News


ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, టెక్నాలజీ.. గుడ్‌!

Friday 6th March 2020
Markets_main1583474565.png-32324

వేల్యుయేషన్స్‌ రీత్యా ఫార్మా, టెక్నాలజీ రంగాలు
వృద్ధి అవకాశాల ఆధారంగా ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్స్‌
పెట్టుబడులకు పరిశీలించవచ్చు
- సంపత్‌ రెడ్డి, బజాజ్‌ అలయెంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

సాధారణంగా మార్కెట్లలో వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న రంగాలకు ప్రీమియం ధరలు పలుకుతుంటాయని బజాజ్‌ అలయెంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఐవో సంపత్‌ రెడ్డి చెబుతున్నారు. వెరసి ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్‌ రంగాలను ఈ బాటలో పెట్టుబడులకు సూచిస్తున్నారు. ఇదే విధంగా వేల్యుయేషన్స్‌ రీత్యా ఫార్మా, టెక్నాలజీ రంగాలవైపు దృష్టి సారించవచ్చని పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌, మార్కెట్ల తీరు తదితర పలు అంశాలపై ఒక ఇంటర్వ్యూలో సంపత్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం..

జీడీపీ..
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌)లో దేశ జీడీపీ అంచనాలకు అనుగుణంగానే వెలువడింది. అయితే ఈ ఏడాది క్యూ1, క్యూ2 జీడీపీపై 2019లో తగ్గించిన అంచనాలను ఎగువముఖంగా సవరించారు. క్యూ2లో ఫిక్స్‌డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ నీరసించగా.. వృద్ధి సైతం​ప్లస్‌ 1 నుంచి మైనస్‌ 4కు చేరింది. దీంతో క్యూ3లో ఆర్థిక పురోగతి 5.2 శాతంగా నమోదైంది. ఇటీవల వెలువడుతున్న గణాంకాలు ఆర్థిక వ్యవస్థ బాటమవుట్‌ను సూచిస్తున్నాయి. జీడీపీ నెమ్మదిగా రికవరీ బాట పట్టవచ్చు. అయితే ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా అటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతోపాటు.. దేశ జీడీపీ సైతం​ప్రభావితమయ్యే వీలుంది. 

హెచ్చుతగ్గులు
ఆర్థిక వ్యవస్థకు దన్నునిచ్చేందుకు ఓవైపు ప్రభుత్వం, మరోపక్క రిజర్వ్‌ బ్యాంక్‌ పలు చర్యలు చేపడుతున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు, వడ్డీ రేట్ల తగ్గింపు, లిక్విడిటీ పెంపు తదితర చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా, ప్రపంచ మందగమనం వంటి కారణాలతో ఒకవేళ దేశ జీడీపీ స్లోడౌన్‌ అయితే ప్రభుత్వం, ఆర్‌బీఐ మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టవచ్చు. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే అవకాశముంది. కార్పొరేట్‌ ఫలితాలు పుంజుకుంటే తిరిగి మార్కెట్లకు స్థిరత్వం రావచ్చు.

వృద్ధికి ప్రీమియం
గత రెండేళ్ల కాలాన్ని పరిశీలిస్తే మార్కెట్లలో వృద్ధి అవకాశాలు అధికంగాగల రంగాలకు ప్రీమియం ధరలు లభించాయి. ఈ బాటలో చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్‌ రంగాలకు మెరుగ్గా కనిపిస్తు‍న్నాయి. ఇక వేల్యుయేషన్స్‌ రీత్యా చూస్తే దీర్ఘకాలానికి ఫార్మా, టెక్నాలజీ రంగాలు ఆకర్షణీయమని చెప్పవచ్చు. దేశీయంగా కరోనా కేసులు తక్కువే నమోదుకావడం సానుకూల అంశం. అయితే చైనా బయట పలు దేశాలలో వేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం. పరిస్థితులను గమనిస్తూ ఉండాల్సిందే. ప్రపంచంలోనే చైనా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థకావడం, అంతర్జాతీయ జీడీపీలో 16 శాతం వాటాను కలిగి ఉండటంతో కరోనా ప్రభావానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రపంచ వాణిజ్యంలోనూ చైనా ప్రస్తావించదగ్గ స్థాయిలో 12-13 శాతం వాటాను ఆక్రమిస్తోంది. దీంతో ఇప్పటికే చైనా నుంచి సరఫరాలపై ఆందోళనలు తలెత్తాయి. ఇది ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారి చూపవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి.

