News


100 రోజుల పాలనలో రూ.14లక్షల కోట్ల సంపద ఆవిరి..!

Monday 9th September 2019
Markets_main1568023610.png-28271

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100రోజుల్లో ఆయా రంగాల పనితీరు ఎలా ఉన్నప్పటికీ.., దలాల్‌ స్ట్రీట్‌ మాత్రం విలవిలాడింది. ఎన్‌డీఏ సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపట్టిన నాటి ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ 100 రోజుల్లో 14 లక్షల కోట్ల సంపదను తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్‌లో జరుగుతున్న అమ్మకాల పరంపరను ఆపడానికి  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆగస్ట్‌లో రెండు ప్రకటనలు చేశారు. అయితే ఆ ప్రకటనలు అమ్మకాలను ఆపలేకపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం చక్రీయమని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకులు తెలిపారు. ప్రపంచమార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలకు ఎదురోడ్డి, వ్యవస్థలో తిరోగమనం ప్రారంభమయ్యే వరకు పెట్టుబడిదారులు ఓపికగా ఉండాలని వారు సూచించారు. మే 30న మోదీ రెండోసారి ప్రధానిగా భాద్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు బీఎస్‌ఈలో 14శాతం స్టాకులు మాత్రమే పాజిటివ్‌ ఆదాయాలనిచ్చాయి. బీఎస్‌ఈలో చురుకుగా ట్రేడైన 2,664 స్టాక్లలో 2,290 స్టాకులు 96శాతం విలువను కోల్పోయాయి. వాటిలో 422 స్టాకుల్లో 40శాతం, 1,371 స్టాకులు 20శాతానికి పైగానూ, 1,872 స్టాకులు 10శాతానికి పైగా క్షీణించాయి. ‘‘మోదీ ప్రభుత్వం సామాజిక, రాజకీయ రంగాల్లో మంచి ప్రదర్శన కనబరించింది. అయితే ఆర్థిక రంగంలో మాత్రం అనుకున్నంత రాణించలేదు. కానీ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు హర్షించదగినవి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ఆప్‌ రీసెర్చ్‌ దీపక్‌ జైసానీ అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల ఆదాయం అదనపు పన్ను ప్రకటన మార్కెట్‌కు మింగుడుపడకపోవడంతో ఆర్థిక వృద్ధి ఇటీవల దాన్ని ఎత్తివేసారు. అయితే ఆ ప్రకటను చేయాల్సిన నష్టాన్ని చేసేసింది. ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మందగమనం, రూపాయి బలహీనపడటం తదితర కారణాలతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.31,700 కోట్లను ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో ఫిబ్రవరి-మార్చిల్లో ఎఫ్‌ఐపీలు మన ఈక్విటీ మార్కెట్లోకి రూ.83,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన భయాలు నెలకొనడంతో ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన చర్యలు మన మార్కెట్లపై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. 

100 రోజుల పాలనలో పెరిగిన టాప్‌-10 షేర్లు ఇవే(బీఎస్‌ఈ 500)

100 రోజుల పాలనలో నష్టపోయిన టాప్‌-10 షేర్లు ఇవే(బీఎస్‌ఈ 500)

 

 You may be interested

11000పైన స్థిరంగా ఉంటేనే ర్యాలీ!

Monday 9th September 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా నిఫ్టీ గతవారం నెగిటివ్‌ ట్రెండ్‌ నుంచి క్రమంగా బయటపడుతోంది. ఈవారాన్ని నిఫ్టీ పాజిటివ్‌గా ఆరంభించింది. వీక్లీచార్టుల్లో నిఫ్టీ లాంగ్‌లోయర్‌ షాడో ఉన్న బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ఇది దిగువ స్థాయిల్లో కొనుగోళ్లను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11వేల పాయింట్ల పైన బలంగా క్లోజయితే అప్‌మూవ్‌ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే నిఫ్టీ క్రమంగా 11200 పాయింట్ల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిఫ్టీ

ఇలాంటి కంపెనీల షేర్లతో జాగ్రత్త!

Monday 9th September 2019

మార్కెట్లు నెగిటివ్‌ జోన్‌లో ప్రయాణిస్తున్నప్పుడే ఇన్వెస్టర్లకు ఎక్కువ పెట్టుబడి అవకాశాలు కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి సమయంలో తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మార్కెట్‌ రికవరీ చెందినా, పెట్టుబడి మాత్రం పెరగకపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చాలా మంది ట్రేడర్లు, ఇన్వెస్టర్ల ఆలోచన ఈ సమయంలో ఇలా ఉంటుంది.. ‘షేరు ధర చాలా పడిపోయింది. అయినా ఇంకెంత పడతుంది? ఇంతకు మించి ఇక పడదు.’ కానీ కొన్ని స్టాకుల విషయంలో

Most from this category