News


బుల్లిష్‌గా మారిన ఎఫ్‌పీఐలు

Monday 23rd September 2019
Markets_main1569260787.png-28501

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ప్రశంసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్‌ తర్వాత నుంచి భారత మార్కెట్‌ విషయంలో వారు బేరిష్‌ ధోరణితో వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. సుమారు రూ.30,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. బడ్జెట్‌లో వృద్ధిని పెంచే చర్యలు లోపించడం, జూన్‌ క్వార్టర్‌ జీడీపీ వృద్ధి 5 శాతానికి పడిపోవడం ఎఫ్‌పీఐలను అమ్మకాల వైపు నడిపించిందని చెప్పుకోవాలి. కానీ, కేంద్ర సర్కారు కార్పొరేట్లకు పన్నును 35 శాతం నుంచి 25.17 శాతానికి తగ్గించడాన్ని మంచి సానుకూల చర్యగా వారు చూస్తున్నారు. సోమవారం ఎఫ్‌పీఐలు 2,684 కోట్ల మేర కొనుగోళ్లు చేయడం దీన్నే సూచిస్తోంది. ఇంత భారీ కొనుగోళ్లు ఒక్క రోజులో చేయడం ఇటవలి కాలంలో ఇదే. 

 

‘‘నాకు ప్రతికూల దృక్పథం ఉండేది. కానీ, తాజా చర్యతో సానుకూలంగా మారింది. అతిపెద్ద ఆందోళన కలిగించే అంశం వృద్ధి నిదానించడం. ఈ పన్ను తగ్గింపు నిర్ణయం చాలా పెద్దది. ఆర్థిక రంగాన్ని వేగంగా ముందుకు కదిలిస్తుంది’’ అని నోర్డియా స్ట్రాటజిస్ట్‌ హెర్టా అలావా తెలిపారు. పన్ను తగ్గింపు స్టాక్‌ మార్కెట్లకు ఎంతో సానుకూలమని, కంపెనీల లాభాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గత శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ 5 శాతానికి పైగా పెరగ్గా, ఆ రోజు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కేవలం రూ.35.78 కోట్లుగానే ఉన్నాయి. కానీ, మన ఇనిస్టిట్యూషన్‌ ఇన్వెస్టర్లు మాత్రం రూ.3,001 కోట్ల మేర కొనుగోళ్లతో మార్కెట్లను వెర్రెక్కించారు. సోమవారం నాటికి ఎఫ్‌ఫీఐలు కూడా భారీ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ‘‘ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన తర్వాత మరింత మంది విదేశీ ఇన్వెస్టర్లు రావడాన్ని చూడొచ్చు. భారత స్టాక్‌ మార్కెట్‌ చాలా వేగంగా స్పందించింది. పెట్టుబడుల సైకిల్‌ కూడా ఊపందుకుంటే, రెండేళ్ల కాలంలో మార్కెట్లు మరింత పైకి వెళతాయి’’ అలావా అన్నారు. 

 

‘‘అయితే, కంపెనీలు అదనంగా వచ్చిన లాభాలను ఏం చేస్తాయన్నది చూడాలి. పెట్టుబడులను పెంచుతాయా లేక ధరలను తగ్గిస్తాయా లేక డివిడెండ్‌ను పెంచుతాయా?. ఒకవేళ పెట్టుబడులను పెంచితే అది ఆర్థిక రంగానికి ఎంతో సానుకూలం. కన్జ్యూమర్‌ ఉత్పత్తుల కంపెనీలు ధరలను తగ్గిస్తే వినియోగ డిమాండ్‌ పెరుగుతుంది’’ అని హెర్టా అలావా వివరించారు. ఆర్థిక మంత్రి నిర్ణయం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు జెఫరీస్‌ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌. దీంతో ద్రవ్యలోటుపై ఆందోళలను వదిలేయాలన్నారు. ‘‘వ్యాపార అనుకూల ప్రభుత్వ విధానాన్ని ఇది ధ్రువీకరిస్తోంది. అదే సమయంలో దీర్ఘకాల ద్రవ్య సర్దుబాటును వృద్ధి కోసం త్యాగం చేస్తుందని కూడా తెలియజేస్తోంది’’ అని ఎంఎన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ సీనియర్‌ స్ట్రాటజిస్ట్‌ మార్టీన్‌ జాన్‌ బక్కుమ్‌ అన్నారు. ద్రవ్యలోటు పెరుగుదలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత నిర్ణయాన్ని ఈక్విటీ మార్కెట్‌ ఇన్వెస్టర్లు స్వాగతించారని, రానున్న వారాల్లో ద్రవ్యలోటు ప్రభావంతో మళ్లీ మార్కెట్లు బలహీనపడొచ్చన్నారు.You may be interested

ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల పరుగు...

Monday 23rd September 2019

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ 2018 నుంచి చూసుకుంటే ఇంత వరకు పెద్దగా లాభాలను ఇచ్చింది లేదు. కానీ, బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ అప్రతిహతంగా ముందుకు సాగిపోతూనే ఉంది. మార్కెట్లలో గత ఏడాదిన్నరగా తీవ్ర అస్థిరతలు నెలకొని ఉన్నప్పటికీ... ఎల్‌ఐసీ గత మూడేళ్లలో తన ఈక్విటీ ఆస్తులను గణనీయంగా పెంచుకున్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది.    పాలసీ ప్రీమియం రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఎల్‌ఐసీ ఎన్నో సాధనాలపై ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది.

భారీ ర్యాలీకి కారణాలు..

Monday 23rd September 2019

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో గత సెషన్‌ నుంచి మార్కెట్‌లు దూసుకుపోతున్నాయి. గత సెషన్‌లో ప్రారంభమైన మార్కెట్‌ల ర్యాలీ సోమవారం కూడా కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 1,075 పాయింట్లు పెరిగి 39000 స్థాయిని అధిగమించి 39090.03 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 329.20 పాయింట్లు లాభపడి 11,600 పైన 11,603.40 వద్ద స్థిరపడింది. సూచీల చరిత్రలో రెండురోజుల పాటు

Most from this category