News


వచ్చే 6 నెలల్లో ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకోవచ్చు: కోటక్‌ ఏఎంసీ

Thursday 18th July 2019
Markets_main1563446734.png-27163

  • ఎన్‌బీఎఫ్‌సీలు వచ్చే రెండు త్రైమాసికాలలో కూడా కష్టంగానే..
  • పవర్‌ యుటిలిటీస్‌ కన్నా గ్యాస్‌ యుటిలిటీస్‌ బాగున్నాయి.
  • ఐటీ రంగం వృద్ధి కరెన్సీ స్థాయిపై అధికంగా ఆధారపడి ఉంటుంది.  

ఆర్థిక వ్యవస్థ ఒకసారి పుంజుకోవడం ప్రారంభిస్తే వచ్చే మూడు లేదా ఆరు నెలలలో ఇన్వెస్టర్లు పోర్ట్‌పోలియోల విషయంలో కొంత రిస్క్‌ తీసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం పడిపోయిన షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారని కోటక్‌ ఏఎంసీ సీఐఓ హర్ష ఉపధ్యాయ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే....

ఎన్‌బీఎఫ్‌సీలో సమస్యలున్నాయి..
ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఇంకా సమస్యలున్నాయి. మొదట్లో ఆస్తి, రుణాల మధ్య అసమతుల్యత వలన ప్రారంభమైన ఈ సమస్య తర్వాత పెద్దదిగా మారింది. ప్రస్తుత  సమయంలో చాలా వరకు ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకుల నుంచి గాని లేదా మూచ్యువల్‌ ఫండ్‌ల నుంచి గాని రుణాలను సేకరించలేకపోతున్నాయి. ఈ కంపెనీల రుణాలు ప్రమాదకరమవడంతో పాటు ఆస్తి నాణ్యత, పాలన సమస్యలు చుట్టుముట్టడంతో ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ప్రతి వారానికి ఏదో ఒక కంపెనీపై ప్రతికూల కథనాలు వినిపిస్తే డెట్‌ మార్కెట్లు తిరిగి సాధరణ స్థాయికి రావడం కష్టమవుతుంది. 

వినియోగ రంగం పుంజుకోవాలి...
వినియోగ రంగం వైపు కంటే మౌలిక సదుపాయాలు లేదా ఆర్థిక కార్యచరణకు లింకై ఉన్న కొన్ని స్టాకులు వాల్యుషన్లు బాగున్నాయి. అయితే ఆర్థిక మందగమనం ఈ రెండింటికి నష్టాన్ని చేకూరుస్తుంది. దీని ప్రభావం వలన వినియోగం రంగం ఎక్కువగా నష్టపోతోందని చెప్పాలి. అంతేకాకుండా ఈ రెండు రంగాల వాల్యుషన్ల తేడా అధికంగా ఉంది.  మార్కెట్ అంచనాలకు విరుద్ధంగా వినియోగ రంగం కొనసాగుతున్నంత వరకు వీటికి  ఎటువంటి మద్దతు లభించే అవకాశం లేదు. 

రసాయన రంగంలో అవకాశాలు..కొందరికే
మా పోర్ట్‌ఫోలియోల ప్రకారం కొన్ని స్పెషాలిటీ, అగ్రో కెమ్‌,  ఫార్మా సంబంధిత రసాయన కంపెనీలు కొంత ప్రమాదంలో ఉన్నాయి. పర్యావరణ సమస్యల కారణంగా కొన్ని చైనా కంపెనీలు ఉత్పత్తిని మూసివేయాల్సి రావడంతో ఇందులో స్వల్ప కాలిక అవకాశాలు మాత్రమే ఉన్నాయని నమ్ముతున్నాం.  డిమాండ్‌ ఒకే విధంగా ఉండడం వలన ఈ రసాయన కంపెనీలు పనిచేసే విభాగం ఆధారంగా వీటి ఎగుమతి అవకాశాలు ముడిపడి ఉన్నాయి. అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ వలన మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయంగా పెద్ద పెద్ద కంపెనీలు తమ ఔట్‌సోర్సింగ్‌ కోసం చైనా కాకుండా మిగిలిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. ఒక వేళ ట్రేడ్‌ వార్‌ ఒత్తిళ్లు కొనసాగితే, సరఫరాకు అంతరాయం కలిగితే ఈ పెద్ద కంపెనీలలో కొన్ని తమ ఇంటర్మీడియేట్‌ బేస్‌ను ఇతర ప్రాంతాలకు మార్చే అవకాశం ఉంది. ఇది ఇండియా రసాయన కంపెనీలకు మంచి అవకాశం. భారతీయ రసాయన రంగ కంపెనీలన్నింటికి ఈ అవకాశం దక్కకపోవచ్చు. కానీ మంచి నాణ్యత, సరఫరా సమయ పాలనను పాటించి, అంతర్జాతీయ కంపెనీలతో పోటిపడగలిగే కంపెనీలు మధ్యస్థ, దీర్ఘకాలిక ఎగుమతుల అవకాశాలను పొందగలవు. 

