News


ఇన్‌ఫ్రా రంగానికి ప్రత్యేక ఫండ్‌

Tuesday 20th August 2019
Markets_main1566278303.png-27885

  • పరిశీలిస్తున్న కేంద్రం 

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్‌, విద్యుత్‌ సహా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న మౌలిక సదుపాయాల రంగంలోని వివిధ విభాగాల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర గృహ, పట్టణాల వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వెల్లడించారు. ఇన్‌ఫ్రా రంగానికి తోడ్పాటునిచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రతింపులు జరిపినట్లు ఆయన వివరించారు. వీరిలో పరిశ్రమవర్గాలు, బ్యాంకులు, గృహాల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు ఉన్నట్లు మిశ్రా తెలిపారు. జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి (నారెడ్‌కో) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నిల్చిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తోడ్పాటునిచ్చేలా స్ట్రెస్‌ ఫండ్ ఏర్పాటు చేయాలని నారెడ్‌కో, రియల్ ఎస్టేట్ సంస్థల సమాఖ్య క్రెడాయ్ మొదలైనవి కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆగస్టు 11న ఆర్థిక మంత్రితో భేటీ అయిన గృహ కొనుగోలుదారుల ఫోరం కూడా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం రూ. 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయాలని, గృహ కొనుగోలుదారులకు ఊరటనివ్వాలని విజ్ఞప్తి చేసింది. అటు ఎకానమీ మందగమనంలోకి జారుకుంటున్న సంకేతాల నేపథ్యంలో పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చేలా రూ. 1 లక్ష కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని దేశీ కార్పొరేట్లు డిమాండ్ చేస్తున్నారు. 



You may be interested

జూలైలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు డౌన్‌

Tuesday 20th August 2019

11 శాతం తగ్గిన రిటైల్‌ అమ్మకాలు న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ అమ్మకాలు జూలైలో గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) సోమవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో గతనెల పీవీ విక్రయాలు 2,43,183 యూనిట్లుగా నిలిచాయి. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో అమ్ముడైన 2,74,772 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల నమోదైంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 13,32,384 యూనిట్లు కాగా, 2018 ఏడాది

కార్పొరేట్‌ ట్యాక్స్‌ దశలవారీగా తగ్గింపు

Tuesday 20th August 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభయం  న్యూఢిల్లీ: కార్పొరేట్‌ ట్యాక్స్‌ను దశలవారీగా తగ్గిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభయం ఇచ్చారు. రూ.400 కోట్ల టర్నోవర్‌ వరకూ ఉన్న కంపెనీలపై కార్పొరేట్‌ ట్యాక్స్‌ను దశలవారీగా 25 శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించేవాళ్లకు తగిన తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించేవారికి తగిన తోడ్పాటు నందిస్తామన్న ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి ప్రతిధ్వనిగా ఆమె మరోమారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ జరిగిన

Most from this category