News


జైన్‌ ఇరిగేషన్‌కు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన ఫిచ్‌

Saturday 22nd June 2019
Markets_main1561193576.png-26499

ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌... ఇరిగేషన్‌ రంగంలో సేవలను అందించే జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో తాము కంపెనీకి కేటాయించిన బి(+) రేటింగ్‌ను బి(-)కు రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు రేటింగ్ తెలిపింది. అలాగే కొత్తగా కంపెనీని ‘రేటింగ్ వాచ్ నెగిటివ్’ (ఆర్‌డబ్ల్యూఎన్)లో చేర్చినట్లు ఫిచ్‌ తెలిపింది. నిర్వహణ ప్రదర్శన అంచనాల కంటే తక్కువగా ఉండటంతో కంపెనీ పరిపతి, లిక్విటిడీ క్షీణించాయి. వర్కింగ్‌ క్యాపిటల్‌ పోజిషన్లు విస్తరించడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధికి యాజమాన్యం తీసుకున్న దూకుడు నిర్ణయాలు కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసేందుకు ప్రాథమిక కారణాలుగా ఫిచ్‌ రేటింగ్‌ చెప్పుకొచ్చింది. జైన్‌ ఇరిగేషన్‌ రోజురోజూకు పెరుగుతున్న రుణభారాన్ని తగ్గించుకుంటుదని రేటింగ్‌ ఏజన్సీ ఆశించింది. బలహీన డిమాండ్‌ పరిస్థితుల్లో కూడా వృద్ధి పెంచుకునేందుకు కంపెనీ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా కంపెనీలో తీవ్రమైన ద్రవ్యకొరత ఏర్పడి కంపెనీకి రుణాలు మరింత పెరిగాయి. నైబుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో ఈసారి దేశవ్యాప్తంగా వర్షపాతం తక్కువగా నమోదుకావచ్చు. దీంతో కంపెనీ వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని రేటింగ్‌ సంస్థ తెలిపింది. బ్యాంకుల నుంచి రుణాన్ని సమీకరించడం, వర్కింగ్‌ క్యాపిటల్‌ తగ్గించడం లాంటి చర్యల ద్వారా రుణభారాన్ని తగ్గించుకోవడంతో పాటు, కంపెనీలో నెలకొన్న ద్రవ్య సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చని ఫిచ్‌ తెలిపింది. అప్పుడు కంపెనీ తాము కేటాయించిన రేటింగ్ వాచ్ నెగిటివ్ రేటింగ్‌ను తొలగించే అవకాశం ఉందని ఫిచ్‌ తెలిపింది.
శుక్రవారం బీఎస్‌ఈ ఎక్చ్సేంజీలో జైన్‌ ఇరిగేష్‌ 3.33శాతం లాభంతో రూ.24.85ల వద్ద స్థిరపడింది.



You may be interested

ఈ వారం బాగా నష్టపోయిన, లాభపడిన షేర్లు!

Saturday 22nd June 2019

హెక్స్‌ వేర్‌ టెక్నాలజీస్‌: లాభం 21 శాతం  ఈ వారం(జూన్‌17-జూన్‌21) ట్రేడింగ్‌లో హెక్స్‌వేర్‌ టెక్నాలజీస్‌ 21 శాతం లాభపడింది. జూన్‌ 14న అమెరికా కంపెనీ మొబిక్విటీని 18.2 కోట్లు డాలర్లకు హెక్స్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హెక్స్‌వేర్‌ టెక్నాలజీ రేటింగ్‌ను ‘రెడ్యూస్‌’ నుంచి ‘న్యూట్రల్‌’కు  జపాన్‌ బ్రోకరేజి సంస్థ నోముర పెంచడంతో ఈ షేరు లాభపడింది. ‘డిజిటల్‌ కంపెనీలు, కన్సల్టింగ్‌ సంస్థలతో పోటి పడేందుకు మొబిక్విటీని సుమారుగా 18.2

ఇండియా మార్ట్‌ రూ.213 కోట్ల సమీకరణ

Saturday 22nd June 2019

వచ్చేవారంలో ఐపీఓకు రానున్న ఇండియామార్ట్‌ కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.213 కోట్లను సమీకరించింది. ఈ మేరకు కంపెనీ స్టాక్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. సోమవారం(జూన్‌ 24న) ప్రారంభం ప్రారంభం కానున్న ఇష్యూలో భాగంగా 15మంది యాంకర్‌ ఇన్వెస్టర్లకు ప్రతి ఈక్విటీ షేరు ధర రూ.973 చొప్పున 22లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూలో ఐసీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌

Most from this category