ఎఫ్‌ఐఐలు 
గత నెలలో దేశీ స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) రూ. 12,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన రిస్క్‌ల కారణంగా ఎఫ్‌ఐఐలు ఇండియాసహా కొన్ని వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు చేపడుతున్నారు. కరోనా, స్లోడౌన్‌, కార్పొరేట్‌ ఫలితాలు వంటి అంశాలు ప్రభావాన్ని చూపుతాయి. కరోనా మరింత పెరిగితే స్వల్ప కాలంలో మార్కెట్లు కరెక్షన్‌ను చవిచూసే అవకాశముంది. అయితే తదుపరి కాలంలో వేల్యూ ఇన్వెస్టింగ్‌వైపు మరిలే అవకాశముంది. ఆర్థిక రికవరీ సంకేతాలు కనిపిస్తే మార్కెట్లు బలపడవచ్చు.

బంగారం 
ప్రస్తుతం పెరిగిన ఆందోళనల నేపథ్యంలో బంగారానికి డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో నిర్ధారిత(ఫిక్స్‌డ్‌) ఆదాయాన్నిచ్చే బాండ్లు, బంగారం తదితరాలకు పెట్టుబడులు మళ్లుతున్నాయి. మార్కెట్లలో ఆటుపోట్లు, రిస్కులు పెరిగినప్పుడు స్వల్ప కాలంలో రక్షణాత్మక పెట్టుబడులు వెలుగులోకి వస్తాయి. అయితే దీర్ఘకాలానికి చూస్తే.. ఈక్విటీ పెట్టుబడులే అధిక రిటర్నులు ఇస్తుంటాయి. అయితే ఇందుకు వేచిచూడగల సామర్థ్యం, తెలివైన నిర్ణయాలు సహకరించగలవు. ఈక్విటీ ఇన్వెస్టర్లు క్రమానుగత పెట్టుబడుల(సిప్‌) విధానాలను అవలంబించడం మేలు. ఇలాంటి సందర్భాలలో లార్జ్‌ క్యాప్స్‌ను ఎంచుకోవచ్చు. కరెక్షన్లలో నాణ్యమైన మిడ్‌ క్యాప్స్‌ను సైతం పరిశీలించవచ్చు.  You may be interested

బ్యాంక్‌ విలీన షేర్ల మార్పిడి ఖారారు

Friday 6th March 2020

న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు విలీనం ఈ నెలాఖరుకు పూర్తవ్వనున్నది. ఈ విలీనానికి సంబంధించి బ్యాంక్‌ షేర్ల మార్పిడి నిష్పత్తి గురువారం ఖరారైంది. వివరాలు... పీఎన్‌బీ షేర్ల మార్పిడి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌(ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ)లు విలీనమవుతున్నాయి. ప్రతి వెయ్యి ఓబీసీ షేర్లకు గాను 1,150 పీఎన్‌బీ షేర్లను, ప్రతి వెయ్యి యూబీఐ షేర్లకు గాను 121 పీఎన్‌బీ షేర్లను కేటాయిస్తారు. రికార్డ్‌

కరోనా దెబ్బతో కుప్పకూలిన 'ఫ్లైబీ'

Friday 6th March 2020

లండన్: కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ 'ఫ్లైబీ' కుప్పకూలింది. విమాన సేవలు నిర్వహించలేమంటూ చేతులెత్తేసింది.  ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఫ్లైట్స్ ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేమని తమ వెబ్‌సైట్లో ప్రకటించింది. అన్ని ఫ్లైట్స్‌ను నిలిపివేశామని, బ్రిటన్‌లో తక్షణం వ్యాపారం నిలిపివేస్తున్నామని పేర్కొంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఎయిర్‌లైన్ మూతబడే పరిస్థితి ఎదురైనా.. బ్రిటన్ ప్రభుత్వం పన్నులపరంగా కొంత వెసులుబాటునివ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే

Most from this category