News


ట్రెండ్‌ రివర్సల్‌ సిగ్నలిస్తున్న లాంగ్‌- షార్ట్‌ నిష్పత్తి?!

Monday 12th August 2019
Markets_main1565592981.png-27713

కనిష్ఠస్థాయిలకు చేరడం అప్‌మూవ్‌కు సంకేతమంటున్న నిపుణులు
ఆగస్టు సీరిస్‌లో ఎఫ్‌పీఐల ఇండెక్స్‌ లాంగ్‌- షార్ట్‌ నిష్పత్తి 0.48కు పడిపోయింది. గత ఏడేళ్లలో ఇలాంటి మార్పు కనిపించడం చాలా ఆరుదుగా జరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిష్పత్తి పడిపోతూ కనిష్ఠాలకు చేరడం మార్కెట్‌కు దిగువస్థాయిల్లో మద్దతు దొరకడానికి సంకేతంగా, అప్‌మూవ్‌కు తొలిమెట్టుగా టెక్నికల్‌ అనలిస్టులు భావిస్తారు. ఆగస్టు డెరివేటివ్స్‌ ముగింపు నాటికి నిఫ్టీలో సరాసరిన దాదాపు 6 శాతం అప్‌మూవ్‌ ఉండొచ్చని ఈ నిష్పత్తి సూచిస్తున్నట్లు ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. 2012 తర్వాత ఈ నిష్పత్తి 0.5 స్థాయి కన్నా కిందకు రావడం ఐదు నెలవారీ సీరిస్‌ల్లో కనిపించిందని తెలిపింది. 2012 నుంచి ఇప్పటికి మొత్తం 1860 ట్రేడింగ్‌ సెషన్లు జరిగితే కేవలం 27 సెషన్లలో మాత్రమే ఈ నిష్పత్తి 0.48 కన్నా దిగువకు వచ్చిందని వివరించింది. గతంలో ఈ స్థాయిలకు వచ్చిన ఐదు సందర్భాల్లో నాలుగుమార్లు డెరివేటివ్‌ సీరిస్‌ను సూచీలు పాజిటివ్‌గా ముగించాయి. ఒకమారు నెగిటివ్‌గా ముగిసింది. అలా నెగిటివ్‌గా ముగిసినా, తర్వాత నెల బలమైన ర్యాలీ చూపాయి. అందువల్ల ఇలా నిష్పత్తి తగినప్పుడు తప్పక మంచి ర్యాలీ ఉంటుందని గత గణాంకాల విశ్లేషించి ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిఫ్టీలో పడినప్పుడు కొనొచ్చు అనే సూత్రం ఫాలో కావచ్చని, నిఫ్టీలో 11600- 11650 పాయింట్ల వరకు అప్‌మూవ్‌ ఆశించవచ్చని ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ నీరజ్‌ అగర్వాల్‌ చెప్పారు. నిఫ్టీకి 10900- 10950 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుందన్నారు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిఫ్టీకి పలు స్థాయిల వద్ద గట్టి నిరోధాలు ఎదురయ్యాయని, అవన్నీ ఇప్పుడు మద్దతు స్థాయిలుగా మారాయని వివరించారు. ఆగస్టు సీరిస్‌లో ఎఫ్‌పీఐ ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ స్వల్పంగా పెరిగింది. You may be interested

రిలయన్స్‌ పెట్రో రిటైలింగ్‌ వాటా కోసం బీపీ రూ.7000 కోట్ల చెల్లింపు

Monday 12th August 2019

బ్రిటన్‌ ఇంధన దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ బీపీ లిమిటెడ్‌ ఫ్యూయెల్‌ రీటైలింగ్‌ నెట్‌వర్క్స్‌లో 49శాతం వాటా కొనుగోలుకు రూ.7000 కోట్లను చెల్లించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ సోమవారం ప్రటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల ఏర్పాటుతో పాటు విమాన ఇంధనాన్ని కూడా విక్రయించేందుకు బీపీ లిమిటెడ్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన కంపెనీ 42 ఏజీఎం సమావేశంలో ముఖేష్‌

సెన్సెక్స్‌ 37,810 స్థాయిని అధిగమిస్తే....

Monday 12th August 2019

సెన్సెక్స్‌ 37,810 స్థాయిని అధిగమిస్తే.... బడ్జెట్‌ ప్రతిపాదనల్లో విదేశీ ఇన్వెస్టర్లను బాధించిన ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ ఎత్తివేత, టర్నోవర్‌తో సంబంధం లేకుండా అన్ని కంపెనీలకు కార్పొరేట్‌ టాక్‌​‍్స తగ్గింపు, మూడేళ్లకు పైబడిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను, డివిడెండు పంపిణీ పన్ను మినహాయింపులు వంటి స్నేహపూరిత చర్యల్ని ప్రభుత్వం ప్రకటించనున్నదనే వార్తలతో గతవారం నాటకీయంగా మార్కెట్‌ ర్యాలీ జరిపింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ప్రధాన విదేశీ ఫండ్స్‌ ప్రతినిధులతో ఆర్థికమంత్రిత్వ

Most from this category