News


ర్యాలీకి రీజన్స్‌ ఇవే!

Friday 13th December 2019
Markets_main1576229456.png-30211

దేశీయ మార్కెట్లు శుక్రవారం మంచి ర్యాలీ జరుపుతున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల మేర అప్‌మూవ్‌ చూపాయి. నిఫ్టీ కీలకమైన 12056 పాయింట్ల పైన స్థిరంగా కదలాడుతోంది. ఈర్యాలీకి నాలుగు ప్రధాన కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
1. ట్రేడ్‌ ఉద్రిక్తతలు చల్లారడం: యూఎస్‌, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ ముగింపునకు వచ్చినట్లు సంకేతాలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఒక డీల్‌కు సంబంధించి ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో వచ్చే ఆదివారం అమల్లోకి రానున్న కొత్త టారిఫ్‌లు నిలిచిపోయాయి. ఈ వార్తలతో అటు యూఎస్‌ నుంచి ఇటు జపాన్‌ వరకు ఈక్విటీలు మంచి ర్యాలీ జరిపాయి.
2. యూకే ఎన్నికల ఫలితాలు: బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ మరోమారు బంపర్‌ మెజార్టీతో ఎంపికైంది. దీంతో బ్రెగ్జిట్‌కు మార్గం సుగమమైంది. దేశీయ కంపెనీల్లో యూకేనుంచి రెవెన్యూ ఆర్జించే కంపెనీల షేర్లు ఈ వార్తతో దూసుకుపోయాయి. 
3. ఆసియా మార్కెట్లలో ర్యాలీ: ట్రేడ్‌డీల్‌ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మంచి లాభాల్లో ఉన్నాయి. నికాయ్‌, హాంగ్‌సంగ్‌ సూచీలు దాదాపు రెండున్నర శాతం లాభపడ్డాయి.
4. టెక్నికల్స్‌: ఎంఎస్‌సీఐ ఈఎం ఇండెక్స్‌లో తాజాగా గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడింది. ఇది వర్ధమాన మార్కెట్లకు పాజిటివ్‌ అంశం. గతంలో ఈ తరహా క్రాస్‌ ఏర్పడినప్పుడు ఈఎం సూచీలు బాగా లాభపడ్డాయి. దీనికితోడు నిఫ్టీలో కూడా ఇటీవల గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడింది. ఇవన్నీ టెక్నికల్‌గా సూచీల్లో పాజిటివ్‌ సంకేతాలు ఇచ్చాయి. 



You may be interested

డీలాపడ్డ ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌

Friday 13th December 2019

లాభాల స్వీకరణే అంటున్న విశ్లేషకులు  8.50శాతం క్షీణించిన షేరు లిస్టింగ్‌ రోజున మెరుపులు మెరిపించిన ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ షేరు రెండో రోజూ డీలా పడింది. నిన్నటి ట్రేడింగ్‌లో ఇష్యూ ధర రూ.37తో పోలిస్తే 57శాతం లాభంతో రూ.58 వద్ద లిస్టయైన సంగతి తెలిసిందే. క్రితం రోజు ఈ షేరు రూ.56 వద్ద ముగిసింది. నిన్నటి రోజు భారీ లాభాల్ని చవిచూసిన నేపథ్యంలో నేడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పూనుకున్నారు. ఫలితంగా నేడు 8.50శాతం నష్టపోయి

32వేల పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 13th December 2019

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు దుమ్ము లేపుతున్నాయి. దీంతో మిడ్‌సెషన్‌ కల్లా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 32వేల స్థాయిని అధిగమించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 31,775.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు స్వల్పంగా ఉన్నప్పటికి.., క్రమంగా డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువ లభించింది.

Most from this category