News


టాటా మోటర్స్‌ 3 శాతం పతనం..

Wednesday 24th July 2019
Markets_main1563958524.png-27282

టాటా మోటర్స్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ బీబీ నుంచి బీబీ మైనస్‌కు తగ్గించడంతో బుధవారం మధ్యహ్నాం 2.17 సమయానికి ఈ షేరు విలువ 2.85 శాతం నష్టపోయి రూ. 151.75 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49.55 పాయింట్లు కోల్పోయి 11,281.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టాటా మోటర్స్‌ లాభదాయకత, ద్రవ్యలభ్యత ఆందోళన కారణంగా రేటింగ్‌ను తగ్గించామని ఫిచ్‌ వివరించింది. జెఎల్‌ఆర్‌(జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌) తో కలిపి టాటా మోటర్స్‌ విదేశి అమ్మకాలు జూన్‌ నెలలో 5 శాతం తగ్గి 95,503 యూనిట్లగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలానికి ఈ కంపెనీ 1,00,135 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం గమనర్హం. టాటా మోటర్స్‌ మొత్తం వాణిజ్య వాహనాలతో పాటు టాటా డేవూ వాహనాల అంతర్జాతీయ అమ్మకాలు ఈ ఏడాది జూన్‌ నెలలో 12 శాతం పడిపోయి 38,846 యూనిట్లగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలానికి ఈ అమ్మకాలు 44,229 యూనిట్లుగా ఉన్నాయి.  
 



You may be interested

నష్టాల బాటలో అటో షేర్లు

Wednesday 24th July 2019

ఐదో రోజూ కొనసాగుతున్న మార్కెట్‌ పతనంలో భాగంగా ఆటో షేర్లు బుధవారం నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేడు 2శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌ 7,162.85 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటో షేర్లలో అమ్మకాలు విరివిరిగా జరగడంతో ఇండెక్స్‌ ఒకదశలో దాదాపు 2శాతం క్షీణించి 7,039.65 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఇండెక్స్‌లోని అధిక వెయిటేజీ

అన్ని కంపెనీలకు 25%కార్పొరేట్‌ టాక్స్‌ వర్తింపు!

Wednesday 24th July 2019

సంకేతాలిచ్చిన ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రకటించిన 25 శాతం కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపును అన్ని కంపెనీలకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలిచ్చారు. ఈ నెల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పలు కంపెనీలకు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు వరాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి కొన్ని బడా కంపెనీలను మాత్రం మినహాయించారు. కంపెనీల్లో దాదాపు 99.3 శాతాన్ని 25 శాతం రేటు పరిధిలోకి తెచ్చామని ఆమె రాజ్యసభలో

Most from this category