News


ర్యాలీ కంటిన్యూ అంటున్న ఎఫ్‌పీఐలు!!

Wednesday 5th February 2020
Markets_main1580876097.png-31518

దేశీయ సూచీలు బడ్జెట్‌ రోజు నష్టాలను అత్యంత వేగంగా పూడ్చుకొన్నాయి. నిఫ్టీ రెండ్రోజుల్లో తిరిగి 12000 పాయింట్ల పైకి చేరింది. వరుసగా మూడోరోజు కూడా సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. స్వల్పకాలానికి ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని డెరివేటివ్స్‌ నిపుణులు చెబుతున్నారు. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల లాంగ్‌ షార్ట్‌ రేషియో పరిశీలిస్తే నిఫ్టీ పాజిటివ్‌గానే ఉండొచ్చన్న సంకేతాలున్నాయంటున్నారు. ఫిబ్రవరి సీరిస్‌కు ఈ నిష్పత్తి 0.3 శాతానికి పడిపోయింది. ఈ స్థాయికి ఈ నిష్పత్తి రావడం గత ఏడేళ్లలో ఇది మూడోసారి. దీంతో తాజా పతనం బాటమ్‌కు సంకేతంగా టెక్నికల్‌ అనలిస్టులు భావిస్తున్నారు. 2012నుంచి ఈ నిష్పత్తి ఇంత స్వల్ప స్థాయికి రెండు మార్లు వచ్చింది. అలావచ్చిన తర్వాత నెల్లో సూచీలు దాదాపు 5 శాతం మేర ర్యాలీ జరిపాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీలో తగ్గినప్పుడు కొను సూత్రం పాటించవచ్చని యాంటిక్‌ బ్రోకింగ్‌ సూచించింది. నిఫ్టీ భవిష్యత్‌లో 12900- 13000 పాయింట్లను చేరవచ్చని అంచనా వేసింది. నిఫ్టీకి 11920 పాయింట్ల రేంజ్‌లో ఒక స్వల్ప గ్యాప్‌ ఉందని, ఈ గ్యాప్‌ పూడ్చుకున్న అనంతరం తదుపరి ర్యాలీ ఉండొచ్చని అభిప్రాయపడింది.

బుధవారం నిఫ్టీ ఉదయం 9.42 నిమిషాలకు దాదాపు 41 పాయింట్ల లాభంతో 12014 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 



You may be interested

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 5th February 2020

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్యాస్‌, అడ్లాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అజంతా ఫార్మా, ఆంధ్రా బ్యాంక్‌, అపోలో టైర్స్‌, అవధ్‌ షుగర్స్‌, ఎనర్జీ, బర్గర్‌ పెయింట్స్‌, భాష్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కేడిల్లా హెల్త్‌కేర్‌, సిప్లా, దివీస్‌ ల్యాబ్స్‌, డీఎల్‌ఎఫ్‌, హెచ్‌పీసీఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌తో పాటు సుమారు 128 కం‍పెనీలు నేడు తమ క్యూ3 గణాంకాలను వెల్లడించనున్నాయి. 

12000 పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 5th February 2020

ప్రపంచమార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం వరుసగా మూడోరోజూ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 132.33 పాయింట్ల​లాభంతో 40,921.71 వద్ద, నిఫ్టీ 26.2 పాయింట్లు పెరిగి 12వేలపై 12,005.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌తో కారణంగా గాడి తప్పిన ఆర్థిక వ్యస్థను చక్కదిద్దేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ ఫిబ్రవరి 20న జరిగే సమావేశంలో కీలక రుణ రేటును తగ్గిస్తుందని, రాబోయే వారాల్లో బ్యాంకుల

Most from this category