News


ఎఫ్‌ఐఐలు వచ్చేస్తున్నారు!

Thursday 30th May 2019
Markets_main1559204965.png-26000

ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు  (ఎఫ్‌ఐఐలు) భారత మార్కెట్లోకి క్యూ కడుతున్నారు. సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, వ్యాపారనుకూల వాతావరణం, ఎకానమీ బలోపేతం చేయడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ఇతర వర్ధమాన మార్కెట్ల కన్నా భారత్‌వైపే విదేశీ మదుపరులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి మే మొదటివరకు చురుగ్గా వ్యవహరించిన ఎఫ్‌ఐఐలు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాల వరకు అప్రమత్తంగా వ్యవహరించారు. మే 28వరుకు ఎఫ్‌ఐఐలు దేశీయ మార్కెట్‌నుంచి దాదాపు 4వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపాయి. ఏడాది మొత్తానికి చూస్తే ఇంతవరకు ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 50వేల కోట్ల పెట్టుబడులు భారత మార్కెట్లో పెట్టారు. ప్రస్తుతం ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్‌ విదేశీ పెట్టుబడులకు అనువుగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో చైనా కన్నా భారత్‌ మంచి ప్రదర్శన చూపుతుందని మొబియస్‌ క్యాపిటల్స్‌ స్థాపకుడు మార్క్‌మొబియస్‌ అభిప్రాయపడ్డారు. వర్దమాన మార్కెట్లన్నింటిలో చైనా 30 శాతం వెయిటేజ్‌తో అగ్రస్థానంలో ఉందని, కానీ త్వరలో భారత మార్కెట్‌ క్యాప్‌ దూసుకుపోతుందని ఆయన చెప్పారు. తమ సంస్థ రెండు నెలల క్రితం నుంచే ఇండియాలో పెట్టుబడులు ఆరంభించిందన్నారు. ఫైనాన్స్‌, సిమెంట్‌, పైపింగ్‌, కేబుల్‌ రంగాలకు చెందిన కంపెనీలను ఎంచుకున్నామన్నారు. గత ఐదేళ్లలో ఒక్క 2018 మినహా నాలుగేళ్లు ఎఫ్‌ఐఐలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తొలి నాలుగేళ్లు విదేశీ మదుపరులు భారీపెట్టుబడులు పెట్టారని, ఈ ధోరణి ఈసారి కూడా కనిపించవచ్చని సాంక్టమ్‌వెల్త్‌కు చెందిన హేమాంగ్‌ కపాసీ చెప్పారు. భారత్‌లో రాజకీయ స్థిరత్వం వచ్చినందున ఇకపై ఎఫ్‌పీఐల పెట్టుబడులు దేశీయ మార్కెట్లో మరింత పెరగవచ్చన్నారు. 



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Thursday 30th May 2019

18 శాతం వృద్ధి చెందిన ఐస్‌ మేక్‌ లాభం హైదరాబాద్‌: మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ నికర లాభం రూ.7.83 కోట్లుగా నమోదయింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలానికి లాభం రూ.6.63 కోట్లుగా ఉంది. ఏడాదిలో 18.11 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆదాయం 27.44 శాతం వృద్ధితో రూ.129.58 కోట్లకు చేరుకుంది. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఇది రూ.101.68 కోట్లుగా ఉంది. 2019 ఆర్ధిక

ఏప్రిల్‌లో తగ్గిన విమాన ప్రయాణికుల రద్దీ

Thursday 30th May 2019

 ఐదేళ్ల కనిష్టస్థాయికి క్షీణత న్యూఢిల్లీ: గత నెల్లో దేశీ విమాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఆర్థిక సంక్షోభంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు నిలిచిపోయిన కారణంగా రెవెన్యూ ప్యాసింజర్ కిలోమీటర్ (ఆర్‌పీకే) వృద్ధి సైతం ఏడాది ప్రాతిపదికన 0.5 శాతం తగ్గిపోయిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తాజాగా వెల్లడించిన సమాచారం ద్వారా వెల్లడైంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మూత పడక ముందు వరకు రెండంకెల వృద్ధిరేటును నమోదుచేసిన భారత

Most from this category