News


బీమా స్టాకులపై ఎఫ్‌పీఐల మక్కువ

Wednesday 7th August 2019
Markets_main1565160927.png-27605

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత కొద్దిరోజులుగా దేశీయ ఈక్విటీల్లో అమ్మకాలకు దిగారు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులకు మొగ్గు చూపే ఎఫ్‌పీఐలు మాత్రం ఇదే సమయంలో దేశీయ బీమారంగంపై మక్కువగా ఉన్నారు. ముఖ్యంగా గత ఏడాదిన్నరగా ఎఫ్‌పీఐల నిర్మాణాత్మక ఆలోచనాదోరణిలో మార్పు వచ్చింది. బీమారంగ విస్తరణకు భూరీ అవకాశం ఉన్నట్లు ఎఫ్‌పీఐలు గమనించాయి. మరోవైపు పలు బ్లూచిప్‌కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటాలు కిక్కిరిసినందున కొత్తగా బీమారంగంపై వీటి కన్నుపడింది. ఇప్పటికే దేశీయ బీమా కంపెనీల్లో ఎఫ్‌పీఐలకు గణనీయంగా వాటాలున్నాయి. ఈ వాటాలను మరికొంత పెంచుకునేందుకే విదేశీ మదుపరులు మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏడాది కాలంలో ఎస్‌బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ లుంబార్డ్‌ల్లో ఎఫ్‌పీఐల వాటా దాదాపు రెట్టింపైంది. 

దేశీయ బీమా రంగం వచ్చే రెండుమూడేళ్లు ఏటా 12= 15 శాతం వార్షిక వృద్ది నమోతు చేస్తుందన్న అంచనాలున్నాయి. మరోవైపు ఎంఎఫ్‌లపై సెబి తీసుకువచ్చిన కొత్త నిబంధనలు బీమా ఉత్పత్తుల అమ్మకాలు మరింత పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. జనరల్‌ బీమా రంగంలో ప్రైవేట్‌ కంపెనీలకు 48 శాతం వాటా ఉండగా, లైఫ్‌ఇన్స్యూరెన్స్‌ విభాగంలో 29 శాతం వాటా ఉంది. బీమారంగానికి ఉన్న గతిచోదక శక్తిని విశ్వసిస్తున్న ఎఫ్‌పీఐలు ఈ రంగంలోని కంపెనీల్లో వాటాలను మరింతగా పెంచుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎస్‌బీఐ లైఫ్‌ షేరు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉందని, ఐసీఐసీఐ లుంబార్డ్‌ సైతం కొనుగోలుకు అనువుగానే ఉందని నిపుణుల అంచనా. ఈ రంగానికి ఉన్న వృద్ధి అవకాశాలను లెక్కలోకి తీసుకుంటే ఈ వాల్యూషన్లు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని అనలిస్టుల అభిప్రాయం. You may be interested

11150 వరకు నిఫ్టీ పుల్‌బ్యాక్‌ ర్యాలీ?!

Wednesday 7th August 2019

నిపుణుల అంచనా మార్కెట్లలో వచ్చిన భారీ పతనం అనంతరం స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌ తప్పదని, ఇందులో భాగంగా షార్ట్‌టర్మ్‌లో నిఫ్టీ 11150 పాయింట్ల వరకు ఎగబాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో గరిష్ఠాల నుంచి సూచీలు ప్రస్తుతం దాదాపు 10 శాతం మేర పతనమయ్యాయి. బుధవారం సూచీలు స్వల్పశ్రేణిలో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 10800 పాయింట్ల స్థాయి కీలకమద్దతుగా నిలుస్తుందని, స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌ అనంతరం సూచీల ప్రవర్తన అంచనా వేయలేమని భావిస్తున్నారు.  వారం రోజుల

నిఫ్టీ విలువ ఇంకా ఎక్కువే: ఎమ్‌కే గ్లోబల్‌

Wednesday 7th August 2019

ఇన్సిస్టీట్యూషనల్‌ క్లయింట్‌ గ్రూప్‌ సీఈఓ సువీర్ చినాని, ఈక్విటీ స్ట్రాటజిస్ట్ హెడ్, ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ అండ్ రీసెర్చ్ సునీల్ తిరుమలై ఓ ఆంగ్ల చానెల్‌తో  మార్కెట్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.    మొత్తం ప్రాతిపదికన, వాల్యుషన్లు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేకపోవడంతో ఫండ్స్‌లో నగదు స్థాయిలు పెరుగుతున్నాయని, ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారని చినాని అన్నారు. తిరుమలై మాట్లాడుతూ..ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే కార్పోరేట్‌ ఆదాయాలలో ఎక్కువ డౌన్‌గ్రేడ్‌లు జరిగిన

Most from this category