News


పీఎస్‌యూ బ్యాంకులకు రూ.70వేల కోట్ల రీ క్యాపిటలైజేషన్‌: లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు

Friday 5th July 2019
Markets_main1562311356.png-26820

ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000కోట్ల రీ క్యాపిటలైజేషన్‌ ప్రకటించడంతో ఈ రంగ షేర్లు నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. నేడు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 3,313.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో 1శాతం నష్టపోయి 3,260.60స్థాయికి పతనమైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల పునరుద్ధరణలో భాగంగా బడ్జెట్లో రూ.70,000కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత నాలుగేళ్ల కాలంలో దేశీయ బ్యాంకింగ్‌ సెక్టార్‌ నుంచి ఎన్‌పీఏల రిసెల్యూషన్‌ ద్వారా రూ.1లక్ష కోట్లను, దివాలా స్మృతి (ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌-ఐబీసీ) ద్వారా రూ.4లక్షల కోట్లను రివకరీ సాధించనట్లు తెలిపారు. ఫలితంగా ఈ షేర్లు కొనుగోళ్లు మొదలయ్యాయి. సెంట్రల్‌ బ్యాంక్ 2శాతం, ఇండియా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ షేర్లు 1శాతం లాభపడ్డాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌ అరశాతం నుంచి పావుశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,297.30)తో పోలిస్తే 1శాతం లాభంతో 3,300 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మార్కెట్లో నెగిటివ్‌ రియాక‌్షన్‌

Friday 5th July 2019

కొత్త బడ్జెట్‌ పూర్తయిన తర్వాత దేశీయ మార్కెట్లు నెగిటివ్‌ మూడ్‌లోకి మారాయి. ఒక దశలో సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11800 పాయింట్ల దిగువన 11798 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 11840 పాయింట్ల వద్ద నిఫ్టీ, 39600 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌ కదలాడుతున్నాయి. అడ్వాన్స్‌, డిక్లైన్‌ నిష్పత్తి 845:1298గా ఉంది. ఐబీహౌసింగ్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌ లాభాల్లో ఉండగా, యస్‌బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీలు నష్టాల్లో ఉన్నాయి. రంగాల

లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటాను పెంచండి: నిర్మలా సీతారామన్‌

Friday 5th July 2019

బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటాను 25శాతం నుంచి 35శాతం వరకు పెంచాలని సెబీ కోరారు. ఈ ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపినట్లైతే, ప్రమోటర్లు అధికశాతం వాటాలు కలిగిన మల్టీనేషనల్ కార్పోరేషన్‌ కంపెనీలకు, ప్రమోటర్లు అధిక శాతం వాటాలు కలిగిన కంపెనీలకు ప్రతికూలంగా మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌ అభివృద్ధి చెందుతున్న దశల్లో ఉన్నందున స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల్లో

Most from this category