News


బేరిష్‌గా మారుతున్న ఎఫ్‌పీఐలు

Friday 12th July 2019
Markets_main1562913412.png-27002

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బడ్జెట్‌ అనంతరం దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై బేరిష్‌గా మారుతున్నారు. బడ్జెట్‌ అనంతరం నాలుగు సెషన్లలో వీరు దాదాపు రూ.2వేల కోట్ల షేర్లు విక్రయించారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐలు బేరిష్‌బెట్స్‌ పెంచుకుంటున్నారు. అధికాదాయ వర్గాలపై పన్ను పెంపు, సర్‌చార్జీ విధింపులు ఎఫ్‌పీఐల సెంటిమెంట్‌ను దెబ్బతీసాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌ఐఐ లాంగ్‌ షార్ట్‌ నిష్పత్తి 47కు చేరువైంది. ఫిబ్రవరి తర్వాత ఈ నిష్పత్తి ఇంత స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఫ్యూచర్స్‌లో బేరిష్‌ బెట్స్‌ పెరిగాయనేందుకు ఇది నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. ఈ నిష్పత్తి 50కిపైన ఉంటే లాంగ్స్‌ ఎక్కువ ఉన్నట్లు భావిస్తారు. డైలీ చార్టుల్లో లోయర్‌ టాప్‌, లోయర్‌ బాటమ్స్‌ ఏర్పడుతున్నాయని, నిఫ్టీ పైకి వచ్చినా 11630- 11650 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఎదుర్కొంటుందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ తెలిపింది.

గురువారం బౌన్స్‌కు కారణం వరుస పతనాల వల్ల ఏర్పడిన ఓవర్‌సోల్డ్‌ పొజిషనేనని, మరి కొంత మేర ఈ బౌన్స్‌ కొనసాగవచ్చని తెలిపింది. అయితే అటు పిమ్మట మాత్రం మరోదఫా అమ్మకాల వెల్లువ వస్తుందని అంచనా వేసింది. ఆ దశలో నిఫ్టీ 11300 పాయింట్ల వరకు దిగజారవచ్చని తెలిపింది. ఆప్షన్స్‌లో 11300 వద్ద ఎక్కువ పుట్స్‌, 12000 పాయింట్ల వద్ద ఎక్కువ కాల్స్‌ ఉన్నాయి. బడ్జెట్లో ఆర్థిక పునరుజ్జీవానికి సరైన రూట్‌మ్యాప్‌ ఉంటుందని ఇన్వెస్టర్లు ఆశించగా, ‍ప్రభుత్వం ఆ దిశగా భారీ చర్యలు ప్రకటించకపోవడం మార్కెట్‌ను నిరాశ పరిచింది. ఎఫ్‌పీఐలు షార్ట్స్‌కు దిగడంతో ఇప్పట్లో సూచీలు భారీగా ముందంజ వేసే అవకాశాలు సన్నగిల్లాయి. నిఫ్టీ ఏమాత్రం పుంజుకున్నా 11600- 11700 పాయింట్ల మధ్య బహుళనిరోధాలు ఎదుర్కోవాల్సిఉంటుందని ఏంజల్‌ బ్రోకింగ్‌ తెలిపింది. You may be interested

ఆటో ఫలితాలు నిరుత్సాహకరం: బ్రోకరేజ్‌ల అంచనాలు

Friday 12th July 2019

  గత ఏడాది నుంచి దేశియ ఆటో రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. తగ్గిన డిమాండ్‌, అధిక బేస్‌, ప్రతికూల ఆపరేటింగ్‌ లెవరేజ్‌, లిక్విడిటీ సమస్యలు, అధికంగా రాయితీలు ప్రకటించడం వంటి వాటి వలన ఆటో రంగ జూన్‌ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్సరం నుంచి ప్రస్తుత తేది వరకు(వై టూ డీ) గల డేటా ప్రకారం మారుతి షేరు 38 శాతం

ఈ-కామర్స్‌లోకి బ్యాంక్ ఆఫ్ బరోడా

Friday 12th July 2019

బ్యాంకింగ్, వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫాం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తాజాగా ఈ-కామర్స్ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. తమ ఖాతాదారులకు వివిధ రకాల బ్యాంకింగ్‌ సేవలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను అందించడానికి ప్రత్యేకంగా 'డిజిటల్ కామర్స్ పోర్టల్‌' ఏర్పాటు చేస్తోంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడంలోను, నిర్వహించడంలోనూ తోడ్పాటు అందించే సంస్థల నుంచి బిడ్స్‌ను ఆహ్వానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. బిడ్ల దాఖలుకు జూలై

Most from this category