News


ఎస్సెల్‌ మూచ్యువల్‌ ఫండ్‌ వైపు సచిన్ బన్సాల్ చూపు

Thursday 18th July 2019
Markets_main1563433477.png-27154

ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ మ్యూచువల్ ఫండ్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జీ గ్రూప్‌కు చెందిన ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేయడానికి బన్సాల్ ప్రయత్నిస్తున్నట్లు, జీ గ్రూప్‌కి, బన్సాల్‌కు మధ్య చర్చలు తుది స్థాయిలో ఉన్నట్టు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక దన్నుతో ఎస్సెల్‌ మూచ్యువల్‌ ఫండ్‌ను అభివృద్ధి చేయడానికి బన్సాల్‌ ప్రణాళికలు రచిస్తున్నారని, సచిన్ బన్సాల్ ప్రతినిధులకు, ఎస్సెల్ నిర్వహకులకు మధ్య ఇప్పటికే బహుళ సమావేశాలు జరిగాయని పరిశీలకులు తెలిపారు. ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్  శ్రీ గ్రూపుతో గతంలో చర్చలు జరిపినప్పటకి అవి కార్యరూపం దాల్చలేదు. 

   మాజీ బోఫా(బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా) బ్యాంకర్, బన్సాల్ స్నేహితుడు అంకిత్ అగర్వాల్ ఎస్సెల్ ఎంఎఫ్ తరపున చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి బయటకొచ్చాక బన్సాల్ బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో ప్రవేశించడంపై తన ఆసక్తిని ప్రకటించారు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ నుంచి బయటకు వచ్చేసిన ఆరు నెలలకు బీఏసీ ఎక్విజేషన్‌ స్టార్ట్‌ అప్‌ కంపెనీని ప్రారంభించారు. 
 



You may be interested

యస్‌బ్యాంక్‌ షేరుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయి?

Thursday 18th July 2019

క్యు1 ఫలితాల నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో భారీగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌లుఈ షేరుపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయో చూద్దాం... 1. క్రెడిట్‌ సూసీ: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 205 నుంచి 94కు తగ్గించింది. కాసా డిపాజిట్లలో తరుగుదల రీక్యాప్‌ అవసరాన్ని ఎత్తి చూపుతోందని తెలిపింది. కామన్‌ ఈక్విటీ టైర్‌ 1 నిష్పత్తి 8 శాతానికి తగ్గడం. నికర ఎన్‌పీఏలు పెరగడం మరింత ఇబ్బందిని

మైండ్‌ ట్రీ లాభం 41 శాతం డౌన్‌

Thursday 18th July 2019

12 శాతం పెరిగిన ఆదాయం  అనిశ్చితిలోనూ నిలకడ ఫలితాలు సాధించాం  మైండ్‌ట్రీ సీఈఓ రోస్టో రావణన్‌ వెల్లడి  న్యూఢిల్లీ: మద్య స్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 41 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.158 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.93 కోట్లకు తగ్గిందని మైండ్‌ట్రీ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 53 శాతం తగ్గిందని వివరించింది. అయితే ప్రస్తుత

Most from this category