News


ఎఫ్‌ఐఐల పునరాగమనం ఖాయం...

Friday 31st May 2019
Markets_main1559241962.png-26007

ఎన్నికల ఫలితాల ముందు అప్రమత్తతతో అమ్మకాలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు... తిరిగి భారత మార్కెట్లలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడం ఖాయమేనంటున్నారు మార్కెట్‌ నిపుణులు. సంస్కరణలు కొనసాగగలవన్న నమ్మకం, సానుకూల వ్యాపార వాతావరణం, ఆర్థిక రంగ బలం ఇవన్నీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే మన మార్కెటే ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లకు బలంగా ఉందని గుర్తు చేస్తున్నారు. 

 

ప్రస్తుత మే నెలలో28వ తేదీ వరకు మన ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.4,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఎఫ్‌ఐఐలు నికరంగా మన మార్కెట్లలో రూ.50,000కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరి 19 వరకు విక్రయాలు చేసిన ఎఫ్‌ఐఐలు, ఆ తర్వాత నికర కొనుగోలుదారులుగా మారిన విషయం గమనార్హం. ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఏప్రిల్‌ నెలలో రూ.16,093 కోట్ల చొప్పున ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. ఇక మే నెలలో అమ్మకాలకు దిగడానికి అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడం, ఎన్నికల ఫలితాలు స్పష్టమైన తీర్పునిస్తాయా అన్న దానిపై అనిశ్చితి నెలకొనడం వంటి అంశాలు కారణమయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికీ ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌ స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా ఉందని, దీంతో ఎఫ్‌ఐఐలు తిరిగి భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి చోదకంగా నిలుస్తుందన్న అంచనాతో నిపుణులు ఉన్నారు. 

 

చైనా కంటే భారత్‌ మరింత మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నట్టు మోబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపక భాగస్వామి మార్క్‌ మోబియస్‌ ఇటీవలే పేర్కొన్న విషయం గమనార్హం. ‘‘వర్ధమాన మార్కెట్‌ బాస్కెట్‌లో చైనా వెయిటేజీ 30 శాతంగా ఉంది. భారత్‌కు తక్కువ ఉంది. అయితే, భాతర మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెరుగుతుందన్న ఆశాభావం నాకుంది’’ అని మోబియస్‌ పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే భారత మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడం తాను ప్రారంభించానని ఆయన వెల్లడించారు. ఫైనాన్స్‌, సిమెంట్‌, పైపింగ్‌, కేబుల్‌ కంపెనీల పట్ల ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు. అయితే, మోదీ సర్కారు రెండో విడతలో ఏం చేయగలదన్న దానిపై విదేశీ ఇన్వెస్టర్లు ఒకింత అప్రమత్తతోనూ ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇప్పటికీ ఎఫ్‌ఐఐలు మన మార్కెట్‌ పట్ల సానుకూలంగానే ఉన్న అంచనా ఎక్కువ మంది నుంచి వ్యక్తమవుతోంది. బీఎస్‌ఈ 200 కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటా 2019 మార్చి నాటికి 24.1 శాతంగా ఉండడం పరిస్థితికి నిదర్శనం. అంటే మన ఈక్విటీ మార్కెట్‌ పట్ల వారిలో ఇప్పటికీ ఎంతో ఆసక్తి ఉందనేందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. గడిచిన ఐదేళ్లకు గాను నాలుగు సంవత్సరాల్లో ఎఫ్‌ఐఐలు నికరంగా మన మార్కెట్లలో పెట్టుబడి పెట్టినట్టు శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ హేమంగ్‌ కపాసి తెలిపారు. ‘‘మొదటి నాలుగేళ్లలో వారు 30.27 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేశారు. నికరంగా గత ఐదేళ్లలో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం 26 బిలియన్‌ డాలర్లు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 9.76 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేశారు’’ అని ఆయన తెలిపారు. You may be interested

నిఫ్టీ @ 12,000, సెన్సెక్స్‌ @ 40,000

Friday 31st May 2019

జూన్‌ డెరివేటివ్‌ సిరీస్‌కు తొలిరోజైన శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల స్థాయిని, నిఫ్టీ 12,000 పాయింట్ల స్థాయిని అధిగమించాయి. సెన్సెక్స్‌ 175 పాయింట్లు జంప్‌చేసి 40,010 పాయింట్ల స్థాయిని చేరగా, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 12,002 పాయింట్ల స్థాయిని చేరింది. అయితే ఈ రెండు సూచీలూ...గతవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా సాధించిన కొత్త రికార్డులకు మరికాస్త దూరంలో వున్నాయి. ఆ రోజున సెన్సెక్స్‌

మళ్లీ లాభాల ముగింపు

Thursday 30th May 2019

329 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  మే డెరివేటివ్స్‌ కాంటాక్టులు ముగింపు కారణంగా మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో గురువారం మార్కెట్‌ భారీ లాభంతో ముగిశాయి. అలాగే నేటి రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో సెన్సెక్స్‌, నిప్టీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్ల లాభపడి 39,832 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 11,946 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలున్నప్పటికీ, నేడు మార్కెట్‌ లాభంతో ప్రారంభమైంది.

Most from this category