STOCKS

News


కార్పోరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో సెన్సెక్స్‌ 1200 పాయింట్లు హైజంప్‌

Friday 20th September 2019
Markets_main1568958571.png-28450

కార్పోరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అనూహ్య ప్రకటనతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ ఆర్థిక మందగమనాన్ని ఉత్తేజపరిచేందుకు కార్పోరేట్ పన్ను రేటును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అన్ని రంగ షేర్లలో విపరీతమైన కొనుగోళ్ల సునామి మొదలైంది. అత్యధికంగా బ్యాంకింగ​రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఉదయం గం.11:20నిల.కు సెన్సెక్స్‌ 1207 పాయింట్లు పెరిగి 37334 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు  లాభపడి 11031 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంక్‌ నిప్టీ 4.50శాతం(1200 పాయింట్లు) 28012 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
నిఫ్టీ -50 ఇండ్సె్‌లోని మొత్తం 50 షేర్లకు గానూ జీ లిమిటెడ్‌(6శాతం), ఎన్‌టీపీసీ (అరశాతం) షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతి సుజుకీ, ఐషర్‌మోటర్స్‌ షేర్లు 6శాతం నుంచి 12.50శాతం లాభపడ్డాయి. You may be interested

కేంద్రం అనూహ్య బొనంజా...కార్పొరేట్‌ పన్ను తగ్గింపు

Friday 20th September 2019

కేంద్రప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి (అన్ని రకాల సర్‌చార్జీ, సెస్‌ కలిపి) 25.17 శాతానికి తగ్గించి మార్కెట్‌ వర్గాలను శుక్రవారం ఆశ్చర్యపరిచింది. ఈ తాజా ట్యాక్స్‌ రేట్‌ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్‌ 1) నుంచి పరిగణిస్తారు. కాగా ఈ నిర్ణయం జీఎస్‌టీ సమావేశానికి ముందు వెలువడడం గమనార్హం. శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన అంశాలు.. -2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి

ఉద్దీపనకు వీల్లేదు కానీ... రేటు కోతకు అవకాశం

Friday 20th September 2019

ఆర్‌బీఐ గవర్నర్‌ అభిప్రాయం  ద్రవ్యోల్బణం అదుపువల్ల  రెపో తగ్గించవచ్చని సూచన ముంబై: ధరల స్పీడ్‌ (ద్రవ్యోల్బణం) అదుపులో ఉండడం వల్ల బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రస్తుతం 5.4 శాతం) మరింత తగ్గింపునకు అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2తో 2 శాతంగా

Most from this category