News


నిఫ్టీ షార్ట్స్‌ తగ్గించుకుంటున్న ఎఫ్‌పీఐలు

Friday 18th October 2019
Markets_main1571373784.png-28969

క్యాష్‌ మార్కెట్లో కొనుగోళ్లు
పాజిటివ్‌ ట్రెండ్‌ అంటున్న నిపుణులు
దీపావళి సమయానికి మార్కెట్‌ సెంటిమెంట్‌ మరింత పాజిటివ్‌గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రధాన సూచీలైన నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో షార్ట్‌ పొజిషన్లను ఎఫ్‌పీఐలు గణనీయంగా తగ్గించుకోవడం ఇందుకు ఉదాహరణ అంటున్నారు. ఒకపక్క షార్ట్స్‌ కవర్‌ చేస్తున్న విదేశీ మదుపరులు మరోపక్క అంతే వేగంతో క్యాష్‌ మార్కెట్లో కొనుగోళ్లు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు చివరకు ఎఫ్‌ఐఐల నికర షార్ట్‌ పొజిషన్లు 1.42 లక్షలుండగా, అక్టోబర్‌ 16 నాటికి ఇవి 28740 కాంట్రాక్టులకు దిగివచ్చాయి. బేరిష్‌ బెట్స్‌ గణనీయంగా తగ్గడాన్ని ఈ గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. అప్పటి నుంచి అక్టోబర్‌ 16 వరకు ఎఫ్‌ఐఐలు క్యాష్‌ మార్కెట్లో రూ. 12, 775 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొన్నారు. ఈ విధంగా షార్ట్స్‌ తగ్గించుకొని క్యాష్‌ మార్కెట్లో కొనుగోళ్లు చేయడమనేది పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచిస్తుందని నిపుణుల అంచనా. మార్కెట్లో క్రమంగా ఒడిదుడుకులు తగ్గుముఖం పట్టడం కూడా ఒక పాజిటివ్‌ అంశమేనని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అనలిస్టులు చెప్పారు. గత కొన్ని రోజులుగా నిఫ్టీ పీసీఆర్‌(పుట్‌, కాల్‌ నిష్పత్తి) 1.18 నుంచి 1.07కు దిగివచ్చింది. అంటే మార్కెట్లో ఎక్కువగా పుట్‌ రైటింగ్‌ జరగుతుందని అర్ధమవుతోంది. పుట్‌రైటింగ్‌ ఎక్కువకావడమనేది సూచీలు ఎక్కువగా పతనం కావనేందుకు ఒక సంకేతంగా అనలిస్టులు చెబుతారు. 

షార్ట్‌టర్మ్‌ ట్రెండ్‌...
మరికొన్ని నెలలపాటు నిఫ్టీ 11400- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడే అవకాశముందని నిపుణుల అంచనా. వరుసగా నిఫ్టీ హయ్యర్‌ టాప్స్‌, హయ్యర్‌ లో ఏర్పరుస్తూ వస్తోంది. ఒకపక్క షార్ట్‌కవరింగ్‌, మరోపక్క క్యాష్‌మార్కెట్లో కొనుగోళ్లు మార్కెట్‌ను ముందుకు జరుపుతున్నాయి. అయితే టెక్నికల్స్‌ పరిశీలిస్తే నిఫ్టీ క్రమంగా ఓవర్‌బాట్‌ పొజిషన్లోకి వెళ్తోంది. ప్రధాన ఇండికేటర్లు కూడా కాస్త అలసట చూపుతున్నాయి. దీనికి తోడు వచ్చే సోమవారం మార్కెట్‌కు సెలవు. అందువల్ల స్వల్పకాలనికి నిఫ్టీ కదలిలకలు పరిమితంగా ఉండొచ్చు. 11610 పాయింట్ల నుంచి 11675 పాయింట్ల మధ్య నిరోధాలు, 11450- 11500 పాయింట్ల మధ్య మద్దతులు ఉన్నాయి. వీటిని దాటితే తదుపరి ట్రెండ్‌ గుర్తించవచ్చు. You may be interested

నియంత్రణ సంస్థ, ఆడిటర్లదే బాధ్యత

Friday 18th October 2019

బ్యాంకుల్లో మోసాలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: పంజాబ్‌ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ సహా ఇతర బ్యాంకుల్లో చోటు చేసుకున్న మోసాలకు.. నియంత్రణ సంస్థ, యాజమాన్యం, ఆడిటర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. "పీఎంసీ బ్యాంకు కానీ.. మరే బ్యాంక్ అయినా కానీ వాటికి సంబంధించిన సమస్యలను పరిశీలించడం నియంత్రణ సంస్థల బాధ్యత. ఆడిటర్‌ కూడా బాధ్యత

22 శాతం తగ్గిన సైయంట్‌ లాభం

Friday 18th October 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ సర్వీసుల కంపెనీ సైయంట్‌ సెప్టెంబరు క్వార్టర్‌ కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 22.5 శాతం తగ్గి రూ.98.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 2.4 శాతం తగ్గి రూ.1,159 కోట్లుగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది.

Most from this category