News


ఉద్దీపనల కోసం పీఎంఓతో ఆర్థిక శాఖ మంతనాలు?

Friday 23rd August 2019
Markets_main1566554119.png-27975

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీతో సిద్ధమవుతోందని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌, ఆటో, రియల్‌ ఎస్టేట్‌, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎస్‌ఎంఈ) వంటి నాలుగు కీలకమైన సెక్టార్‌లలో పాలసీలను తీసుకురావలని పీఎంఓతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త వెలువడిన తర్వాత పతనంలో ఉన్న మార్కెట్లు తిరిగి కోలుకోవడం గమనార్హం. మధ్యాహ్నాం 2.32 సమయానికి నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి 10,851.65 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 296.71 పాయింట్లు లాభపడి 36,765.03 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. రంగాలవారిగా నిర్ధిష్ట ప్రతిపాదనలను ప్రకటించనున్నారని తెలిసినప్పటికి ఆ అంశాలేంటో ఇంకా తెలియలేదు. 
 

ఆర్థిక మంత్రితో మంతనాలు..
ఆర్థిక మంత్రి పీఎంఓకి ఇచ్చిన ప్రెజెంటేషన్‌ ఆధారంగా డిమాండ్‌ను తిరిగి పెంచడానికి ఆటో పరిశ్రమ వర్గాలు కార్లపై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించమని లాబీయింగ్‌ చేస్తున్నారని పరిశీలకులు తెలిపారు. అంతేకాకుండ, క్యాపిటల్‌ మార్కెట్‌ల కోసం ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు)లపై విధించిన అదనపు సర్‌చార్జీనీ ఆర్థిక మంత్రి ఉపసంహరించుకోనున్నారని, ఇది ప్లాన్‌ చేసిన చర్య కాదని వివరించారు. అయినప్పటికి ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోది విదేశి పర్యటనలలో ఉండడంతో అగష్టు 26 వరకు ఈ పాలసీలను తీసుకొచ్చే చర్యపై ఎటువంటి నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు. అంతేకాకుండా ఆర్థిక మంత్రి ఎస్‌ఎంఈ వర్గాలతో జరిపే రోడ్‌షో సమావేశాలు సెప్టెంబర్‌ మొదటి వారం వరకు జరగనుండడంతో ఆ తర్వాత గాని ఈ పాలసీలపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
   ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యన్‌ ప్రధాన ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశాన్ని తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ‘లాభాలు ప్రైవేట్‌, నష్టాలు పబ్లిక్‌’ వంటి విధానం​ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన అనడం గమనార్హం. అంతేకాకుండా పరిశ్రమలకు సూర్యోదయ, సూర్యస్తమయ దశలు సర్వసాధారణమని, సూర్యస్తమయ సమయమప్పుడు ప్రభుత్వం మద్ధతిస్తుందని ఆశించిడం నైతికంగా మంచిదికాదని ఆయన వ్యాఖ్యనించారు. మరోవైపు మాజీ ఆర్థిక కార్యదర్శి, ప్రస్తుతం విద్యుత్‌ కార్యదర్శి సుభాస్‌ చంద్ర గార్గ్‌ వడ్డీరేట్ల కోత ఉంటే సరిపోతుందని వ్యాఖ్యనించడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ప్రైవేట్‌ సెక్టార్‌కి రుణ లభ్యతను పెంచడం ఉద్దీపన ప్యాకేజి కంటే మంచిదని, త్వరగా రేట్‌ కట్‌ బదిలి జరగాలని ఆయన అన్నారు. 

 

సెబీ ఉపశమనం...
మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ బుధవారం ఎఫ్‌పీఐలకు కొంత ఉపశమనం కలిపించడానికి అవసరమైన నిబంధనలను కొంత సరళతరం చేసింది. కేవైసీ(నో యువర్‌ క్లైయింట్‌) అవసరాలను సులభతరం చేయడంతో పాటు, ఎఫ్‌పీఐల విభాగాలను తగ్గించింది. ప్రస్తుతం ఎఫ్‌పీఐలను మూడు విభాగాలుగా కాకుండా రెండు విభాగాలుగా పరిగణించనున్నారు. అంతేకాకుండా ఇష్యున్స్‌, ఓడీఐ(ఆఫ్‌షోర్‌ డెరివేటివ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌)ల సబ్‌స్క్రీప్సన్‌లను హేతుబద్దీకరించింది. నమోదుకాని, సస్పెండ్‌యిన దేశియ లేదా విదేశి ఇన్వెస్టర్లు ఆఫ్‌ మార్కెట్‌లో సెక్యురిటీలను బదిలీ చేసుకోడానికి ఎఫ్‌పీఐలకు అనుమతినిచ్చింది. కాగా ట్రస్టులగా, అసోసియేట్‌ ఆఫ్‌ పర్సన్స్‌గా(ఏఓపీ) నమోదు చేసుకున్న ఎఫ్‌పీఐలపై అదనపు సర్‌చార్జీని విధించాలని జులై 5న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ జులై 5 న రూ.151 లక్షల కోట్లుగా ఉండగా, అగష్టు 22 నాటికి అది రూ. 137 లక్షల కోట్లకు పడిపోయింది. You may be interested

10800 పైన ముగిసిన నిఫ్టీ

Friday 23rd August 2019

228 పాయింట్ల పెరిగిన సెన్సెక్స్‌  మూడు రోజుల నష్టాలకు ముగింపు  రాణించిన మెటల్‌, ఐటీ, ఫార్మా షేర్లు మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు శుక్రవారం తెరపడింది. సెన్సెక్స్‌ 228 పాయింట్ల లాభంతో 36701 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 88 పాయింట్లు పెరిగి 10829.35 వద్ద స్థిరపడింది. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లు, ఎఫ్‌ఎంజీసీ తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ లాభపడ్డాయి. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌

రూపాయి పతనంతో ర్యాలీ చేసే షేర్లివే..!

Friday 23rd August 2019

డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో 8నెలల కనిష్టానికి క్షీణించింది. ఈ ఆగస్ట్‌లో ఇప్పటికి 4.6శాతం నష్టపోయింది.  సుమారు ఆరేళ్ల అనంతరం ఒకనెలలో ఇంత శాతం పతనం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చైనా కరెన్సీ యువాన్‌ 11 ఏళ్ల కనిష్టానికి చేరుకోవడంతో వర్థమాన దేశీయ కరెన్సీలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి క్షీణత దేశీయ ఆర్థిక వ్యవస్థకు  శుభపరిణామం కాదు. ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ

Most from this category