News


స్టాక్స్‌ వ్యాల్యూషన్లపైనే దృష్టి పెట్టండి: ప్రశాంత్‌ జైన్‌

Saturday 23rd November 2019
Markets_main1574448776.png-29794

దేశ జీడీపీ తాత్కాలికంగా క్షీణించిందని స్టాక్‌మార్కెట్‌ పట్ల ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉండడం సరికాదని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ అయిన ప్రశాంత్‌ జైన్‌ అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో జైన్‌ మాట్లాడుతూ విలువైన విషయాలను ఇన్వెస్టర్లకు తెలియజేశారు. 

 

‘జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుంచి 5 శాతానికి పడిపోవచ్చు. అయితే, అది అక్కడే ఉండిపోదన్న’ విషయాన్ని ప్రశాంత్‌ జైన్‌ గుర్తు చేశారు. తక్కువ వడ్డీ రేట్లు అన్నవి ఈక్విటీలకు విలువను సమకూర్చేదిగా పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం తక్కువగా ఉన్నా కానీ, ఈక్విటీల పారదర్శక విలువ అంతే ఎక్కువగా ఉంటుందన్నారు. ఆర్థిక రంగ మందగమనం ఉన్నప్పటికీ భారత మార్కెట్లు మంచి విలువను ఆఫర్‌ చేస్తున్నాయని చెప్పారు. వినియోగ ఆధారిత స్టాక్స్‌ మినహా ఇతర అన్ని రంగాల ‍స్టాక్స్‌ వాటి దీర్ఘకాల సగటు కంటే తక్కువలోనే ట్రేడ్‌ అవుతున్నాయని జైన్‌ పేర్కొన్నారు. వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ అంటే ఇతరులకు మీరు భిన్నంగా ఆలోచిస్తు‍న్నట్టుగా అభివర్ణించారు. 

 

మంచి నాణ్యమైన వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు తాను ఇష్టపడతానని, అధిక నాణ్యత వ్యాపారాలు ఎప్పుడూ అధిక వ్యాల్యూషన్‌లోనే ఉంటాయని వివరించారు. 1999-2000లో ఐటీ కంపెనీల వ్యాల్యూషన్లు చాలా అధికంగా ఉండేవని, తర్వాతి కొన్సి సంతవ్సరాల వృద్ధిని అవి ముందే చూపించేశాయన్నారు. బీపీసీఎల్‌ 2000 సంవత్సరంలో ఒక్క ఎల్‌పీజీ సిలిండర్‌ విలువకే లభించేదని, అశోక్‌ లేలాండ్‌ షేర్లు కంపెనీ బ్యాలన్స్‌ షీటులోని మూలధన నిధుల కంటే తక్కువ విలువకే లభించేవని జైన్‌ గుర్తు చేశారు. ప్రభుత్వ రంగంలోని మైనింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎంపిక చేసిన బ్యాంకులు, విద్యుత్‌ రంగాల కంపెనీలు స్థిరమైన వ్యాపార నమూనాలతో, వాటి అంతర్గత విలువ కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతున్నట్టు చెప్పారు. 

 

ఎన్‌బీఎఫ్‌సీలు నూతన విభాగాల్లో రుణాలు ఇస్తూ విజయవంతం అయ్యాయని, ఇప్పుడు బ్యాంకులు అందులో కొంత వాటాను తిరిగి సొంతం చేసుకున్నట్టు ప్రశాంత్‌జైన్‌ వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను 1994 ఫిబ్రవరి నుంచి ప్రశాంత్‌జైన్‌ నిర్వహిస్తూ రికార్డు సృష్టించిన విషయం గమనార్హం. నాటి నుంచి వార్షికంగా ఈ పథకం 18.9 శాతం చొప్పున రాబడులను పంచింది. 
 



You may be interested

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోకి నెస్లే, టైటాన్‌, అల్ట్రాటెక్‌

Saturday 23rd November 2019

యూపీఎల్‌, డాబర్‌ ఇండియాకు కూడా చోటు టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, వేదాంత, యస్‌ బ్యాంకు తొలగింపు డిసెంబర్‌ 23 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి కొత్తగా నెస్లే, టైటాన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ అడుగు పెట్టనున్నాయి. ప్రస్తుతం సూచీలో ఉన్న వేదాంత, యస్‌ బ్యాంకు, టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ బయటకు వెళ్లిపోనున్నాయి. డిసెంబర్‌ 23 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రకటించింది.

బీపీసీఎల్‌కు వేటిలో వాటాలు ఉన్నాయో తెలుసా?

Friday 22nd November 2019

ప్రభుత్వ రంగ చమురు కంపెనీ బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం ఇందుకు తగిన ఇన్వెస్టర్‌ వేటలో ఉంది. కంపెనీ వాటా విక్రయానికి ముందు కంపెనీ అసెట్స్‌ను వేరు చేసే పనిలోఉంది. ఇందులో భాగంగా కంపెనీకి వివిధ జేవీల్లో ఉన్న వాటాలను మదింపు చేస్తోంది. పలు పీఎస్‌యూ చమురు కంపెనీల్లాగే బీపీసీఎల్‌కు అనేక క్రాస్‌ హోల్డింగ్స్‌ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఇతర ఆదాయాలు దాదాపు 13- 28

Most from this category