News


బడ్జెట్‌ టైంలో ఎఫ్‌పీఐలు ఏం చేస్తున్నాయి?

Friday 25th January 2019
Markets_main1548410259.png-23807

గత ఐదేళ్ల కాలంలో బడ్జెట్‌కు నెల రోజుల ముందు, తర్వాత ఎఫ్‌పీఐల ధోరణిని పరిశీలిస్తే బడ్జెట్‌కు ముందు తర్వాత కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ముందుగా ప్రీబడ్జెట్‌ నెలను పరిశీలిస్తే ఐదేళ్లలో మూడు సార్లు విదేశీ మదుపరులు నికర కొనుగోలుదారులుగా, రెండు దఫాలు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్‌పీఐలు 2016 బడ్జెట్‌కు నెల ముందు 11వేల కోట్ల రూపాయలు, 2017లో వెయ్యికోట్ల రూపాయల అమ్మకాలు జరిపారు. 2014, 2015, 2018లో మాత్రం సరాసరిన దాదాపు పదివేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. 


ఇక బడ్జెట్‌ తర్వాత నెలను పరిశీలిస్తే ఐదేళ్లలో రెండు సార్లు ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా, మూడుసార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. 2016, 2018లో ఎఫ్‌ఐఐలు అమ్మకాలకు మొగ్గు చూపగా, 2014, 2015, 2017లో మాత్రం దాదాపు 9-10 వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. 


ఈ రెండు గణాంకాలను పరిశీలిస్తే బడ్జెట్‌ సమయంలో ఎక్కువశాతం ఎఫ్‌ఐఐలు కొనుగోళ్లకే మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ దఫా ఎఫ్‌ఐఐలు స్తబ్దుగా ఉండొచ్చని కొందరి అభిప్రాయం. ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటును బట్టి విదేశీ మదుపరులు దేశీయ మార్కెట్‌పై ఒక అభిప్రాయానికి రావచ్చని ఎక్కువమంది నిపుణులు భావిస్తున్నారు. You may be interested

ఇప్పుడే ఎందుకు కొనాలి?

Friday 25th January 2019

మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్న తరుణంలో చాలామంది ఇన్వెస్టర్లు పొజిషన్లు వదిలించుకునేందుకు తయారవుతున్నారు. కానీ నాణ్యమైన మేనేజ్‌మెంట్‌, బలమైన మూలాలు ఉన్న స్టాకులను కొనుగోలు చేయడానికి ఇదే మంచి తరుణమని ఆనంద్‌ రాఠీ బ్రోకింగ్‌ సంస్థ సలహా ఇస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన ప్రైవేట్‌ వినిమియం మరింత విస్తరిస్తుందని అంచనా వేసింది. వేతనాల్లో బలమైన వృద్ధి, చమురు ధరలు దిగిరావడం, ప్రభుత్వవ్యయం పెరగడంతో వినిమయం మరింత జోరు చూపుతుందని తెలిపింది.

రియల్టీ షేర్ల పతనం

Friday 25th January 2019

మిడ్‌ సెషన్‌ అనంతరం రియల్టీ రంగ షేర్లలో భారీ అ‍మ్మకాలు జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతనిధ్యం నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఈ రంగానికి చెందిన డీఎల్‌ఎఫ్‌ కంపెనీ ఢిల్లీలోని ఉన్న ప్రధాన కార్యాలయంపై సీబీఐ దాడులు నిర్వహించారని మీడియాలో వార్తలు వెలువడంతో కంపెనీ షేరు 8శాతం పతనం రియల్టీ ఇండెక్స్‌ను బాగా దెబ్బతీశాయి. అలాగే యూనిటెక్‌ 3శాతం, శోభ 2.50శాతం, ఇండియాబుల్స్‌రియల్‌ఎస్టేట్‌, ఓబేరాయ్‌ రియల్టీ

Most from this category