News


1.50శాతం లాభపడ్డ ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌: ఐటీసీ డౌన్‌, హెచ్‌యూఎల్‌ అప్‌

Monday 3rd February 2020
Markets_main1580710160.png-31464

ఎఫ్‌ఎమ్‌సీజీ రంగానికి చెందిన ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఒకటి నష్టాల్లోనూ, మరోటి లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్నాయి. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ఎన్‌సీసీడీ పన్ను పెంపుతో ఐటీసీ షేర్లు చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లో ఏకంగా 9.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఏడాదిన్నర కాలంలో రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో అత్యధిక నష్టాన్ని చవిచూశాయి. షేర్ల భారీ పతనంలో కంపెనీ రూ.33,000 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయింది. తద్వారా టాప్‌ -10 మార్కెట్‌ క్యాప్‌ కలిగిన జాబితాలో స్థానం కోల్పోయింది.

ఐటీసీ:- దేశంలో చట్టబద్దంగా సిగరెట్లను అత్యధికంగా విక్రయించే సంస్థగా ఐటీసీ ఉంది. బడ్జెట్‌లో భాగంలో శనివారం సిగరెట్‌, ఇతర పొగాకు ఉత్పత్తులపై జాతీయ విపత్తు నిర్వహణ సుంకాన్ని(ఎన్‌సీసీడీ) పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కోన్నారు. ఫలితంగా శనివారం ట్రేడింగ్‌లో దాదాపు 7శాతం నష్టంతో ముగిసింది. మునుపటి నష్టాల ముగింపును కొనసాగిస్తూ నేడు ఐటీసీ షేరు రూ.215.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 6.50శాతం నష్టపోయి రూ.205.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ కనిష్ట ధర షేరు 52వారాల కనిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.10:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.218.85)తో పోలిస్తే 3.70శాతం నష్టంతో రూ.210.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.205లు, రూ.310.00లుగా నమోదయ్యాయి.

హెచ్‌యూఎల్‌:- ఎఫ్‌ఎమ్‌సీజీ రంగానికి చెందిన మరో దిగ్గజ కంపెనీ, హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) సోమవారం బీఎస్‌ఈలో రూ.2075.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు అంచనాలను మించడంతో పాటు ఇదే రంగానికి తన ప్రత్యర్థి కంపెనీ ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఈ కంపెనీ షేరు కలిసొచ్చింది. ఫలితంగా నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 5శాతానికి పైగా లాభపడి రూ.2179.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:10ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.2073.60)తో పోలిస్తే 5శాతం లాభంతో రూ.2173.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1649.70, రూ.2187.00లుగా నమోదయ్యాయి.

నిఫ్టీ ఎఫ్‌ఎమ్‌సీజీ ఇండెక్స్‌ 1.50శాతం అప్‌:-
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం మేర లాభపడింది. ఈ రంగానికి చెందిన నెస్లే ఇండియా, హిందూస్థాన్‌ యూనిలివర్‌, బ్రిటానియా, డాబర్‌, కోల్గేట్‌, మారికో, టాటా గ్లోబల్‌, గోద్రేజ్‌, జుబిలెంట్‌ ఫుడ్స్‌ షేర్లు 5శాతం నుంచి 1శాతం వరకు లాభపడ్డాయి. ఐటీసీ, పీజీహెచ్‌హెచ్‌, యూబిఎల్‌, ఇమామి లిమిటెడ్‌, మెక్‌ డొనాల్డ్‌, మెక్‌ డొనాల్డ్‌ షేర్లు 4శాతం నుంచి 1శాతం నష్టపోయాయి. ఉదయం గం.11:30ని.లకు 1శాతం లాభంతో 30,523.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

52 వారాల గరిష్టానికి 15 షేర్లు

Monday 3rd February 2020

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో సుమారు 15 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో ఏజీసీ నెట్‌వర్క్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌, నెస్ట్లే ఇండియా, రుచీ సోయా ఇండస్ట్రీస్‌, సిర్కా పెయింట్స్‌ ఇండియా, యూనిటెక్‌, విశేష్‌ ఇన్ఫోటెక్‌లు ఉన్నాయి. 52 వారాల కనిష్టానికి 83 షేర్లు  ఎన్‌ఎస్‌ఈలో 83 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. వీటిలో అలహాబాద్‌ బ్యాంక్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రీకల్స్‌ లిమిటెడ్‌, సీఎస్‌బీ

ఐటీసీ సిగరెట్ల ధరలు పెంచాల్సిందే!

Monday 3rd February 2020

తప్పదంటున్న బ్రోకరేజ్‌లు బడ్జెట్లో సిగరెట్లపై అధిక లెవీలను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం ఐటీసీ షేరుపై  నెగిటివ్‌ ప్రభావం చూపింది. శనివారం ఒక్కమారుగా ఐటీసీ షేరు దాదాపు 10 శాతం వరకు పడిపోయి కీలక 220 రూపాయిల దిగువకు వచ్చింది. ఈ ప్రభావం సోమవారం కూడా కొనసాగి షేరు మరో 5 శాతం వరకు పతనమై రూ.205 కనిష్ఠాలను తాకింది. ఐటీసీ లాభాల్లో సిగిరెట్‌ వ్యాపారం కీలకమైనది,

Most from this category