News


ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 7th September 2019
Markets_main1567836097.png-28254

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ ముగిసే సరికి 10,964.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10973.65పాయింట్లతో పోలిస్తే 9 పాయింట్ల నష్టంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాహనరంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్చలు తీసుకోవచ్చనే అంచనాలు, అమెరికా-చైనాల మధ్య అక్టోబర్‌లో జరగనున్న వాణిజ్య చర్చల్లో భాగంగా సానుకూల ఫలితాలు రావచ్చనే అంచనాలు, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి వరుస మూడురోజూ ర్యాలీ తదితర సానుకూలాంశాల నేపథ్యంలో వచ్చేవారంలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని నిఫ్టీ ఇండెక్స్‌ 11,150-11180 శ్రేణిలో కదిలాడే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి అభిప్రాయపడుతున్నారు.
మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు:-
అమెరికాలో ఉద్యోగుల నియామకాలు ఆగస్ట్‌లో ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో శుక్రవారం అమెరికా మార్కెట్లు  మిశ్రమంగా ముగిశాయి. ఈ నెలలో ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతపై అంచనాలు బలపడటం, ప్రపంచఆర్థిక వృద్ధి ఆందోళన నేపథ్యంలో చైనా ఉద్దీపన ప్రణాళికల ప్రకటన తదితర అంశాలు మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. ప్రధాన సూచీలైన డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌  69.45  పాయింట్లు పెరిగి 26,797.6 వద్ద, ఎస్‌ అండ్‌ పీ 2.72 పాయింట్లు ర్యాలీ చేసి 2,978.72 వద్ద, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 13.75 పాయింట్లు నష్టపోయి 8,103.07 వద్ద స్థిరపడ్డాయి. చైనాతో కొనసాగుతున్న వాణిజ్యయుద్ధం కారణంగా ఉద్యోగాల కల్పనలో కీలక రంగాలైన సేవా, రీటైల్‌, రవాణా వంటి నెమ్మదించాయి. ఫలితం‍గా ఈ ఆగస్ట్‌లో 1.30లక్షల మందికి ఉపాధి లభించింది.  
నష్టాల్లో ముగిసిన ఐటీ ఏడీఆర్‌లు:- 
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఐటీ ఏడీఆర్‌లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌లు దాదాపు 2.50శాతం నష్టపోయాయి. అయితే, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.82శాతం, ఐసీసీఐ ఏడీఆర్‌ 1.88శాతం, టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 1.70శాతం, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 0.75శాతం లాభాల్లో ముగిశాయి.



You may be interested

మైక్రోఫైనాన్స్‌ రంగంలో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయకూడదు?

Sunday 8th September 2019

పెద్ద కార్పొరేట్‌ సంస్థలు తమకున్న పేరు, ప్రఖ్యాతులు, బ్రాండ్‌ వ్యాల్యూతో రుణాలను సులభంగా పొందగల స్థితిలో ఉంటాయి. వారితో చేతులు కలిపేందుకు రుణాలిచ్చే సంస్థలు కూడా సంతోషంగానే ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన రుణాలను వెనక్కి పొందగలమన్న నమ్మకం వాటిది. దీనికి భిన్నంగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్‌) తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇచ్చేవి. పైగా ఇవి సులభంగా లభించేవి కావు. కానీ, వరుసగా కార్పొరేట్‌ సంస్థలు రుణాల

కార్పొరేట్‌ మోసాలతో సవాళ్లు

Saturday 7th September 2019

కేంద్ర మంత్రి ఠాకూర్‌ న్యూఢిల్లీ: పెరిగిపోతున్న కార్పొరేట్‌ మోసాలు కార్పొరేట్‌ పరిపాలనా చట్టాలకు సవాళ్లను విసురుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌ అకాడమీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతున్న కార్పొరేట్‌ మోసాలు, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను ఎదుర్కొంటోంది. ఇవి మూలధన ఏర్పాట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దాంతో నిధులు అడుగంటిపోతున్నాయి. కార్పొరేట్‌

Most from this category