News


త్వరలో ‘ఫ్లెయిర్‌’ ఐపీఓ

Wednesday 26th September 2018
Markets_main1537938234.png-20574

న్యూఢిల్లీ: పెన్నులు తయారు చేసే ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ కంపెనీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఇటీవలే సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.330 కోట్లు విలువ గల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాకుండా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో షేర్లు జారీ చేసి రూ.120 కోట్లు సమీకరించనుంది. మొత్తం మీద ఈ ఇష్యూ సైజు రూ.450 కోట్ల రేంజ్‌లో ఉంటుందని అంచనా. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను- రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వాణిజ్య కార్యకలాపాలకు, కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి, మెషినరీ కొనుగోళ్లకు వినియోగించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లు వ్యవహరిస్తాయి. ఈ కంపెనీ ప్లెయిర్‌, హౌసర్‌, పియరీ కార్డిన్‌, రూడి కెల్‌నర్‌, ల్యాండ్‌మార్క్‌​బ్రాండ్ల కింద పెన్నులు తయారు చేస్తోంది. 



You may be interested

ఆగస్టులో మెరుగైన ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: రాబడులు, వ్యయాలకు సంబంధించి కేంద్ర ఫైనాన్షియల్‌ పరిస్థితి ఆగస్టులో మెరుగుపడింది. మంగళవారం విడుదలైన తాజా గణాంకాలను చూస్తే,  ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) ఆగస్టు నాటికి 2018- 19 బడ్జెట్లో అంచనా వేసిన మొత్తంలో 94.7 శాతానికి చేరింది. గతేడాది ఇదే నెలకు అప్పటి (2017-18) బడ్జెట్‌ అంచనాల్లో 96.1 శాతంగా ఉంది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా

స్థిరంగా పసిడి ధర

Wednesday 26th September 2018

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ సమీక్షా సమావేశాల నేపథ్యంలో బుధవారం పసిడి స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు ఔన్స్‌ పసిడి 1 డాలరు స్వల్పంగా లాభపడి 1,206 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న, నేడు (సెప్టెంబర్‌ 25, 26 తేదిల్లో) ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆరు

Most from this category