బ్యాంకింగ్ షేర్లలో ఎఫ్‌పీఐల అమ్మకాలు
By Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి, ఈ ఏడాది బడ్జెట్లో కంపెనీల షేర్ల బై బ్యాక్‌పై పన్నును, సూపర్రిచ్లపై అదనపు ట్యాక్స్‌ను విధించడంతో అగష్టు నెలలో బ్యాంకింగ్, ఫైనాన్సియల్ షేర్ల నుంచి ఎఫ్‌పీఐ(విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు) నిధుల ఔట్‌ఫ్లో భారీగా జరిగిందని, ఇది గత ఏడున్నరేళ్లలో అధ్వాన్న పరిస్థితి అని ఎన్ఎస్డీఎల్(నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ) డేటా పేర్కొంది. అగష్టు 2019లో ఎఫ్‌పీఐలు బ్యాంకింగ్ షేర్ల నుంచి 124 కోట్ల డాలర్ల సంపదను ఉపసంహరించుకోగా, బ్యాంకింగేతర ఫైనాన్సియల్ షేర్ల నుంచి 58.40 కోట్ల డాలర్లను బయటకు తీసుకున్నారని ఎన్ఎస్డీఎల్ పేర్కొంది. ఎన్ఎస్డీఎల్ డేటాను నమోదుచేయడం ప్రారంభించిన తేది(2012) నుంచి ఇప్పటి వరకు ఈ రెండు కేటగిరిల్లో ఇదే అతిపెద్ద విదేశి నిధుల ఉపసంహరణ అని విశ్లేషకులు తెలిపారు.
ఎఫ్‌పీఐలపై అదనపు సర్‌చార్జీని విధించడం, కంపెనీల షేర్ల బై బ్యాక్‌పై ట్యాక్స్‌ను విధించడం వంటి చర్యల వలన నిఫ్టీ 50 జూలైలో భారీగా నష్టపోయింది. కాగ ఈ నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అగష్టు 23వ తేదిన ఎఫ్పీఐఐ, డీఐఐ(దేశియ సంస్థాగత ఇన్వెస్టర్లు) లపై విధించే అదనపు సర్‌చార్జీని తొలగించిన విషయం తెలిసిందే. యస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంక్ షేర్ల పతనం వలన నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ అగష్టు నెలలో 5 శాతం మేర పతనమయ్యింది.
మొత్తంగా అగష్టు నెలలో విదేశి నిదుల ఔట్ ఫ్లో 240 కోట్ల డాలర్లుగా ఉంది. ఇది అక్టోబర్ 2018 తర్వాత అత్యధిక విదేశి నిధుల ఉపసంహరణ. జులై నెలలో 180 కోట్ల డాలర్ల ఉపసంహరణ జరిగిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఫైనాన్సియల్ సర్వీసులు కాకుండా ఆయిల్ అండ్ గ్యాస్, సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్, ఆహారం, బెవరేజెస్, టొబాకో షేర్ల నుంచి విదేశి నిధుల ఔట్ ఫ్లో అధికంగా ఉంది.
ఇన్సురెన్స్ సెక్టార్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో..
అగష్టు నెలలో అత్యదికంగా ఇన్సురెన్ సెక్టార్‌లోకి నిధుల ఇన్‌ఫ్లో జరిగింది. ఈ నెల మొత్తం మీద 58.90 కోట్ల డాలర్ల ఇన్‌ఫ్లో జరగ్గా, 52.10 కోట్ల డాలర్ల ఇన్‌ఫ్లో అగష్టు 16-31 మధ్య జరగడం గమనార్హం. ఇన్సురెన్ స్టాక్స్‌తో పాటు, గృహ, వ్యక్తిగత ఉత్పత్తులు, విద్యుత్, ఇతర వినియోగాల షేర్లలోకి అధికంగా నిధుల ఇన్‌ఫ్లో జరిగింది.
You may be interested
ఎగుమతులు, హౌసింగ్ రంగాలకు ఆర్థిక మంత్రి ఉద్దీపన
Saturday 14th September 2019పడిపోయిన ఎగుమతుల్ని పునరుద్ధరించే క్రమంలో కొత్త స్కీమును ప్రవేశపెట్టడంతో పాటు, మధ్యాదాయ వర్గాల హౌసింగ్ ప్రాజెక్టుల పూర్తికి ఆర్థికసాయం అందించేందుకు స్పెషల్ విండో ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారంనాడు న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఎగుమతులు, హౌసింగ్ రంగాలకు పలు ఉద్దీపన చర్యల్ని మంత్రి వెల్లడించారు. ముఖ్యాంశాలు.... -ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం(ఆర్ఓడీటీఈపీ) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నాం. ఇది జనవరి 1, 2020 నుంచి మర్చండీస్
1500డాలర్ల దిగువకు పసిడి
Saturday 14th September 2019అమెరికా బాండ్ ఈల్డ్స్ బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 1500డాలర్ల దిగువన ముగిసింది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 11.40డాలర్లు క్షీణించి 1,496.00డాలర్ల వద్ద స్థిరపడింది. వచ్చేవారంలో మంగళ, బుధవారాల్లో ఫెడ్‌రిజర్వ్ ఓపెన్ పాలసీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కీలక వడ్డీరేట్లపై ఫెడ్ వైఖరి పసిడి ఫ్యూచర్ల తదుపరి గమనానికి కీలకం కానుంది. ఒకవేళ వడ్డీరేట్లను తగ్గిస్తే పసిడికి కలిసొస్తుంది. అయితే కామెక్స్ పోజిషన్లు