News


ఎఫ్‌పీఐలు వాటాలు పెంచుకున్న టాప్‌ 20 షేర్లు!

Wednesday 29th January 2020
Markets_main1580290559.png-31307

డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రైవేట్‌ బ్యాంకులు, బీమా కంపెనీలతో సహా పలు రంగాలకు చెందిన స్టాకుల్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో ఆటోమొబైల్‌ తదితర బడ్జెట్‌ ప్రభావిత రంగాల షేర్లపై కూడా ఎఫ్‌ఐఐలు కన్నేశారు. బ్యాంకుల్లో ఆర్‌బీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకుల్లో ఎఫ్‌పీఐల వాటా దాదాపు 300- 600 బీపీఎస్‌ మేర పెరిగింది. బడ్జెట్లో దివాలా చట్టానికి మరింత పదును పెరుగుతుందని, మొండిపద్దుల రికవరీ ప్రక్రియ మరింత వేగవంతం చేసే చర్యలుంటాయన్న అంచనాలతో బ్యాంకింగ్‌ షేర్లపై ఎఫ్‌ఐఐలు మొగ్గు చూపాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో జమ్నా ఆటో, మహీంద్రా సీఐఈ, సియట్‌ షేర్లలో ఎఫ్‌ఐఐల వాటా దాదాపు 340- 370 బీపీఎస్‌ మేర పెరిగింది. ఇక బీమా స్టాకులైన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐసీఐసీఐ లొంబార్డ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ల్లో సైతం వాటాలను దాదాపు 270- 400 బీపీఎస్‌ మేర పెంచుకున్నాయి. వీటితో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ల్లో ఎఫ్‌ఐఐల వాటా దాదాపు 300 బీపీఎస్‌ మేర పెరిగింది. ఇదే సమయంలో ఐబీ హౌసింగ్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో వాటాలను భారీగా తగ్గించుకున్నాయని గణాంకాలు వివరిస్తున్నాయి. 

డిసెంబర్‌లో అత్యధికంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరులో ఎఫ్‌ఐఐల వాటా ఒక్కమారుగా 1870 బీపీఎస్‌ మేర పెరిగింది. కంపెనీ ప్రమోటర్లు 16 శాతం వాటా విక్రయించడంతో ఎఫ్‌ఐఐల వాటా పెరిగింది. బ్లాక్‌రాక్‌, జీఐసీ, హెచ్‌ఎస్‌బీసీగ్లోబల్‌, సిటి గ్రూప్‌, మోర్గాన్‌స్టాన్లీ, వాన్‌గార్డ్‌ తదితర పలు విదేశీ మదుపరులు ఇందులో వాటాలను కొనుగోలు చేశారు. క్యు3లో ఎఫ్‌ఐఐల వాటా పెరిగిన ఇతర కంపెనీల్లో బజాజ్‌ కన్జూమర్‌(650బీపీఎస్‌ పెరుగుదల), ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌(460 బీపీఎస్‌), ఇండియా ఎనర్జీ ఎక్చేంజ్‌(410 బీపీఎస్‌), లెమన్‌ట్రీహోటల్స్‌(340 బీపీఎస్‌), గ్రాన్యూల్స్‌ ఇండియా(330 బీపీఎస్‌), డిక్సన్‌ టెక్‌(320 బీపీఎస్‌) ఉన్నాయి. You may be interested

టాటా మోటర్స్‌ షేరు 7 శాతం జంప్‌

Wednesday 29th January 2020

టాటా మోటర్స్‌ షేరు బుధవారం దాదాపు 7శాతం లాభంతో ముగిసింది. ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.245లకు పెంచడం ఇందుకు కారణమైంది. అలాగే తన ప్రసిద్ధ కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) నెక్సాన్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విభాగంలో ఈ తరహా వాహనాలు అత్యంత చౌకమైనవి కావడంతో రానున్న రోజుల్లో వీటికి మరింత డిమాండ్‌

బడ్జెట్‌ ఎఫెక్ట్‌- రైల్వే షేర్లు స్పీడ్‌

Wednesday 29th January 2020

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, ఐఆర్‌సీటీసీ హైజంప్‌ రైట్స్‌, హింద్‌ రెక్టిఫయర్స్‌, టెక్స్‌మాకో జూమ్‌ మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రైల్వే రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసినప్పటికీ ఈసారి రైల్వేలకు కేటాయింపులు పెరగనున్న అంచనాలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా తదితరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తాజాగా రైల్‌

Most from this category