ల విలువైన షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకులో రూ.2,145 కోట్ల మేర ఫండ్స్‌ పెట్టుబడులు పెట్టాయి. గెయిల్‌లో రూ.1,251 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 1,179 కోట్లు, ఐటీసీలో రూ.1,056 కోట్లు, ఎల్‌అండ్‌టీలో రూ.1,051 కోట్ల విలువైన షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు కొనుగోలు చేశారు.

 

నిఫ్టీ బాస్కెట్‌లో రిలయన్స్‌లోకి రూ.952 కోట్లు, టీసీఎస్‌లోకి రూ.743 కోట్లు, ఎన్‌టీపీసీలోకి రూ.689 కోట్లు, టైటాన్‌లోకి రూ.512 కోట్లు, కోల్‌ ఇండియాలోకి రూ.432 కోట్లు, బజాజ్‌ ఫైనాన్స్‌లోకి రూ.383 కోట్ల మేర మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులు తరలివచ్చాయి. ఇంకా పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, కోటక్‌ బ్యాంకు, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, వేదాంతలోకి స్వల్పంగా పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎక్కువగా విక్రయాలు జరిపిన స్టాక్స్‌ను గమనిస్తే... ఇన్ఫోసిస్‌లో రూ.630 కోట్ల విలువైన షేర్లను ఫండ్‌ మేనేజర్లు విక్రయించారు. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌లో రూ.489 కోట్లు, యూపీఎల్‌లో రూ.458 కోట్లు, మైండ్‌ట్రీలో రూ.436 కోట్లు, ఐవోసీలో రూ.304 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఎస్‌బీఐ, జుబిలంట్‌ లైఫ్‌, ఎమ్‌అండ్‌ఎమ్‌, డాబర్‌, లుపిన్‌, సుందరం ఫైనాన్స్‌, పీఎన్‌బీ, ఆర్‌ఈసీ, అదానీ పవర్‌, టాటా మోటార్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, బ్రిటానియా, సెయిల్‌, హిందాల్కో, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఇన్ఫో ఎడ్స్‌ తదితర స్టాక్స్‌లోనూ అమ్మకాలు చేశారు. You may be interested

మార్కెట్లు ముందుకా.. వెనక్కా..?

Sunday 18th August 2019

ఈక్విటీ మార్కెట్లు గత వారం కాస్త నిలదొక్కుకున్నాయి. నిఫ్టీ కీలకమైన 11,000 మార్క్‌పైన, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 37,000పైనే క్లోజవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక రంగ ఉద్దీపనకు పలు చర్యలను ప్రకటించొచ్చని, పలు రంగాలకు రాయితీలు ఉంటాయని, ఎఫ్‌పీఐలకు సర్‌చార్జీ మినహాయింపు ఉండొచ్చన్న అంచనాలే గత వారం మార్కెట్‌ను కుదురుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్‌ ఎలా ఉంటుందోనన్న సందేహం ఇన్వెస్టర్లలో నెలకొంది. దీనిపై యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో తొలి ఛార్జీసీటు నమోదు

Saturday 17th August 2019

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తొలి ఛార్జీషీట్‌ను నమోదు చేసింది. ముంబైలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం చార్జిషీట్ దాఖలైనట్లు అధికారులు ధృవీకరించారు. నిధుల సంక్షోభానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్లతో పాటు ఇతరుల పాత్ర మేరకు ఉందనే అంశాన్ని ఛార్జ్‌షీట్‌ తెలియజేస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బ్యాంకు ఖాతాలతో పాటు, ఢిల్లీ, ముంబై, చెన్నై, బ్రసెల్‌, బెల్జియం

Most from this category