News


వాహనాలు, బిస్కెట్‌లపై జీఎస్‌టీ తగ్గింపు లేనట్టే?

Wednesday 18th September 2019
Markets_main1568801584.png-28409

జీఎస్‌టీ రేట్లపై జీఎస్‌టీ కౌన్సిల్‌కు సిఫార్సులు చేసే ఫిట్‌మెంట్‌ కమిటీ, ప్రస్తుత పరిస్థితులలో కార్లు, బిస్కెట్‌లపై విధిస్తున్న జీఎస్‌టీ రేట్లలో ఎటువంటి మార్పు ఉండకూడదని జీఎస్‌టీ కౌన్సిల్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగా ఆటోమొబైల్స్‌, వినియోగ ఆధారిత రంగాలపై జీఎస్‌టీ తగ్గుతుందని మార్కెట్‌ వర్గాలు ఆశించాయి. సెప్టెంబర్‌ 20 వ తేదిన జరగనున్న 37 వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ఫిట్‌మెంట్‌ కమిటీ సిఫార్సులపై చర్చ జరుగుతుందనే విషయం తెలిసిందే. 
ఆటోమొబైల్స్‌పై జీఎస్‌టీ రేట్ల తగ్గింపు లేనట్టేనా?
 ఎన్‌బీఎఫ్‌సీల డిఫాల్ట్‌, లిక్విడిటీ సంక్షోభం వలన ఆటోరంగంలో అమ్మకాలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. ఆటో రంగ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆటోమొబైల్స్‌పై విధిస్తున్న 28 శాతం జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించాలని ఆటోరంగ ప్రతినిధులు ప్రభుత్వాన్ని గత కొంత కాలం నుంచి కోరుతున్నారు. 
   ‘రెవెన్యూ సమస్యల దృష్ట్యా ఆటోమొబైల్స్‌పై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ రేట్‌ను ఫిట్‌మెంట్‌ కమిటీ తగ్గించలేదు. ఆటో రంగంలో అమ్మకాలు రెండు దశాబ్దాలలో అధికంగా తగ్గడానికి లిక్విడిటీ కొరత, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోబంతో పాటు ఈ పరిశ్రమ సైక్లికల్‌ గుణం, బీఎస్‌ 4 నుంచి బీఎస్‌ 6 నిబంధనలకు మారుతుండడం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావం చూపాయి’ అని ఈ ప్యానెల్‌... జీఎస్‌టీ కౌన్సిల్‌కిచ్చిన తన 286 పేజీల సిఫార్సులలో పేర్కొంది.  ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన దేశ జీడీపీని తిరిగి పెంచాలంటే జీఎస్‌టీ రేట్లను తగ్గించడం మంచిదని వివిధ పరిశ్రమ వర్గాలు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియపరిచారు. 
బిస్కెట్‌లపై ప్రస్తుత జీఎస్‌టీనే?   
ఆటో రంగంతోపాటు బిస్కెట్‌, బేకరీ ఉత్పత్తులు, బ్రేక్‌ఫాస్ట్‌ సిరల్స్‌, పండ్లు, కూరగాయలు, మినరల్‌ వాటర్‌, తినేందుకు సిద్దంగా ఉన్న ప్యాకేజి వస్తువులు, ఇతర ఆహార ఉత్పత్తులపై కూడా ఈ కమిటీ ప్రస్తుత జీఎస్‌టీ రేట్లను మార్చలేదు. ‘బిస్కెట్స్‌ సంఘటిత రంగంలో తయారవుతున్నాయి. అమ్మకం ధర ఆధారంగా బిస్కెట్‌లపై రెండు వేరువేరు జీఎస్‌టీ స్లాబ్‌లను నిర్ణయించడం వలన ట్యాక్స్‌ ఎగవేత జరిగే అవకాశం ఉంది. అందువలన వీటిపై ఫిట్‌మెంట్‌ కమిటీ ఎటువంటి జీఎస్‌టీ రేటును తగ్గించకూడదు’ అని ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. 
   ‘తక్కువ ధర కలిగిన బిస్కెట్‌లపై ఉన్న ప్రస్తుత 18 శాతం జీఎస్‌టీని ప్రభుత్వం తగ్గిస్తుందని ఆశించాం. గత ట్యాక్స్‌ పద్ధతిలో కేజి రూ. 100 కన్నా తక్కువున్న బిస్కెట్‌లపై 12 శాతం మాత్రమే పన్నును విధించేవారు. జీఎస్‌టీ అమలులోకి వచ్చాక ప్రీమియం బిస్కెట్‌లపై 12 శాతం, తక్కువ ధర కలిగిన బిస్కెట్‌లపై 5 శాతం జీఎస్‌టీని విధిస్తారని అంచనా వేసినప్పటికి అన్ని రకాల బిస్కెట్లను 18 శాతం జీఎస్‌టీ స్లాబ్‌లోకే తీసుకొచ్చారు. ఇది అమ్మకాలపై ప్రభావం చూపింది’ అని పార్లే ఎక్సిక్యూటివ్‌ మయాంక్‌ షా అన్నారు. 
రేట్లు తగ్గిస్తే ద్రవ్యలోటు పరిస్థితేంటి? 
  ఏ రంగంపైనైనా ప్రస్తుతం విధిస్తున్న జీఎస్‌టీని తగ్గిస్తే, ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యమైనా 3.3 శాతాన్ని చేరుకోవడం కష్టమవుతుందని విశ్లేషకులు తెలిపారు. ‘అంతేకాకుండా ఈ ఏడాది నిర్దేశించుకున్న వార్షిక ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే 77 శాతం చేరుకుంది. ఇటువంటి పరిస్థితులలో జీఎస్‌టీ తగ్గింపు వలన రెవెన్యూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది’ అని వివరించారు. ‘ఎటువంటి జీఎస్‌టీ రేట్ల తగ్గింపునైనా జీఎస్‌టీ కౌన్సిల్‌ చేపట్టేముందు, జీఎస్‌టీ సేకరణను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి జీఎస్‌టీ సేకరణ లక్ష్యం కంటే తక్కువగా ఉండడం గమనార్హం. పరిహార సెస్స్‌ సెకరణ తగ్గడంతో ఈ సెస్స్‌ తగ్గింపు కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది’ అని డెలాయిట్‌ ఇండియా, ఎంఎస్‌ మణి అన్నారు. 
 కాగా ఆటోమొబైల్స్‌ పై ముఖ్యంగా చిన్నకార్లపై విధిస్తున్న పరిహార సెస్స్‌ను, జీఎస్‌టీ కౌన్సిల్‌ 10 శాతం మేర తగ్గిస్తుందని మార్కెట్‌లో వార్తలు వెలువడుతున్నాయి. You may be interested

