News


ఈ కౌంటర్లవైపు విదేశీ ఇన్వెస్టర్ల చూపు

Tuesday 25th February 2020
Markets_main1582605440.png-32066

ఇదీ జాబితా..
అశోక్‌ లేలాండ్‌, రైట్స్‌, సీజీ కన్జూమర్‌
టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్స్‌, టాటా గ్లోబల్‌

గత ఆరు నెలలుగా అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకుంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు పెరిగాయి. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కంపెనీలు సాధించిన ప్రోత్సాహకర ఫలితాలు, ఇకపై టర్న్‌అరౌండ్‌ సాధించనున్న అంచనాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు క్యూ3లో అశోక్‌ లేలాండ్‌, శ్రీ సిమెంట్‌, టాటా స్టీల్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌లో వాటాలు కొనుగోలు చేశారు. సుమారు ఐదు క్వార్టర్ల తదుపరి ఎఫ్‌పీఐలు అశోక్‌ లేలాండ్‌, సీజీ కన్జూమర్‌ కౌంటర్లపట్ల ఆసక్తి చూపడం గమనార్హమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఇదీ తీరు
ఈ ఏడాది క్యూ3లో ఎఫ్‌పీఐలు అశోక్‌ లేలాండ్‌, శ్రీ సిమెంట్‌, టాటా స్టీల్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ కంపెనీలలో 1.3-2.8 శాతం మధ్య వాటాలు కొనుగోలు చేశారు. ఇక మరోపక్క దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐలు- దేశీ ఫం‍డ్స్‌) టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌తోపాటు.. రైల్వే రంగ కంపెనీ రైట్స్‌, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, బంధన్‌ బ్యాంకులలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. రైట్స్‌లో డీఐఐలు అత్యధికంగా 6.89 శాతం వాటాను సొంతం చేసుకోగా.. ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌లో 5.63 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెలువడ్డాయి. 

కారణాలివీ
2019లో వాణిజ్య వాహన విక్రయాలు 20 శాతం క్షీణించాయి. అయితే ఇకపై ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటపడితే.. అశోక్‌ లేలాండ్‌ లబ్ది పొందే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. లైటింగ్‌ బిజినెస్‌ ద్వారా ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎలక్ట్రిక్‌ కన్జూమర్‌ డ్యురబుల్స్‌ ద్వారా సమర్ధవంతంగా బ్యాలన్స్‌ చేసుకుంటున్న సీజీ కన్జూమర్స్‌ సైతం​ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. ఫ్యాన్లు, పంపులు, ఇతర అప్లయెన్సెస్‌ నుంచి 70 శాతం ఆదాయం సమకూరుతుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. విదేశీ సంస్థలు ఫ్రాంక్లిన్‌ రీసోర్సెస్‌, క్రెడిట్‌ అగ్రికోల్‌ ప్రధానంగా సీజీ కన్జూమర్‌లో అధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మార్చికల్లా రూ. 8,000 కోట్ల ఆర్డర్‌బుక్‌ను సాధించే వీలున్నట్లు పేర్కొన్న పీఎస్‌యూ రైట్స్‌లో డీఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. డిసెంబర్‌కల్లా కంపెనీ దాదాపు రూ. 6000 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.You may be interested

11682 పాయింట్ల మద్దతు కూడా కోల్పోవచ్చు?!

Tuesday 25th February 2020

నిఫ్టీ రాబోయే రోజుల్లో 11682 పాయింట్ల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సోమవారం ఎఫ్‌ఐఐల భారీ విక్రయాలతో కీలకమైన 11900- 12000 పాయింట్ల మద్దతును నిఫ్టీ కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భారీ నెగిటివ్‌ మూడ్‌ను ప్రతిబింబిస్తూ దేశీయ మార్కెట్లో కూడా సోమవారం భారీ కరెక‌్షన్‌ వచ్చింది. ఈ వరుస చూస్తుంటే త్వరలో నిఫ్టీ కీలకమైన 200 రోజుల డీఎంఏ స్థాయిని పరీక్షించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారీగా తగ్గిన పసిడి ధర!

Tuesday 25th February 2020

గత ఐదురోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా రూ.584 తగ్గింది. కొద్ది రోజులుగా 10 గ్రాముల పసిడిపై రూ.3000 వరకూ పెరిగి రూ.43,900 కు కూడా చేరింది. మంగళవారం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో రూ.581 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.42,999.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో 18 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,659 డాలర్ల వద్ద ట్రేడ్‌

Most from this category