News


పరుగులు.. కొన్ని స్టాకుల్లోనే!

Tuesday 27th August 2019
Markets_main1566903099.png-28054

ఎఫ్‌పీఐలు తిరిగి వస్తాయి..

ర్యాలీ మాత్రం కొన్ని కౌంటర్లలోనే ఉంటుంది

నిపుణుల అంచనా

అమెరికా - చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో వర్థమాన దేశాల మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు తన పెట్టుబడులను భారీ స్థాయిలో వెనక్కి తీసుకుంటున్నారు. అందులో భాగంగా మన దేశీయ మార్కెట్‌ను ఎఫ్‌పీఐలు తన పెట్టుబడులను ఉపసంహరణకు ఇంతకాలం సర్‌ఛార్జీల పన్ను విధింపును ఇందుకు ఒక సాధనంగా వినియోగించుకుంచుకున్నారని విశ్లేషకులంటున్నారు. దాదాపు 39 సాక్టుల్లో ఎఫ్‌పీఐలకు మూడోవంతు వాటా ఉంది. వీటిలో 32 స్టాకులు, బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి 80శాతం క్షీణించాయి. వీటిలో 29 స్టాకులు ప్రదర్శన అంత్యంత అధ్వాన్నంగా ఉంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఎఫ్‌పీఐలు రూ.24,500 కోట్లను పెట్టబడులు వెనక్కి తీసుకున్నారు. అదే సమయంలో సెన్సెక్స్‌ 7శాతం క్షీణించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంపన్నలు, ఎఫ్‌ఫీఐల ధీర్ఘ, స్వల్పకాలిక మూలధన పన్నుపై విధించే అదనపు పన్ను ఎత్తివేస్తున్నట్లు గతవారాంతంలో ప్రకటించింది. ఈ తరుణంలో ఎఫ్‌పీఐలు క్రమంగా మార్కెట్లోకి రావచ్చని, కాకపోతే కేవలం ఇవి మక్కువ చూపే స్టాకులే ఇకపై భారీ ర్యాలీలు జరపవచ్చని నిపుణుల అంచనా. నిన్నటి ట్రేడింగ్‌లో మార్కెట్‌ నుంచి ఎఫ్‌పీఐలు రూ.753 కోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ.., ఎఫ్‌పీఐలకు ఎక్కువ వాటాలున్న స్టాకుల్లో మాత్రం సానుకూల వాతవరణం కనిపించింది.

ఎఫ్‌పీఐలకు ఇష్టమైన కొన్ని షేర్లు....

హెచ్‌డీఎఫ్‌సీ:- దేశంలో అతిపెద్ద తనఖా రుణ సంస్థగా పేరొందిన హెచ్‌డీఎఫ్‌సీ షేరు నిన్నటి ట్రేడింగ్‌లో 5.12శాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ నేడు 1.25శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఈ కంపెనీలో ఎఫ్‌పీఐల వాటా 74శాతం ఉంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఆగస్ట్‌ 23వరకు కంపెనీ రూ.45,500 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోంది. అలాగే ఈ ఏడాది ప్రారంభం నుంచి జూలై 5 కాలవ్యవధిలో కంపెనీ షేరు 15.66శాతం పెరిగింది.

యాక్సిస్‌ బ్యాంక్‌:- బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఆగస్ట్‌ 23వరకు ఈ బ్యాంకు షేరు 28శాతం క్షీణించింది. అలాగే ఈ ఏడాది ఆరంభం నుంచి జూన్‌ 5 వరకు కంపెనీ 30శాతం పెరిగింది. అలాగే నిన్నటి ట్రేడింగ్‌లో కంపెనీ 3శాతం పెరగ్గా, నేడు 1.50శాతం ర్యాలీ చేసింది.

జస్ట్‌ డయల్‌:- ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై5 వరకు కంపెనీ 53శాతం వరకు పెరగ్గా, బడ్జెట్‌ నాటి నుంచి కంపెనీ 12శాతం క్షీణించింది. ఈ కంపెనీలో మొత్తం వాటా 51శాతంగా ఉంది. నిన్నటి ట్రేడింగ్‌లో కంపెనీ 0.60శాతం పెరగ్గా, నేటి ఉదయం ట్రేడింగ్‌లో 1.50శాతం ర్యాలీ చేసింది.

టాక్స్‌ ఇష్యూ కొద్దిగా భిన్నమైన సమస్య. ఒకవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు చర్యలు తీసుకుంటూ మరోపక్క వీటిపై పన్ను విధించడంతో ఎప్‌ఫీఐల అమ్మకాలకు దిగాయని నిపుణులు చెబుతున్నారు.You may be interested

రిస్క్ ఎందుకనుకుంటున్న ఇన్వెస్టర్లు!

Tuesday 27th August 2019

‘సాధారణ వర్షపాతం కొనసాగితే పంటలు బాగా పండుతాయి. ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. దీనితో పాటు ప్రభుత్వం అందించే ఆర్థిక చర్యలు, బూస్టర్‌ ప్యాకేజిలు పట్టణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయి’ అని సర్తి గ్రూప్‌, పార్టనర్‌, సీఐఓ కుంజ్ బన్సాల్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. అంతేకాకుండా నగదు లభ్యత కారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్‌లకు దూరంగా లేరని, రిస్కు తీసుకోవడం ఇష్టం లేకనే దూరంగా ఉన్నారని ఆయన

మూడోరోజూ లాభాల ముగింపు

Tuesday 27th August 2019

11100 పైన ముగిసిన నిఫ్టీ 147 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  మార్కెట్‌ వరసగా మూడోరోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 37641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 11105 వద్ద ముగిసింది. వాణిజ్య వివాద పరిష్కారానికి త్వరలో చైనాతో చర్చలు ప్రారంభించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ ప్రకటించడం, గత వారాంతంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు, అదనపు నిధులను ప్రభుత్వానికి

Most from this category