News


ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 20th March 2019
Markets_main1553052113.png-24698

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ వరుసగాఏడు రోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు మార్పేదీ లేకుండా ట్రేడవుతోంది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50  గంటలకు 11,571 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,570  పాయింట్ల వద్ద ముగిసింది. గత రాత్రి అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌,  నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు స్వల్ప తగ్గుదలతో ముగియగా, తాజాగా ఆసియా సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.



You may be interested

స్వల్పలాభాలతో ప్రారంభం...వెంటనే నష్టాల్లోకి

Wednesday 20th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో 38,434 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల పెరుగుదలతో 11,552 పాయింట్ల వద్ద మొదయల​య్యాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోకే సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్‌ 30 పాయింట్లు, నిఫ్టీ 16 పాయింట్ల చొప్పున నష్టాల్లోకి మళ్లాయి.

రిస్క్‌ను తగ్గించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌

Tuesday 19th March 2019

పన్ను ఆదా పథకాలకు ఏటా మార్చి నెలలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. సెక్షన్‌ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు కోసం ఈ నెలలోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. అలా చూసినప్పుడు పన్ను ఆదాతో పాటు మెరుగైన రాబడులకు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) అనువైనవి. భిన్న మార్కెట్‌ పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఈ పథకాలకు సహజంగానే ఉంటుంది.

Most from this category