జోరుగా ఫైనాన్షియల్ షేర్ల ర్యాలీ
By Sakshi

గత ఆరునెలలుగా నష్టాలను చవిచూస్తున్న ఆర్థిక రంగ షేర్లు మంగళవారం భారీగా లాభాల్ని ఆర్జిస్తున్నాయి. వచ్చే ఆర్బీఐ సమావేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఊరట కలిగించే అంశాలను ప్రకటించవచ్చనే అంచనాలు ఈ షేర్లకు డిమాండ్ పెంచుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫైనాన్షియల్ ఇండెక్స్ 2శాతం పెరిగింది. ఇండెక్స్ అత్యధికంగా ఎంఅండ్ఎం ఫైనాన్స్ సర్వీసెస్ 8శాతం ర్యాలీ చేసింది. ఎడెల్వీజ్ 6శాతం పెరిగింది. ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ జీఐ, పీఎఫ్సీ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఆర్ఈసీ లిమిటెడ్ షేర్లు 3శాతం, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ షేర్లు 2శాతం ర్యాలీ చేయగా, హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 1శాతం, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి.
You may be interested
త్వరలో ఆదాయపు పన్ను చెల్లింపుదార్లకు శుభవార్త?
Tuesday 22nd October 2019కార్పొరేట్ పన్ను తగ్గింపు తరహాలో త్వరలో ప్రకటన వెలువడే అవకాశాలు పన్ను స్లాబుల మార్పునకు కమిటీ సిఫార్సులు దీపావళి సమయానికి ప్రభుత్వ ప్రకటన ఉండొచ్చన్న అంచనాలు గత నెల కార్పొరేట్ పన్నును ప్రభుత్వం తగ్గించగానే, కార్పొరేట్ రంగానికి ముందస్తు దీపావళి వచ్చిందని అందరూ అభివర్ణించారు. నిజమైన దీపావళి మరికొద్ది రోజుల్లో ఉండగా ఈ దఫా వ్యక్తిగత ఆదాయపన్నుచెల్లింపుదారులకు కూడా ప్రభుత్వం అలాంటి బహుమానం ఇస్తుందన్న అంచనాలు పెరిగాయి. పలువురు ఆర్థికవేత్తలు కూడా వ్యక్తిగత ఆదాయపన్ను
డీఎల్ఎఫ్ 6% అప్
Tuesday 22nd October 2019డీఎల్ఎఫ్ మంగళవారం ట్రేడింగ్‌లో మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడంతో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ పాజిటివ్‌గా కదులుతోంది. మధ్యాహ్నాం 12.54 సమయానికి 0.99 శాతం లాభపడి 265.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో డీఎల్ఎఫ్ షేరు 6.01 శాతం లాభపడి రూ. 179.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 168.85 వద్ద ముగిసిన ఈ కంపెనీ షేరు, మంగళవారం సెషన్లో రూ. 170.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమై, రూ.