News


షేర్ల ఎంపికలో అప్రమత్తత అవసరం: ఆనంద్‌ రాఠి

Wednesday 23rd January 2019
Markets_main1548219015.png-23740

ప్రస్తుత ఏడాది భార‌త ఈక్వీటీ మార్కెట్‌ కొన్ని సానుకూలాంశాలు, మ‌రికొన్ని ప్రతికూలాంశాలతో  మిశ్రమంగా ట్రేడ‌య్యే అవ‌కాశం ఉంద‌ని బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్ రాఠి అనలిస్ట్‌ సిద్ధార్థ్ సేదాని అంచ‌నా వేస్తున్నారు. భార‌త స్థూల ఆర్థిక వ్యవ‌స్థ బ‌లంగా ఉండ‌టం మన ఈక్విటీ మార్కెట్‌కు క‌లిసొచ్చే అంశ‌మ‌ని సిద్ధార్థ్ సేదాని అంటున్నారు. ఆయన అంచనాల ప్రకారం......
బ్యాంకుల నిర‌ర్థక ఆస్తులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌తేడాదిలో మార్చిలో 11శాతంగా న‌మోదైన బ్యాంకుల ఎన్‌పీఏలు సెప్టెంబ‌ర్ నాటికి 10.8శాతానికి దిగివ‌చ్చాయి. ఈ ఏడాది (2019) మార్చి చివ‌రి నాటికి 10.3 శాతానికి దిగివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆర్‌బీఐ తన రిపోర్ట్‌లో పేర్కోంది. పై అంశం దేశీయ ఈక్విటీల స్థిరత్వానికి దోహదపడుతుంది.
ఈ ఏడాదిలో జరగనున్న సాద‌ర‌ణ ఎన్నిక‌ల ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యస్థితి త‌దిత‌ర కార‌ణాలు దేశీయ ఈక్వీటీ మార్కెట్ల గ‌మ‌నానికి అవ‌రోధాలుగా నిలువ‌వచ్చు.
అయితే ఇప్పుడు మార్కెట్‌ కార్పోరేట్ ఫ‌లితాల సీజ‌న్‌లో ప్రవేశించింది. ఈ స్వల్పకాలంలో ఆయా కంపెనీల‌ ఫ‌లితాలు మార్కెట్ గ‌మనాన్ని నిర్ధేశిస్తాయి. ఈ త‌రుణంలో ఇన్వెస్టర్లు షేర్ల ఎంపికలో ఆచితూచి వ్యవ‌హ‌రించాల‌ని సేదాని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. ‘‘అంత‌ర్జాతీయ, జాతీయంగా జ‌రిగే రాజ‌కీయ, భౌగోళిక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకూడ‌దు. ఏ కంపెనీ అధిక ఆదాయాలను ఆర్జిస్తుందో, అలాగే ఏ కంపెనీ అత్యుత్తమ కార్పోరేట్ గ‌వ‌ర్నెన్స్ ప్రమాణాలను పాటిస్తూ అధిక మార్జిన్లు సాధిస్తుందో...ఆ కంపెనీ షేర్లను ఎంపిక చేసుకోవాలి’’  అని సిద్ధార్థ్ సేదాని సూచిస్తున్నారు.

 You may be interested

కెప్టెన్‌ మోదీ.. వరాల సిక్సర్‌?

Wednesday 23rd January 2019

రైతులకు నేరుగా నగదు ప్రయోజనం సబ్సిడీలన్నీ కలిపి నేరుగా ఇచ్చే ప్రతిపాదన సాగు రంగానికి మరింతగా రుణ వితరణ మధ్య తరగతి వర్గాలకు పన్ను ప్రోత్సాహకాలు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు  ప్రభుత్వానికి ద్రవ్యలోటు సవాళ్లు ప్రోత్సాహకాలు పెంచితే సమస్యలు పెంచకపోతే ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం దీంతో బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో ఆసక్తి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తన చివరి ఆదాయ, వ్యయాల చిట్టాను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆఖరి ప్రయత్నంలో అయినా

మూడు వారాల కనిష్టం నుంచి కోలుకున్న పసిడి

Wednesday 23rd January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి 3వారాల కనిష్టం నుంచి పుంజుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనం పసిడి రికవరికి దోహదపడ్డాయి. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి అంతంత మాత్రంగా ఉంటుందనే ఐక్యరాజ్యసమితి నివేదకలు వెల్లడించడంతో ఐరోపా, అమెరికా, ఆసియా ఈక్విటీ మార్కెట్లు నష్టాల పట్టాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లకు వ్యతిరేకంగా ట్రేడయ్యే పసిడి రాత్రి అమెరికా మార్కెట్లో 7డాలర్లు లాభపడి 1283.40 వద్ద ముగిసింది. నిన్న ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో డాలర్‌

Most from this category