News


ఫైన్‌ ఆర్గానిక్‌ ఫైన్‌- బ్లూడార్ట్‌, లుపిన్‌ డౌన్‌

Monday 20th January 2020
Markets_main1579500392.png-31044

ఫైన్‌ ఆర్గానిక్స్‌కు ఇక్రా అప్‌గ్రేడ్‌ బూస్ట్‌
బ్లూడార్ట్‌కు క్యూ3 ఫలితాల సెగ
లుపిన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ చెక్‌

బ్లూచిప్‌ కంపెనీల అండతో తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో ’పడ్డాయి. ఉదయం 11.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 191 పాయింట్లు క్షీణించి 41,754ను తాకగా.. నిఫ్టీ 62 పాయింట్లు తిరోగమించి 12,290 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్‌ గరిష్టంగా 42,734కు చేరగా.. నిఫ్టీ 12,430వరకూ ఎగసింది. కాగా.. విభిన్న వార్తల నేపథ్యంలో ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నష్టాల మార్కెట్లోనూ లాభపడగా.. బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, లుపిన్‌ లిమిటెడ్‌ కౌంటర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. 

ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను తాజాగా AA- స్థిరత్వం నుంచి A+ సానుకూలానికి ఎగువముఖంగా సవరించినట్లు ఇక్రా(ICRA) పేర్కొంది. అంతేకాకుండా స్వల్ప కాలిక రేటింగ్‌ను గతంలో ప్రకటించిన A+గా కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 2,221 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,225 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. 

లుపిన్‌ లిమిటెడ్‌
విశాఖపట్టణంలోగల ఏపీఐ తయారీ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ ఐదు లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్‌) దేశీ ఫార్మా రంగ దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఈ నె 13-17 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు చేపట్టినట్లు తెలియజేసింది. త్వరలోనే వీటిని సరిదిద్దేందుకు తగిన పరిష్కారాలను అమలు చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో లుపిన్‌ షేరు 3.5 శాతం క్షీణించి రూ. 740 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 737 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. 

బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో కొరియర్‌ దిగ్గజం బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 32 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 32 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన సర్దుబాటు చేసిన నికర లాభం సైతం 14 శాతం తగ్గి రూ. 27.5 కోట్లకు పరిమితమైంది. ఇక ఆదాయం దాదాపు యథాతథంగా రూ,. 858 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ షేరు 3 శాతం క్షీణించి రూ. 2590 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2469 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. 



You may be interested

రికార్డుస్థాయి నుంచి నిఫ్టీ 12,300 దిగువకు!

Monday 20th January 2020

గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ 42వేల మార్కును కోల్పోయిన సెన్సెక్స్‌  మార్కెట్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 42వేల దిగువకు, నిఫ్టీ 12300 కిందకు చేరుకున్నాయి. సూచీల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ, చోటు చేసుకోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరుగుదల భయాలు సూచీల నష్టాలకు కారణమయ్యాయి. మార్కెట్‌ ప్రారంభంలో సూచీలు గరిష్టస్థాయిలకు అందుకునేందుకు దోహదపడిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లలో అనూహ్య అమ్మకాలతో

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 20th January 2020

 వివిధ వార్తలకు అనుగుణంగా స్టాక్‌ మార్కెట్‌లో  సోమవారం ప్రభావితమయ్యే షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థిక సంవత్సరం-20 మూడో త్రైమాసికంలో అత్యధికంగా నికర లాభం రూ.11,640 కోట్లుగా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,251 కోట్ల కంటే ఈ సంవత్సరం నికర లాభం 13.5 శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: ఈ బ్యాంక్‌ లాభం 33 శాతం పెరిగినప్పటికీ రుణ నాణ్యత బలహీన పడడంతో నిబంధనలు పెరిగాయి. ఈ

Most from this category