News


సాంక్టమ్‌ నుంచి ఐదు సిఫార్సులు

Wednesday 5th June 2019
Markets_main1559727500.png-26104

మిడ్‌టర్మ్‌లో 12-15 శాతం రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ సిఫార్సు చేస్తోంది.
1. దీపక్‌ నైట్రేట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 375. స్టాప్‌లాస్‌ రూ. 310. గత సంవత్సరన్నర కాలంగా స్టాకు రూ. 205-305 మధ్య కన్సాలిడేట్‌ అవుతోంది. వీక్లీ చార్టుల్లో డబ్ల్యు ఆకార పాటర్న్‌ ఏర్పరిచింది. గతవారం ఈ ధోరణి నుంచి బ్రేకవుట్‌ ఇచ్చింది. బోలింగర్‌ బ్యాండ్‌ పైఅవధి పైన బ్రేకవుట్‌ సాధించడంతో ర్యాలీ కొనసాగుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఏడీఎక్స్‌ ఇండికేటర్‌ కూడా పాజిటివ్‌గా ఉంది. 
2. హావెల్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 900. స్టాప్‌లాస్‌ రూ. 740. హయ్యర్‌ టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ దీర్ఘకాల అప్‌ట్రెండ్‌లో ఉంది. 12 వారాలుగా ఆల్‌టైమ్‌ హై వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. డైలీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పరుచుకుంది. దీనికితోడు 100 రోజుల డీఎంఏ స్థాయి మంచి మద్దతునిస్తోంది. డైలీ చార్టుల్లో బ్రేకవుట్‌ జరిపినట్లు కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ సూచికలు పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచాయి.
3. వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 280. స్టాప్‌లాస్‌ రూ. 230. సంవత్సర కాలంగా పరిమిత శ్రేణిలో ట్రేడవుతోంది. చార్టుల్లో బుల్లిష్‌ ఇన్వర్టెడ్‌ హెడ్‌అండ్‌షోల్డర్స్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. గతవారం ఈ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా వాల్యూంలు కూడా బలంగా కనిపించాయి. మోమెంటమ్‌ ఇండికేటర్లు బుల్లిష్‌ మూడ్‌లో ఉన్నాయి.
4. యాక్సిస్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 920. స్టాప్‌లాస్‌ రూ. 823. గత అక్టోబర్‌ కనిష్ఠాల నుంచి హయ్యర్‌ టాప్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తోంది. డైలీ చార్టుల్లో బుల్లిష్‌ పోల్‌ అండ్‌ ఫ్లాగ్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. బుల్‌ట్రెండ్‌ కొనసాగింపునకు ఇది సంకేతం. స్టోకాస్టిక్‌, ఎంఏసీడీ ఇండికేటర్లు పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచాయి. 
5. కెన్‌ఫిన్‌ హోమ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 420. స్టాప్‌లాస్‌ రూ. 348. ఆరునెలల కాలంలో రూ. 215-298 మధ్య బేస్‌ ఏర్పరుచుకుంది. తాజా వాల్యూంలు స్టాక్‌పై ఇన్వెస్టర్ల మక్కువను చూపుతున్నాయి. మార్చి బ్రేకవుట్‌ అనంతరం చిన్నపాటి కరెక‌్షన్‌ చూసింది. తిరిగి ప్రస్తుత స్థాయిలను చేరి కన్సాలిడేట్‌ అవుతోంది. ఇండికేటర్లు పాజిటివ్‌ అప్‌మూవ్‌ కొనసాగింపును సూచిస్తున్నాయి. 

 



You may be interested

10వ తేదీ నుంచీ బడ్జెట్‌ తయారీ ప్రక్రియ

Wednesday 5th June 2019

జూలై 5 బడ్జెట్‌ సమర్పణకు మోదీ సర్కారు సన్నద్ధం న్యూఢిల్లీ: కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. సోమవారం నుంచీ బడ్జెట్‌ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. ఆర్థికమంత్రిత్వశాఖ కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్‌ ముద్రణ కార్యకలాపాలు సోమవారంనాడు ప్రారంభకానున్నాయి. నాటి నుంచీ బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో పాల్గొననున్న అధికారులకు జూలై 5వ తేదీ

పెన్నా సిమెంట్‌ ఐపీఓకు సెబీ ఓకే

Wednesday 5th June 2019

ఐపీఓ సైజు రూ.1,550 కోట్లు న్యూఢిల్లీ: పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్‌... ఈ ఐపీఓ ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా రూ.250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)

Most from this category