News


మెటల్‌ షేర్లు డౌన్‌

Friday 31st January 2020
Markets_main1580465932.png-31377


కరోనా వైరస్‌ ప్రభావం మెటల్‌పై పడడంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు పతనమయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లోనూ శుక్రవారం మెటల్‌ షేర్లు పడిపోయాయి. నిఫ్టీలో మెటల్‌ ఇండెక్స్‌ 2 శాతం తగ్గి 2, 574 వద్ద ముగిసింది. జిందాల్‌ స్టీల్‌ 0.77 శాతం తగ్గి 177.00 వద్ద, వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌ 0.73 శాతం తగ్గి 172 వద్ద, రత్నమణి మెటల్స్‌ 0.36 శాతం తగ్గి 1,230 వద్ద, హిందుస్థాన్‌ జింక్‌ 0.41 శాతం తగ్గి194 వద్ద, మెయిల్‌, సెయిల్‌ , వేదాంత, ఎన్‌ఎండీసీ, టాటాస్టీల్‌, హిందాల్కో, హింద్‌ కాపర్‌,  ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నేషనల్‌ అల్యూమినియం 1-2 శాతం తగ్గుదలతో ముగిసాయి.  



You may be interested

బడ్జెట్‌ ముందురోజు మార్కెట్‌ డీలా

Friday 31st January 2020

సెన్సెక్స్‌ 190 పాయింట్లు డౌన్‌ 74 పాయింట్లు నీరసించిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ పతనం ఆర్థిక సర్వే, సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యాయి. చివరికి  ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 40,723 వద్ద నిలవగా.. నిఫ్టీ 74 పాయింట్ల వెనకడుగుతో 11,963 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తదుపరి ఆటుపోట్లను చవిచూశాయి.

బడ్జెట్‌పై మార్కెట్‌ 10 అంచనాలివి?!

Friday 31st January 2020

ద్రవ్యలోటును అదుపు చేస్తూనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి పెట్టుబడులను సమకూర్చవలసి ఉంది. మరోపక్క ఆర్థిక మందగమనానికి చెక్‌ పెట్టేందుకు పన్నుల్లో కోత విధించడం ద్వారా వినియోగ రంగానికి జోష్‌నివ్వవలసి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు, అందుబాటులో హౌసింగ్‌ తదితర చర్యలతోపాటు పలు సంస్కరణలకు తెరతీయవలసి ఉంది. ఈ నేపథ్యంలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌పై స్టాక్‌ మార్కెట్‌ పలు ఆశలు పెట్టుకున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తు‍న్నారు. వీటిలో ప్రధానంగా 10 అంచనాలను తెలియజేశారు.

Most from this category