News


షేర్ల పరోక్ష బదిలీ పన్నుపై ఎఫ్‌పీఐల మల్లగుల్లాలు!

Tuesday 4th February 2020
Markets_main1580792144.png-31490

షేర్ల పరోక్ష బదిలీపై పన్ను విధింపు నిబంధనల నుంచి  తమ పెట్టుబడులు రక్షించుకునేందుకు మారిషస్‌, కేమన్‌ ఐలాండ్స్‌ నుంచి భారత్‌లో పెట్టుబడులు పెట్టే ఎఫ్‌పీఐలు తంటాల పడుతున్నాయి. సింగపూర్‌ లేదా లండన్‌లో ఒక ఫండ్‌ మేనేజర్‌ను నియమించుకోవడం ద్వారా పన్ను నిబంధనల పరిధి నుంచి తప్పించుకోవడం లేదా తమకుతాము పునర్‌వర్గీకరించుకోవడం చేసుకోవాలని ఆలోచిస్తున్నాయి. సెబి కేటగిరీ 1 పథకం కింద రిజిస్టరయిన సంస్థలకు మాత్రమే షేర్ల పరోక్ష బదిలీపై పన్ను నుంచి మినహాయింపు ఉంటుందని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండే దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఎఫ్‌పీఐలు, ఫండ్‌ మేనేజర్లు మాత్రమే కేటగిరీ 1 కిందకు వస్తారు. మారిషస్‌, కేమన్‌ ఐలాండ్‌ ఎఫ్‌పీఐలు కేటగిరీ 2 కిందకు వస్తారు. ఇప్పటివరకు రెండు కేటగిరీల సంస్థలకు మినహాయింపు వర్తించేది. తాజా మార్పుతో కేవలం కేటగిరీ 1కి చెందని ఎఫ్‌పీఐలు మాత్రమే షేర్ల పరోక్ష బదిలీపై విధించే 40 శాతం పన్ను నుంచి మినహాయింపు పొందుతాయి. 
2012లో ఈ పన్న నిబంధనపై వొడాఫోన్‌ ఇండియా ఒక కేసు గెలిచింది. ఆ సందర్భంగా ప్రభుత్వం పరోక్ష బదిలీ నిబంధనలు తీసుకువచ్చింది. అప్పటి నుంచి విదేశాల్లో జరిగే దేశీయ కంపెనీల షేర్ల(సదరు షేర్లు సదరు ఎఫ్‌పీఐ మొత్తం అసెట్స్‌లో 50 శాతముంటే) లావాదేవీలపై ప్రభుత్వం పన్ను విధించడం ఆరంభించింది. తాజా మార్పుతో పలు ఏసియన్‌ ఫండ్స్‌ కూడా కేటగిరీ 2 కిందకు రానున్నాయి. పలు ఫండ్‌ మేనేజర్లు తమ వద్ద పెట్టుబడి పెట్టిన వారి పేర్లు బహిర్గతం చేయడం ద్వారా  మినహాయింపు పొందవచ్చని తమ పెట్టుబడిదారులకు సూచిస్తున్నాయి. ఎందుకంటే ఒక ఫండ్‌లో 75 శాతం మంది మదుపరులు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకనుగుణమైన దేశాలకు చెందిన వారైతే సదరు ఫండ్‌ను కేటగిరీ 1 కింద పరిగణిస్తారు. కానీ తమ పేర్లు బయటపెట్టేందుకు చాలామంది మదుపరులు అంగీకరించడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఎఫ్‌పీఐ ఫండ్‌ మేనేజర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు. ఇందులో భాగంగా ఫండ్‌ మేనేజర్‌ను లండన్‌ లేదా సింగపూర్‌ లాంటి నిబంధనలకనుగుణమైన దేశాల్లో నియమించుకోవడం లేదా ప్రస్తుత మేనేజర్‌ను సదరు దేశాలకు మార్చడం లాంటి ప్రత్యామ్నాయాలపై ఎఫ్‌పీఐలు దృష్టి పెట్టాయి. మరికొన్ని ఎఫ్‌పీఐలు మార్చిచివరకు పూర్తిగా దేశీయ షేర్లను వదిలించుకోవాలని యోచిస్తున్నాయి. మరికొన్ని ప్రస్తుత పెట్టుబడులు మాత్రం కొనసాగిస్తూ కొత్తగా దేశీయ షేర్ల జోలికి పోకుండా ఉండాలని యోచిస్తున్నాయి. 



You may be interested

బీమా షేర్ల టార్గెట్‌ ధరల్లో కోత?

Tuesday 4th February 2020

బడ్జెట్‌ ప్రతిపాదనలతో ప్రతికూల ప్రభావం! బ్రోకింగ్‌ సంస్థల తాజా అంచనాలు ఆదాయ పన్నుకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న తాజా ప్రతిపాదనల కారణంగా బీమా రంగ కంపెనీలపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం పడనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీంతో బీమా రంగ షేర్ల టార్గెట్‌ ధరలను కుదిస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. కేంద్ర ఆర్థిక శాఖ బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్ను సవరణల నేపథ్యంలో బీమా రంగ కంపెనీలపై స్వల్ప కాలంలో పరిమిత

స్వల్పంగా తగ్గిన పసిడి

Tuesday 4th February 2020

  కరోనా వైరస్‌ భారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సోమవారం ఒక్కరోజే 64కు పెరిగి మొత్తం 425కు చేరింది. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారీని నిర్మూలించడంలో అమెరికా ఆరోగ్య నిపుణులు సాయం తీసుకోవడానికి చైనా ఒప్పుకోవడంతో.. మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో నిన్నటితో పోలిస్తే రూ.110 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ.40,661.00 వద్ద ట్రేడ్‌

Most from this category