News


విదేశీ ఇన్వెస్టర్ల రాడార్‌లో మిడ్‌క్యాప్స్‌!

Tuesday 26th November 2019
Markets_main1574764390.png-29874

-సునిల్‌ సుబ్రమణ్యం
‘పూర్తి లార్జ్‌క్యాప్‌లను మాత్రమే కాకుండా మిడ్‌క్యాప్‌ విభాగాన్ని కూడా ఎఫ్‌ఐఐ(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు)లు పరిశీలిస్తున్నారు’ అని ఎండీ, సీఈఓ, సుందరమ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, సునిల్‌ సుబ్రమణ్యం ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...
మార్కెట్ ర్యాలీ కొన్ని స్టాకుల వలనే..
మార్కెట్లో కొన్ని స్టాకుల మాత్రం ర్యాలీ చేస్తున్న విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు అధికంగా వీటిపై దృష్ఠి సారించలేరు.  మార్కెట్లు పడిపోతాయనే భయాలు ఉన్నప్పటికి, ప్రస్తుతం మార్కెట్లు కొత్త గరిష్ఠాలకు చేరుకోవడంతో, మందగమనంలో కూడా మార్కెట్లు మంచి రాబడుల్ని ఇవ్వగలుగుతున్నాయనే ఆలోచనను ప్రజలకు కలిగిస్తున్నాయి. అందువలన ఈ సందర్భాన్ని సంతోషంగా జరుపుకోవాలి. 
లార్జ్‌క్యాప్‌లను మిడ్‌క్యాప్‌లు అందుకుంటాయి.. 
ఈ త్రైమాసికంలో కంపెనీల ఫలితాలను గమనిస్తే, మిడ్‌ క్యాప్‌లు స్పష్టంగా లార్జ్‌క్యాప్‌లను అధిగమించాయనే విషయం అర్ధమవుతుంది. అందు వలన లార్జక్యాప్‌లు అధికంగా పెరిగితే, మిడ్‌ క్యాప్‌లు కూడా విలువ పరంగా వీటిని అందుకుంటాయి. కానీ దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉం‍ది. లార్జ్‌క్యాప్‌ విభాగంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) 18 శాతం వాటా కలిగినందున, ర్యాలీలో అవి ముందున్నాయి. ఎఫ్‌ఐఐలు ర్యాలీని నడిపిస్తే, విలువ పరంగా లార్జ్‌క్యాప్‌లకు, ఇతర ఇండెక్స్‌లకు మధ్య గణనీయమైన తేడా ఏర్పడుతుంది. అందువలన ఆటోమెటిక్‌గానే లార్జ్‌క్యాప్‌లను ఈ ఇండెక్స్‌లు అందుకుంటాయి. ప్రస్తుత ట్రెండ్‌ చూస్తుంటే.... ఎఫ్‌ఐఐలు లార్జ్‌క్యాప్‌ల విభాగాన్ని దాటి, మిడ్‌ క్యాప్‌ విభాగాలను పరిశీలిస్తున్నారనే విషయం అర్ధమవుతోంది. ఇప్పుడు పెద్ద మిడ్‌క్యాప్‌లపై వారు దృష్ఠి సారించడం ప్రారంభించారు. లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ల మధ్య ఏర్పడిన అంతరమే మార్కెట్లను భవిష్యత్‌లో ముందుకు నడిపిస్తుంది.  
ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లో పెరిగింది...
గత మూడు నెలలలో ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లో పెరిగింది. ఇది ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ,. 90,000 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో డీఐఐ(దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు)ల నుంచి రూ. 50,000 కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఎఫ్‌ఐఐల ఇన్‌ఫ్లో అధికంగా ఉం‍డడంతో సాధరణంగానే నిర్ధిష్టమైన లార్జ్‌క్యాప్‌లు పెరుగుతున్నాయి. లార్జ్‌క్యాప్‌ విభాగంలో కూడా బ్యాంకులు మాత్రమే అధికంగా ర్యాలీ చేశాయి. నిఫ్టీ లాభాల్లో 70 శాతం వరకు బ్యాంకుల నుం‍చే రావడం గమనార్హం. రుణాల శాతం తగ్గినప్పటికి ప్రైవేటు బ్యాంకులు మంచి ప్రదర్శనను చేశాయి. వీటికి ఎన్‌బీఎఫ్‌సీలు లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులు పోటి ఇవ్వకపోవడం గమనార్హం. ఇండియా ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ విభాగంలో ఎఫ్‌ఐఐలు 35 శాతం ఎక్స్‌ఫోజర్‌ను కలిగివున్నాయి. అంతేకాకుండా ఈ విభాగంలో అధికంగా కొనుగోళ్లు జరగుతున్నాయి. You may be interested

ఈ ర్యాలీ ఆశ్చర్యకరం!

Tuesday 26th November 2019

ఎఫ్‌ఐఐల నిధులే కారణం మహేశ్‌ పటేల్‌ మంగళవారం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలు నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలు ఆల్‌టైమ్‌ హైని తాకాయి. యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై సానుకూల అంచనాలు, క్యు2లో ఎర్నింగ్స్‌ బాగుండడం తదితర కారణాలు సూచీలను నడిపించాయి. సెప్టెంబర్‌ 19 కనిష్ఠాల నుంచి సూచీలు దాదాపు 13 శాతం ర్యాలీ జరిపాయి. ఈ అప్‌మూవ్‌ అనూహ్యమని, గణాంకాల ఆధారితంగా రాలేదని, కేవలం అంతర్జాతీయ లిక్విడిటీ పెరగడం, అంతర్జాతీయ సానుకూల పవనాల కారణంగా వచ్చిందని

రికార్డుస్థాయిని అందుకున్న నిఫ్టీ షేర్లు రెండే..!

Tuesday 26th November 2019

మార్కెట్‌ మంగళవారం ట్రేడింగ్‌లో ఆల్‌టైం హైని తాకింది. ప్రధాన సూచీలైన సెనెక్స్‌ 41,120 వద్ద, నిఫ్టీ 12,132.45 తమ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 31,813.70 వద్ద నూతన ఆల్‌టైంకి చేరుకుంది. ముఖ్యంగా సెన్సెక్స్‌ కొద్దిరోజుల క్రితం కొత్త రికార్డును నెలకొల్పినా, ఈ ఫీట్‌ సాధించడంలో వెనుకబడి వున్న నిఫ్టీ ఎట్టకేలకు మంగళవారం కొత్త రికార్డును సృష్టించింది. సాధారణంగా ఇండెక్స్‌లు జీవితకాల గరిష్టాన్ని అందుకున్న ప్రతిసారీ

Most from this category