STOCKS

News


ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ పరిస్థితిని వాడుకోండి: సెంట్రమ్‌

Thursday 25th July 2019
Markets_main1564047562.png-27314

  • మంచి స్టాకులను ఎంచుకోని ఇన్వెస్ట్‌ చేయండి.
  • వచ్చే రెండు త్రైమాసికాల వరకు ఆర్థిక మందగమనం ఉండవచ్చు.
  • సిమెంట్‌ రంగంలో అల్ట్రాటెక్‌, శ్రీ సిమెంట్‌ను పరిశీలించవచ్చు.
  • టెలికాం రంగానికి దూరంగా ఉండండి: దేవాంగ్‌ మెహతా

వచ్చే రెండు త్రైమాసికాలలో మంచి స్టాకులను ఎంచుకోని వాటిలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఈ పరిస్థితిని వాడుకోండి సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈక్విటీ అడ్వజరీ హెడ్‌ దేవాంగ్‌ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
బాధ ఇంకా కొనసాగుతుంది..
ఇంకో రెండు మూడు త్రైమాసికాల వరకు ప్రస్తుత మందగమనం కొనసాగవచ్చు. ప్రజలు ఊహిస్తున్నట్టుగా కార్పోరేట్‌ ఆదాయాలు మరీ పడిపోలేదు. జూన్‌ త్రైమాసికం, అంచనావేసిన దానికంటే తక్కువో ఎక్కువో నిరాశపరిచింది. ఈ ఆదాయాలు మార్కెట్లను నిరాశపరచలేదు. కానీ వీటిపై చేస్తున్న వ్యాఖ్యానాలు మాత్రం ఖచ్చితంగా మార్కెట్లను నిరాశపరుస్తున్నాయి. గత ఎడెనిమిది నెలల నుంచి వ్యవస్థలో రుణ పంపిణీ మందగించడంతో ఎస్‌ఎంఈ(చిన్న మధ్యతరహ ఎంటర్‌ప్రైజెస్‌) రంగం కుదేలయ్యింది. బ్యాంకింగ్‌ సెక్టార్‌లో హెచ్‌డీఎఫ్‌సీ వంటి లార్జ్‌క్యాప్‌ల నుంచి ఆర్‌బీఎల్‌ వంటి మిడ్‌ క్యాప్‌ బ్యాంకుల వరకు అన్ని కూడా డిమాండ్‌ మందగమనంపై ఆందోళనగా ఉన్నాయి.

   వినియోగాధారిత రంగంలో డాబర్‌ వృద్ధి బాగుంది. ప్రస్తుత పరిస్థితులలో 9.7 శాతం వాల్యుమ్‌ వృద్ధి సాధించడమే దీనికి నిదర్శనం. కానీ ఈ కంపెనీ మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యానాలను వింటే వచ్చే రెండు మూడు త్రైమాసికాలపై ఎటువంటి ఆశా దృక్పథం కనిపించదు. నిజమే వ్యవస్థ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుంది. వచ్చే రెండు త్రైమాసికాలలో మంచి వ్యాపారం చేయగలిగే స్టాకులను ఎంచుకోవడానికి ఇదే సరియైన సమయం.
 

ప్రస్తుత పరిస్థితులలో ‘సిమెంట్‌’ మంచిది.. 
సిమెంట్‌ పరిశ్రమలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లేదా శ్రీ సిమెంట్‌ వంటి కంపెనీలపై గత ఆరు నెలల నుంచి సానుకూలంగా ఉన్నాం. 
బడ్జెట్‌లో మౌలిక రంగం, గృహనిర్మాణానికి ప్రేరణనిచ్చే ప్రతిపాదనలను చూశాం. అందరికి గృహాలు లేదా తక్కువ ఖర్చుతో కూడిన గృహాల పథకాల వలన  సిమెంట్‌ పరిశ్రమ వృద్ధి చెందగలదు. గత రెండు త్రైమాసికాల నుంచి సిమెంట్ డిమాండ్, సిమెంట్ రియలైజేషన్స్, వినియోగ సామర్థ్యం పెరగడం గమనిస్తున్నాం. అందువలన సిమెంట్‌ పరిశ్రమకు పోర్టుపోలియోలో చోటు ఇవ్వడం సబబే. 

 

టెలికాం సెక్టార్‌తో జాగ్రత్త..
టెలికాం సెక్టార్‌పై చాలా జాగ్రత్తగా ఉన్నాం. వాస్తవానికి గత రెండు మూడేళ్ల నుంచి ఈ రంగంలో పెట్టుబడులు పెట్టలేదు. టెలికాం కంపెనీల రుణ భారం తగ్గుముఖం పడుతున్నప్పటికి, ఓ మూడు సంస్థలు ఈ రంగాన్ని పాలిస్తున్నప్పటికి టెలికాం సెక్టార్‌ ఇప్పటికీ రద్దీగా ఉండే వాణిజ్య రంగమే. చాలా మంది ప్రజలు దీనిని కాంట్రా ట్రేడ్‌గా కొనుగోలు చేస్తారు. అయినప్పటికి ఈ రంగలో ఇన్వెస్ట్‌ చేయడానికి విముఖతగా ఉన్నాం. ఈ రంగాన్ని విడిచిపెట్టడం మంచిది. విస్తృత మార్కెట్లలో టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. గత 8-10 రోజుల నుంచి ఉత్తమ స్టాక్స్ పడిపోవడం ప్రారంభించాయి. ఈ సమయంలో టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.You may be interested

కొన్నిషేర్ల క్షీణత శాశ్వతం!

Thursday 25th July 2019

వాల్యూ బయింగ్‌ మోజులో తప్పు చెయ్యొద్దు పెట్టుబడులకు ముందు ఫండమెంటల్స్‌ చూడాలి సీనియర్‌ అనలిస్టు సంజయ్‌ బక్షి మార్కెట్లో షేర్లు భారీగా పతనమయ్యాక వాల్యూ ఇన్వెస్టర్లు కాంట్రా పెట్టుబడులకు ముందుకు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి వాల్యూ ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని సీనియర్‌ అనలిస్టు సంజయ్‌ బక్షి హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారీగా పతనమైన పలు స్టాకుల్లో ఎక్కువ శాతం షేర్ల ధరలు కోలుకోకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా షేర్లలో ఈ దఫా వచ్చిన

5నెలల కనిష్టానికి టాటామోటర్స్‌

Thursday 25th July 2019

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజ సంస్థ టాటామోటర్స్‌ షేర్లు గురువారం 5నెలల కనిష్టానికి పతనమయ్యాయి. నేడు కంపెనీ ప్రకటించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలిత్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చనే అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. నేడు బీఎస్‌లో ఈ కంపెనీ షేర్లు రూ.151.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్యూ1లో కంపెనీ రూ.1,938 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేయవచ్చని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు ఇదే క్వార్టర్‌లో

Most from this category