రెండురోజుల పతనానికి బ్రేక్‌

Wednesday 18th September 2019

ముడిచమురు ధరల పెరుగుదలతో రెండు రోజుల పాటు భారీ పతనాన్ని చవిచూసిన సూచీలు బుధవారం స్వల్పలాభంతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ 83 పాయింట్లు పెరిగి 36,564 వద్ద, నిఫ్టీ 23.05 పాయింట్ల పెరుగుదలతో 10,840.65 వద్ద స్థిరపడింది. తిరుగుబాటుదారుల డ్రోన్‌ దాడి నేపథ్యంలో తగ్గిన చమురు ఉత్పత్తిని నెలాఖరులో పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, యూరప్‌ మార్కెట్ల

వెలుగులోకి పెట్రోమార్కెటింగ్‌ షేర్లు

Wednesday 18th September 2019

పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు గురువారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు చల్లారడం ఇందుకు కారణమవుతోంది.   తిరుగుబాటుదారుల డ్రోన్‌ దాడితో తగ్గిన చమురు ఉత్పత్తిని నెలాఖరులో పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడం అంతర్జాతీయంగా చమురు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ఈ రంగలో ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీల్‌, ఐఓసీ షేర్లు 5.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. బీపీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.379.70ల వద్ద

Most from this category