News


డిసెంబర్‌లో బ్యాంకు షేర్లదే హవా?!

Friday 29th November 2019
Markets_main1575001092.png-29944

డెరివేటివ్స్‌ గణాంకాల సూచన
డిసెంబర్‌ సీరిస్‌లోకి నిఫ్టీ షేర్ల రోలోవర్‌ గత మూడు నెలల సరాసరి కన్నా ఎక్కువే ఉంది కానీ అక్టోబర్‌ రోలోవర్లతో పోలిస్తే తగ్గింది. ఇదే సమయంలో బ్యాంకు నిఫ్టీ రోలోవర్లు మూడు నెలల సరాసరికన్నా ఎక్కువగా ఉండడంతో పాటు అక్టోబర్‌ రోలోవర్ల కన్నా అధికంగా నమోదయ్యాయి. దీంతో ప్రధాన సూచీ కన్నా డిసెంబర్‌లో బ్యాంకు సూచీ ఎక్కువ దూసుకుపోయే ఛాన్సుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీలో రోలోవర్లు 79.64 శాతమని, ఇది మూడు నెలల సరాసరి 75.31 శాతం కన్నా ఎక్కువని, అక్టోబర్‌ రోలోవర్‌ 84.09 శాతం కన్నా తక్కువని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. ప్రధాన సూచీల్లో ర్యాలీ కొనసాగవచ్చని కానీ కొంత స్పీడు తగ్గవచ్చని అంచనా వేసింది. బ్యాంకు నిఫ్టీలో రోలోవర్లు 70.56 శాతం కాగా మూడు నెలల రోలోవర‍్ల సరాసరి 62.54 శాతమని, అక్టోబర్‌ రోలోవర్లు 62.54 శాతమని తెలిపింది. బ్యాంకు నిఫ్టీలో మెరుగైన రోలోవర్లు నమోదయినందున డిసెంబర్‌ సీరిస్‌లో ఫైనాన్షియల్‌ స్టాకుల హవా ఉండొచ్చని బ్రోకింగ్‌ సంస్థ అనలిస్టు చందన్‌ తపారియా చెప్పారు. స్టాకుల పరంగా చూస్తే ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, అల్ట్రాటెక్‌ల్లో ఎక్కువ రోలోవర్లు నమోదయ్యాయి. అందువల్ల డిసెంబర్‌ సీరిస్‌లో వీటి ప్రదర్శన కొనసాగవచ్చని తపారియా చెప్పారు. నిఫ్టీ ఆప్షన్‌ డేటా చూస్తే డిసెంబర్‌ సీరిస్‌లో 12000- 12500 మధ్య కదలికలుండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ పుట్స్‌ 12000 వద్ద, ఎక్కువ కాల్స్‌ 12500 వద్ద ఉన్నాయన్నారు. బ్యాంకు నిఫ్టీ ఆప్షన్‌​డేటా చూస్తే 32000-32500 పాయింట్ల మధ్య కదలాడవచ్చన్నారు.

బ్యాంకు నిఫ్టీ గత ఏడు వారాలుగా హయ్యర్‌హై, హయ్యర్‌ లో ఏర్పరుస్తూ వస్తోంది. ఈ సూచీ 31783 పాయింట్ల పైన కదలాడినంత కాలం పాజిటివ్‌గానే ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ ఇటీవలే బ్రేకవుట్‌ సాధించింది. 12000 పాయింట్ల పైన నిఫ్టీ ఉన్నంత కాలం 12250- 12500 పాయింట్లకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 


F&O

You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 29th November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు లాభంతో 1,463.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. హాంగ్‌కాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి మద్దతునిచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తాజాగా సంతకం చేశారు. దీనికి ప్రతిగా చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో నేడు

వాణిజ్య చర్చలే రూపీని నడిపిస్తాయి!

Friday 29th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో 71.61 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. చమురు దిగుమతి దారుల నుంచి నెల చివరిలో డాలర్‌ డిమాండ్‌ పెరగడంతో పాటు, శుక్రవారం దేశ జీడీపీ డేటా వెలువడనుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 25 పైసలు బలహీనపడి 71.60 వద్ద ముగిసింది. యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలపై సమీపకాలంలో రూపీ-డాలర్‌ కదలిక ఆధారపడి ఉందని విశ్లేషకులు తెలిపారు. హాంగ్‌కాంగ్‌ సమస్యలో అమెరికా

Most from this category