News


లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటాను పెంచండి: నిర్మలా సీతారామన్‌

Friday 5th July 2019
Markets_main1562309065.png-26819

బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటాను 25శాతం నుంచి 35శాతం వరకు పెంచాలని సెబీ కోరారు. ఈ ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపినట్లైతే, ప్రమోటర్లు అధికశాతం వాటాలు కలిగిన మల్టీనేషనల్ కార్పోరేషన్‌ కంపెనీలకు, ప్రమోటర్లు అధిక శాతం వాటాలు కలిగిన కంపెనీలకు ప్రతికూలంగా మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌ అభివృద్ధి చెందుతున్న దశల్లో ఉన్నందున స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల్లో ప్రమోటలర్ల వాటా అధికంగా ఉండటం మంచిదని ఐఐఎఫ్‌ఎల్‌ ప్రతినిధి అమర్‌ అంబానీ అభిప్రాయపడ్డారు.  రెగ్యూలేటరీ నిబంధనల ప్రకారం కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 75శాతానికి మించి ఉండకూడదు. ప్రసుత్తం సుమారు 1,450 లిస్టింగ్‌ కంపెనీలు ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి. నిఫ్టీ -50 కంపెనీల్లో విప్రో 73.90శాతం, టీసీఎస్‌72.10శాతం, కోల్‌ ఇండియా 71శాతం, హిందూసాన్‌ యూనిలివర్‌ 67.2శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 67.1శాతం ప్రమోటర్లు వాటాలను కలిగి ఉన్నారు. ఆర్థిక మంత్రి నిబంధన కచ్చితంగా అమల్లోకి వచ్చినట్లైతే ఈ కంపెనీలు రూ.1లక్ష కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించాల్సి ఉంటుంది.



You may be interested

పీఎస్‌యూ బ్యాంకులకు రూ.70వేల కోట్ల రీ క్యాపిటలైజేషన్‌: లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు

Friday 5th July 2019

ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000కోట్ల రీ క్యాపిటలైజేషన్‌ ప్రకటించడంతో ఈ రంగ షేర్లు నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. నేడు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 3,313.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో 1శాతం నష్టపోయి 3,260.60స్థాయికి పతనమైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల పునరుద్ధరణలో భాగంగా బడ్జెట్లో రూ.70,000కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత నాలుగేళ్ల కాలంలో దేశీయ బ్యాంకింగ్‌

11900 దిగువకు నిఫ్టీ

Friday 5th July 2019

దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ సందర్భంగా నెగిటివ్‌ రియాక‌్షన్‌ చూపుతున్నాయి. నిఫ్టీ కీలక 11900 పాయింట్ల స్థాయి కోల్పోయి 11881 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. అనంతరం కొంత కోలుకొని 11890 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 145 పాయింట్ల నష్టంతో 39763 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. యస్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, వేదాంత, సన్‌ఫార్మా తదితర షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ రంగాల వారీ సూచీల్లో ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన సూచీలన్నీ నెగిటివ్‌గా మారాయి.

Most from this category