News


ఈ స్టాక్స్‌ అంటే ఎఫ్‌పీఐలకు ఎందుకో ఆసక్తి!

Tuesday 16th July 2019
Markets_main1563215937.png-27083

సాధారణ ఇన్వెస్టర్లు వేరు... హెచ్‌ఎన్‌ఐలు, ఇనిస్టిట్యూషన్స్‌(మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా సంస్థలు), విదేశీ ఇన్వెస్టర్లు వేరు. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మన ఈక్విటీల్లో చాలా దూకుడుగా ఉంటారు. ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసే విషయంలోనూ, ఆ పెట్టుబడులను రోజుల వ్యవధిలో వెనక్కి తీసుకునే విషయంలోనూ చురుగ్గా వ్యవహరిస్తుంటారు. అయితే, 13 స్టాక్స్‌లో మాత్రం ఎఫ్‌పీఐలు క్రమంగా వాటాలు పెంచుకుంటూ ఉండడం ఆసక్తికరం. 

 

గత నాలుగు త్రైమాసికాల్లో ఈ 13 స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. వీటిల్లో ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, కర్ణాటక బ్యాంకు ఉన్నాయి. వీటిల్లో చాలా కంపెనీల ఫండమెంటల్స్‌ బలంగా ఉండడం సాధారణ ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. పలు బ్రోకరేజీ సంస్థలు వీటిపట్ల సానుకూల రేటింగ్‌లనూ ఇస్తున్నాయి. జూన్‌ త్రైమాసికం చివరికి ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌పీఐల వాటా 19.4 శాతానికి చేరుకుంది. ఇది మార్చి త్రైమాసికంలో కేవలం 4.3 శాతంగానే ఉండడం తప్పక గమనించాలి. గత మూడు సంవత్సరాల్లో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తన వృద్ధి క్రమాన్ని కొనసాగిస్తోందని, లాభాలపైనా కంపెనీ ఫోకస్‌ పెట్టినట్టు ఐసీఐసీఐ డైరెక్ట్‌ నివేదిక తెలియజేస్తోంది. ఆపరేటింగ్‌ ఆన్‌ ఎంబెడెడ్‌ వ్యాల్యూనూ జీవిత బీమా కంపెనీల వృద్ధికి ప్రామాణికంగా చూస్తారు. ఈ ఆర్‌వోఈవీ అన్నది ఎస్‌బీఐ లైఫ్‌ విషయంలో 2021 ఆర్థిక సంవత్సరానికి 18 శాతానికి చేరుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేసింది. ఆ ప్రకారం ఈ స్టాక్‌ 2.3 రెట్లకు ట్రేడవుతోందని, బలమైన పంపిణీ నెట్‌వర్క్‌, వ్యయ నియంత్రణల వంటి అంశాల కారణంగా ఈ స్టాక్‌ పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. 

 

కోల్‌ ఇండియాలో ఎఫ్‌పీఐల వాటా మార్చి నాటికి 7.1 శాతంగా ఉంటే, జూన్‌ చివరికి 9 శాతానికి చేరింది. క్రితం ఏడాది జూన్‌ క్వార్టర్‌లో ఎఫ్‌పీఐల వాటా 5.4 శాతమే. 2019 ఆర్థిక సంవత్సరంలో కోల్‌ ఇండియా ఆర్థిక పనితీరు చక్కగా మెరుగుపడిందని, కోటక్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. వ్యాల్యూషన్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని, 7 పీఈ, ఎబిటాకు 5 రెట్లకు స్టాక్‌ అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ స్టాక్‌కు రూ.290 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ఇదే స్టాక్‌కు ఎంకే గ్లోబల్‌ ఇచ్చిన టార్గెట్‌ రూ.296. ముత్తూట్‌ ఫైనాన్స్‌లో ఎఫ్‌పీఐల వాటా తాజాగా 13.9 శాతానికి చేరింది. క్రితం ఏడాది జూన్‌ నాటికి ఉన్న వాటా 10 శాతమే. అదే ఓఎన్‌జీసీలో ఎఫ్‌పీఐల వాటా 7.6 శాతానికి పెరిగింది. ఈ స్టాక్‌కు 16 మంది అనలిస్టులు బై రేటింగ్‌ ఇవ్వగా, 10 అవుట్‌ పెర్‌ఫార్మ్‌, ఆరు హోల్డ్‌ రేటింగ్‌లు కూడా ఉన్నాయి. కనీసం 5 శాతానికి పైగా ఎఫ్‌ఫీఐల వాటా ఉన్న స్టాక్స్‌ వివరాలు ఇవి. గ్రాన్యూల్స్‌ ఇండియా, గుజరాత్‌ స్టేట్‌ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌, టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌, ఎండ్యురన్స్‌ టెక్నాలజీస్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌ కూడా ఎఫ్‌పీఐలు వాటా పెంచుకుంటున్న వాటిల్లో ఉన్నాయి. సెంట్రమ్‌ బ్రోకింగ్‌ కర్ణాటక బ్యాంకుకు రూ.142 టార్గెట్‌ ఇచ్చింది. You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం

Tuesday 16th July 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ మంగళవారం భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 65 పాయింట్ల లాభంతో 38,960 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,596 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. 

యస్‌ బ్యాంకులో పెట్టుబడులకు పీఈ ప్లేయర్లు రెడీ!?

Tuesday 16th July 2019

ప్రైవేటు రంగ యస్‌ బ్యాంకు నిధుల సమీకరణ ప్రయత్నాలు ఫలితం దశకు చేరినట్టు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం ఆధారంగా తెలుస్తోంది. బ్యాంకుకు నూతన సీఈవో వచ్చిన తర్వాత ఆస్తుల నాణ్యతపై ఫోకస్‌ పెరగడం, ఫలితంగా ఏప్రిల్‌ త్రైమాసికంలో ఎన్‌పీఏలకు చేసిన అధిక కేటాయింపులతో భారీ నష్టాలను బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకు వృద్ధి బాట పట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంది. సీఈవో రవనీత్‌గిల్‌ ఇదే విషయమై

Most from this category