News


విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు!

Wednesday 24th July 2019
Markets_main1563950830.png-27274

జూలైలో 120 కోట్ల డాలర్ల విక్రయాలు
దేశీయ మార్కెట్లో ఎన్నికల ముందు భారీ కొనుగోళ్లు జరిపిన విదేశీ సంస్థాగత మదుపరులు బడ్జెట్‌ అనంతరం భారీగా అమ్మకాలకు దిగారు. సూపర్‌రిచ్‌పై బడ్జెట్లో విధించిన సర్‌చార్జ్‌పై అసంతృప్తిగా ఉన్న ట్రస్ట్‌ స్ట్రక్చర్‌ ఎఫ్‌ఐఐలు విక్రయాలకు దిగారు. జూలైలో ఇంతవరకు ఎఫ్‌ఐఐలు దాదాపు 120 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. ఇదే కొనసాగితే క్షీణత పరంగా గత అక్టోబర్‌ తర్వాత జూలై నెల అత్యంత అధ్వాన్న నెలగా నిలవనుంది. ఈ నెల్లో ఇంతవరకు సూచీలు దాదాపు 4 శాతం వరకు పతనమయ్యాయి. వెల్త్‌టాక్స్‌తో పాటు ఎర్నింగ్స్‌ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఎఫ్‌ఐఐలు విక్రయాలు ముమ్మరం చేశాయని వర్ధమాన మార్కెట్ల వ్యూహకర్త మార్టిన్‌ జాన్‌ బక్కుమ్‌ చెప్పారు. ఎన్నికల తర్వాత మంచి ప్రదర్శన జరిపిన సూచీలు మదుపరులకు లాభాలు తెచ్చాయని, దీంతో చాలామంది ప్రాఫిట్‌బుకింగ్‌కు దిగారని తెలిపారు.

ఎన్నికల ముందు ఎఫ్‌ఐఐల నిధులతోనే మార్కెట్లలో భారీ ర్యాలీ వచ్చిందన్నారు. ఎఫ్‌ఐఐలు ఎన్‌డీఏ గెలుపుతో మరింత సంబరపడ్డారని, కానీ బడ్జెట్లో విధించిన కొత్త పన్ను వారి సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రతినిధి సౌరబ్‌ ముఖర్జీ వివరించారు. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు ఎఫ్‌ఐఐలు దాదాపు 1140 కోట్ల డాలర్లను ఇండియా ఈక్విటీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ప్రస్తుతం విదేశీ మదుపరుల దృష్టిలో మన మార్కెట్ల ముందు చాలా సమస్యలున్నాయని ఇన్వెస్కో వైస్‌ చైర్మన్‌ కృష్ణ మెమాని చెప్పారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్ల వాల్యూషన్లు చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటు బడ్జెట్‌ పన్ను పెంపు, లిక్విడిటీ కొరత, వృద్ది మందగమనం, రూపీ ఆశించినంత బలపడకపోవడం వంటి కష్టాలున్నాయన్నారు. అందువల్ల ఎఫ్‌ఐఐలు ఇండియా మార్కెట్‌పై నెగిటివ్‌గా మారాయన్నారు. ప్రస్తుతం ఇండియా మార్కెట్లో చిన్న స్టాకులు వాల్యూషన్ల పరంగా ఆకర్షణీయంగా ఉన్నా, రిస్కులు కూడా ఎక్కువేనని చెప్పారు. 



You may be interested

దేశీయ డిమాండ్‌ బలహీనం!

Wednesday 24th July 2019

భారత్‌ ఆర్థిక వ్యవస్థపై  ఐఎంఎఫ్‌ విశ్లేషణ 2019, 2020 వృద్ధి రేట్ల  అంచనాలు 0.3 శాతం కోత ఈ రెండేళ్లలో వృద్ధి 7, 7.2 శాతాలు మాత్రమే అంతర్జాతీయంగానూ వృద్ధి అంతంతే వాషింగ్టన్‌: భారత్‌ దేశీయ వినియోగ డిమాండ్‌ అవుట్‌లుక్‌​అంచనాలకన్నా బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విశ్లేషించింది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఈ ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ కారణంగా 2019, 2020కి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.3 శాతం (30

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

Wednesday 24th July 2019

21 శాతం వృద్ధి రూ.29,636 కోట్లకు నికర అమ్మకాలు  రూ.2.9 లక్షల కోట్లకు ఆర్డర్‌ బుక్‌  న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌ దిగ్గజం, ఎల్‌ అండ్‌ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,473 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,215 కోట్లతో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. నికర అమ్మకాలు 27,005 కోట్ల నుంచి

Most from this category