News


ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

Monday 10th February 2020
Markets_main1581304774.png-31635

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్లు మైనస్‌
శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు డీలా

నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో నామమాత్రంగా 2 పాయింట్లు క్షీణించి 12,081 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,083 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. జనవరిలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించినప్పటికీ శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 1-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన దేశీయంగానూ నాలుగు రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్‌ పడింది. రోజం‍తా ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 164 పాయింట్లు క్షీణించి 41,142 వద్ద నిలవగా.. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 12,098 వద్ద స్థిరపడింది. నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభావం చూపినట్లున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు  కూడా మార్కెట్లలో కొంతమేర హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని భావిస్తున్నారు. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,063 పాయింట్ల వద్ద, తదుపరి 12,028 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు  పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 12,144 వద్ద, ఆపై 12,190 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,086 పాయింట్ల వద్ద, తదుపరి 30,970 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 31,343 పాయింట్ల వద్ద, తదుపరి 31,484 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

అటూఇటుగా..
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 162 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 179 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. ఇక గురువారం​ఎఫ్‌పీఐలు రూ. 560 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 304 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.    



You may be interested

తక్షణ మద్దతుశ్రేణి 40,820-40.690

Monday 10th February 2020

తక్షణ మద్దతుశ్రేణి 40,820-40.690 కరోనా వైరస్‌ ప్రభావం, బడ్జెట్‌పై అంచనాలు నెరవేరకపోవడంతో భారత్‌ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసినప్పటికీ.... గతవారం ప్రపంచ మార్కెట్ల వేగవంతమైన  ర్యాలీని ఇక్కడి ఈక్విటీలు కూడా అనుసరించాయి. ఈ మధ్యలో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌, భారత రిజర్వ్‌బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు యథాతథంగా వుండటంతో  మార్కెట్లపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు.  పటిష్టమైన బుల్‌ మార్కెట్లో హఠాత్‌ పతనం సంభవించినపుడు, సాంకేతికంగా రిట్రేస్‌మెంట్‌ ర్యాలీలు కూడా బలంగానే  వస్తుంటాయి.

కరోనా వైరస్‌ పరిణామాలు, గణాంకాలు కీలకం

Monday 10th February 2020

పెరుగుతున్న కరోనా మృతులు  కరోనా పరిణామాలపై మార్కెట్‌ అప్రమత్తత రిటైల్‌, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై దృష్టి  చివరి దశ క్యూ3 ఫలితాలు  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సంబంధిత పరిణామాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్ల పోకడ, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల

Most from this category