పవర్‌ కన్నా గ్యాస్‌ బెటర్‌..
మధ్యస్థ, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు గ్యాస్‌ యుటిలిటీస్‌ పై అధికంగా ఉండడవలన పవర్‌ యుటిలిటీస్‌ కన్నా గ్యాస్‌ యుటిలిటీస్‌ రంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలు పర్యవరణ రహితమైన చర్యలను తీసుకోడానికి అధిక ప్రాదాన్యం ఇసున్నాయి. అందువలన ప్రస్తుత సమయంలో గ్యాస్‌ యుటిలిటీస్‌ను పరిశీలించడం మంచిది. వడ్డి రేట్ల కోత రెండింటిపై ఒకే విధంగా సానుకూల ప్రభావాన్ని చూపనుంది. 

ఐటీలో కొన్నే..
ఐటి రంగంలో కొన్ని స్టాకులు బాగున్నాయి. కానీ మొత్తం రంగానికి సంబంధించినంతవరకు కొంత మందగమనం ఉందని అనిపిస్తోంది. దీంతో పాటు భారతీయ ఐటి కంపెనీలకు డిజిటల్ విభాగంలో భవిష్యత్తులో ఆశించిన వృద్ధిని సాధించడానికి సరైన వ్యాపార నమూనా ఉందా అనే విషయంలో కూడా అనుమానాలున్నాయి. స్వల్పకాలికంగా బలపడుతున్న కరెన్సీ ఈ సమయంలో ఐటి రంగానికి సానుకూలంగా ఉండే అవకాశం లేదు. వీటన్నిటి వలన ఐటీ రంగంపై అండర్‌ వెయిట్‌గా ఉన్నాం. కానీ ఈ రంగంలోని కొన్ని కంపెనీలపై వీటి ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువలన కొంత పాజిటివ్‌గా కూడా ఉన్నాం.  
    ముఖ్యంగా ఆర్థిక మందగమనం ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో అధిక పీఈ కలిగిన స్టాకులు కొంత ప్రమాదాన్ని కూడా కలిగి ఉంటాయి. మందగమనం ఉన్న పరిస్థితుల్లో అధిక వాల్యుషన్లు కలిగిన స్టాకుల వలన ఆదాయాలు తగ్గడం వంటి  ప్రమాదాలు పొం‍చి ఉంటాయి. అందువలన కొన్ని అధిక పీఈ లేదా అధిక వాల్యుషన్‌ స్టాక్‌లను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

 



You may be interested

11600 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 18th July 2019

మూడురోజుల ర్యాలీకి బ్రేక్‌ 39000 దిగువన ముగిసిన సెన్సెక్స్‌  మార్కెట్‌ మూడురోజుల వరుసగా ర్యాలీ గురువారం బ్రేక్‌ పడింది. ఇప్పటికి వెలువడిన పలు కార్పోరేట్‌ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తెరపైకి రావడం, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్ భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాను మరోసారి కోత విధించడం మార్కె్‌ట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ

ఆర్‌ఐఎల్‌ ఫలితాలు.. ఈసారి నిరాశ తప్పదా?

Thursday 18th July 2019

రిఫైనింగ్‌, పెట్రోకెమ్‌ విభాగాల్లో సవాళ్లు దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించనుంది. రిఫైనింగ్‌, పెట్రోకెమ్‌ విభాగాల్లో సవాళ్ల కారణంగా ఈసారి కంపెనీ లాభాల వృద్ధి స్తబ్దుగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే జియో, రిటైల్‌ విభాగాల ప్రదర్శన కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.  క్యు1లో ఆర్‌ఐఎల్‌ ఫలితాలపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి... - ఐడీబీఐ క్యాపిటల్‌: లాభంలో 0.6 శాతం వృద్ధి(గతేడాదితో పోలిస్తే) ఉండొచ్చు. రెవెన్యూలో

Most from this category