News


నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌ ?

Monday 23rd December 2019
Markets_main1577071645.png-30367

నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,285 పాయింట్ల వద్ద కదులుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ​వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. అమెరికా, చైనా మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య వివాద పరిష్కారానికి ప్రాథమిక దశ ఒప్పందం కుదరడంతో గత వారం యూఎస్‌ మార్కెట్లలో ర్యాలీ నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించడంతో గత వారం ఇటు సెన్సెక్స్‌, అటు నిఫ్టీ సరికొత్త గరిష్టాలను సాధించాయి. వెరసి నేడు కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నదని, దీంతో మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొంది.

రూపీ వీక్‌..
శుక్రవారం డాలరుతో మారకంలో రూపాయి 9 పైసలు నీరసించి 71.12 వద్ద ముగిసింది. 71.15 వద్ద ప్రారంభమై రోజం‍తా అటూఇటుగా కదిలింది. ఒక దశలో 71.23 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 97.68 వద్ద స్థిరత్వాన్ని చూపగా.. జపనీస్‌ యెన్‌ 109.40కు చేరింది. ఇక యూరో 1.107 వద్ద కదులుతోంది.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు...
వారాంతాన దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో దాదాపు రూ. 339 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే మరోవైపు దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 285 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో రూ. 1.3 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేయడం విశేషం. ఈ పెట్టుబడుల ద్వారా రూ. 97,250 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయగా.. మరోపక్క రుణ సెక్యూరిటీల(డెట్‌ మార్కెట్‌)లో రూ. 27,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. 

 You may be interested

రూ. 1.72 లక్షల కోట్ల బకాయిలు కట్టండి

Monday 23rd December 2019

గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు (ఐఎస్‌పీ) ఫీజులు తదితర బాకీలకు సంబంధించి ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లు కట్టాలంటూ ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ పంపింది. ఐపీ-1, ఐపీ-2, ఐఎస్‌పీ లైసెన్సు ఫీజుల బకాయిల కింద రూ. 1,72,655 కోట్లు చెల్లించాలని ఇందులో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే కట్టాల్సినదంతా కట్టేశామని .. ఇక చెల్లించాల్సిన

తగిన ఫండ్‌ ఎలా ఎంచుకోవాలి ?

Monday 23rd December 2019

(ధీరేంద్ర కుమార్‌ వ్యాల్యూ రీసెర్చ్‌) ప్ర: నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాకు తగిన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి ? -భారతి, విశాఖపట్టణం  జ: ఒక వ్యక్తి ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఎలాంటి ఫండ్‌ను ఎంచుకోవాలి అనే విషయం  రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఆదాయం, వ్యయాలు, ఇప్పటికే ఉన్న అప్పులు, భవిష్యత్తు అవసరాలు, ఆర్థిక లక్ష్యాలు, వయస్సు, మీపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వాళ్లు, మీరు నెలకు ఎంత మేర ఇన్వెస్ట్‌

Most from this category